Friday, August 4, 2023

KNITTING (నిట్టింగ్ ) --స్వెటరు



KNITTING  

నిట్టింగ్ 

  స్వెటరు 


                                                                         KNITTING

                                                                           స్వెటరు  

 

కావలసిన   వస్తువులు  :--- 

10  ఔన్సుల    ఊలు  

12 వ నెంబర్     సూదులు  - 2

10 వ నెంబర్ సూదులు  - 2 

12 వ నెంబర్    రెండు వైపులా   పదునుగా   వున్న  సూదులు  -  4

( ఇది  మెడ  పట్టి   అల్లునప్పుడు  ఉపయోగపడును . )


 కొలతలు :--

భుజము నుండి   కింద   అంచువరకు   22  అంగుళములు 

ఈ   స్వేటర్    పొడవు  = 22  అంగుళములు

                        వెడల్పు =  36 అంగుళములు

చేతి  పొడవు  =  18 1/2  అంగుళములు

టెన్షన్   :--10  నెంబర్   సూదులతో   7 1/2  కుట్లు    9 1/2  వరుసలు    ఒక 

 చదరపు  అంగుళమునకు   అల్లవలెను  . 

ముందు  భాగము  :---  

12 వ  నెంబరు   సూదుల    నుపయోగించి   121  గుండీలు   ( stitches ) వేయవలెను.  

ఒంటి   రిబ్   3 3/4 

 అంగుళాలు  అల్లవలెను.

మొదటి  వరుస  :--   K1 P1  ఆఖరి   గుండి (stitch  )  K1  రావలెను.  

రెండవ  వరుస :--   P1  K1  ఆఖరి  గుండి (stitch  )  P1  రావలెను.

తరువాత  వరుస  :---  ఒక   వరుస  నిట్  ఒక  వరుస   పర్ల్   అల్లవలెను.

ఈ  విధంగా   అల్లుతూ   ప్రతి  వరుసకు  ఒక  గుండీ ( stitch)  

పెంచుతూ   ,  136  గుండీలు (  stitches)  వచ్చువరకు  

అల్లవలెను.   ఈ    136   గుండీలతో  (stitches  )  13  

అంగుళాలు   అల్లవలెను.

మెడను  విభజించుట :---

మొత్తము     గుండీలను   సరిగ్గా   రెండు 

 సమభాగాలుగా  విభజించవలెను.   68  గుండీలు ( stitches  )

 రెండు   వైపుల   ఉండవలెను.  ఈ    68   గుండీలు (stitches  )

 సూదికి    ఎక్కించుకుని 

 ఎడమవైపు    మెడభాగమును    అల్లవలెను. 

 మిగత   68  గుండీలను  (stitches  ) ఒక   పెద్ద  పిన్నుకు  గాని   ఒక  సూదికి   గాని  ఎక్కించుకొని 

  ఉంచుకోవలెను.

ముందు భాగము  యొక్క  చంకభాగము   షేపు  చేయుట:---

చంక  భాగము   వైపు   8  గుండీలు (  stitches ) ముగించి   మిగత 

 గుండిలను   ( stitches) నిట్  అల్లవలెను.  

తరువాత   వరుస  పర్ల్  అల్లవలెను.

చంకవైపు  రెండు  గుండీలు ( stitches )  కలిపి  నిట్  అల్లి   ,  లైను అంతా   నిట్  అల్లవలెను.

తరువాతి  వరుస   పర్ల్   అల్లవలెను.

ఈ      విధంగా   9  సార్లు   అల్లాలి.   (  అంటే    గుండిలు  ( stitches)తగ్గుతాయి.)

ఇదే  విధంగా   అల్లుతున్నప్పుడు  మెడవైపు   కూడా 

 ప్రతి   5  వ  వరుసకొకసారి   రెండు   గుండిలు ( stitches ) కలిపి 

  నిట్   అల్లవలెను.    

చంక షేపు   వచ్చిన  తరువాత  చంకవైపు   గుండీలు  ( stitches)

తగ్గించడం  మానివేసి     మెడవైపు   ప్రతి   4

  వ  వరుసకు  ఒకసారి   గుండీలు ( stitches )

 తగ్గించవలెను.  ఆఖరికి  36  గుండీలు (stitches )

 వచ్చిన  తరువాత   చంక  భాగము  మొదలు 

 నుండి    8 3/4  అంగుళాలు   పొడవు  వరకు 

 అల్లవలెను .

భుజము  షేపు   చేయుట  :---

మొదటి   వరుస  :---12  గుండీలు   ( stitches )ముగించి   లైను   అంతా    నిట్   అల్లవలెను.   

రెండవ  వరుస  :---పర్ల్    అల్లవలెను.

 మూడవ   వరుస  :----12 గుండీలు  ( stitches )ముగించి   లైను   అంతా   నిట్  అల్లవలెను.

నాలుగవ   వరుస  :---పర్ల్  అల్లవలెను.

ఐదవ వరుస:---12  గుండీలు  ( stitches )  ముగించి   లైను   అంతా   నిట్  అల్లవలెను.

ఇప్పుడు   పిన్నుకు  పెట్టిన    గుండీలను   68

 గుండీలను   (stitches )సూదులకు   ఎక్కించుకొని   ఎడమ 

 వైపున    అల్లిన   విధంగా నే    అల్లవలెను. 

 కుడివైపున   అల్లవలెను.  దీనితో   ముందుభాగము 

  పూర్తిఅగును.   

వెనుక భాగము :--

వెనుక భాగము  కూడా   ముందు   భాగమువలె    చంకవరకు   అల్లుకోవలెను .  


వెనుక   భాగము  యొక్క  చంకభాగము   షేపు చేయుట :---

గుండీలు   (  stitches)  ముగించి   లైను  అంతా   నిట్  అల్లవలెను.

 గుండీలు   (stitches )ముగించి   లైను  అంతా   పర్ల్  అల్లవలెను.

ప్రతి     నిట్  వరుసలో   రెండు  వైపులా    రెండు  గుండీలు  ( stitches )కలిపి   నిట్  అల్లాలి .

తరువాత   వరుస   పర్ల్  అల్లవలెను.

ఈ  విధంగా   108  గుండీలు   (stitches )వచ్చేంత  వరకు  అల్లవలెను.

ముందు   భాగము  భుజముతో  సమానంగా   వచ్చేంత  వరకు  అల్లవలెను.

వెనుక  భాగము  వైపు  భుజము  షేపు  చేయుట :---

మొదటి   వరుస  :--

12  గుండీలు ( stitches ) ముగించి   ఆఖరి  వరకు  నిట్  అల్లాలి.

రెండవ వరుస :-- 12  గుండీలు  (stitches  )ముగించి   ఆఖరి  వరకు  పర్ల్  అల్లాలి.

మూడవ వరుస :-- 

12  గుండీలు ( stitches ) ముగించి   ఆఖరి  వరకు  నిట్  అల్లాలి

నాలుగవ  వరుస  :--

12  గుండీలు  ( stitches )ముగించి   ఆఖరి  వరకు  పర్ల్ అల్లాలి

ఐదవ  వరుస  :--12  గుండీలు ( stitches )ముగించి   ఆఖరి  వరకు  నిట్  అల్లాలి

 ఆరవ వరుస  :-- 12  గుండీలు (stitches  )  ముగించి   ఆఖరి  వరకు  పర్ల్ అల్లాలి.

మిగిలిన   36 గుండీలను  ( stitches)ముగించవలెను.


మెడ   పట్టీ :----

దీనికి    నాలుగు  సూదులు  రెండు    వైపులా     పదునుగా 

  ఉన్నవి  ఉపయోగించవలెను.

ముందుభాగము ,  వెనుక   భాగముల   భుజము లను   కలిపి

   కుట్టిన    తరువాత

Right side   158  గుండీలు  ( stitches ) సూదులకు   

ఎక్కించుకొని     ఒంటి రిబ్   అల్లుటకు  మొదలుపెట్టవలెను . 

' V '  ఆకారము   దగ్గర   ఒక   గుండి (stitch  )  తగ్గించుతూ   మధ్య    కుట్లకు  

SL 1 , K 1 , P . S . S .O , K 2    tog   చొప్పున   వేస్తూ  9   సార్లు   అల్లి 

 ముగించవలెను . 

చేతులు :---

12  వ   నెంబర్   సూదులు  నుపయోగించి    72  గుండీలు  వేయవలెను . 

ఒంటి రిబ్    3   అంగుళములు  వేయవలెను  .  

10  వ   నెంబర్    సూదులకు  మార్చుకొని   స్వేటర్ కు  వేసిన   నమూనాను  వేస్తూ 

అంటే    ఒక   వరుస   నిట్   ఒక   వరుస  పర్ల్   అల్లవలెను  . 


ప్రతి   3  వ   వరుసకు   ,  వ   వరుసకు   రెండు వైపులా   ఒక  గుండి ( stitch )

 పెంచుతూ  116   గుండీలు ( stitches )  వచ్చువరకు   అల్లవలెను .   


తరువాత  ప్రతి   4  వ వరుసకు   రెండువైపులా   ఒక  గుండి  ( stitch )పెంచుతూ  

 126  గుండీలు   వచ్చేంత   వరకూ   గుండీలు  పెంచవలెను. 

ఈ    126   గుండీలతో  ( stitches )  18 1/2 ''   పొడవు    వచ్చువరకు   అల్లవలెను  . 

చేతిపై   భాగము  షేపు   చేయుట  :-- 

మొదటి   వరుస :---  గుండీలు  (stitches  ) ముగించి   నిట్   అల్లవలెను . 

రెండవ    వరుస :--- 5   గుండీలు ( stitches ) ముగించి   పర్ల్  అల్లవలెను . 

మూడవ వరుస   :---   5   గుండీలు(  stitches )   ముగించి   నిట్   అల్లవలెను . 

నాలుగవ   వరుస  :---    గుండీలు  ( stitches ) ముగించి    పర్ల్    అల్లవలెను . 

ఐదవ  వరుస      :---       గుండీలు ( stitches )  ముగించి   నిట్   అల్లవలెను . 

ఆరవ  వరుస      :---      గుండీలు  ( stitches ) ముగించి    పర్ల్    అల్లవలెను . 

ఏడవ  వరుస           :---    గుండీలు  (stitches  ) ముగించి   నిట్   అల్లవలెను . 

ఎనిమిదవ   వరుస   :--   గుండీలు  (stitches  ) ముగించి    పర్ల్    అల్లవలెను . 

తొమ్మిదవ   వరుస      :---2   గుండీలు (stitches  )ముగించి   నిట్   అల్లవలెను . 

పదవ  వరుస    :---    గుండీలు  (stitches ) ముగించి    పర్ల్    అల్లవలెను . 


ఇప్పుడు   రెండు  గుండీలు  ( stitches )కలిపి    నిట్  అల్లి   వరుస   అంతా  నిట్  

అల్లి  ఆఖరి    రెండు    గుండీలు   (stitches  )కలిపి    నిట్    అల్లవలెను  .  

ఈ     విధంగా     30    గుండీలు  (stitches   ) వచ్చేవరకు   అల్లవలెను . 

ఇప్పుడు   30   గుండీలు  (stitches ) ముగించవలెను . 

ఇంకొక  చెయ్యి    కూడా  ఇదే విధంగా    అల్లవలెను . 

                                     భుజములను     ప్రక్క   భాగములను     చేతులను   గట్టి  కుట్టు  తో 

  కుట్టవలెను. 



























  












Friday, July 28, 2023

(KNITTING )నిట్టింగ్ - బేబీ మాటిని కోట్

KNITTING 

నిట్టింగ్  

బేబీ  మాటిని  కోట్







                          బేబీ   మాటిని  కోట్ 

పొడవు  = భుజము   నుండి  అంచువరకు = 12 అంగుళములు 

చేతి  పొడవు  =  4 1/2   అంగుళములు 

వెనుక  భాగము ,  ముందు  భాగములు   అన్నియు   చంక  భాగము   వరకు   ఒకే     

భాగముగా అల్లవలెను 

( కాస్ట్ ఆన్   )  =   247   గుండీలు   (stitches   )వేయవలెను . 

మొదటి   8    వరుసలు   =  నిట్   అల్లవలెను . 

9 వ  వరుస   :--  నిట్  అల్లవలెను   ఆఖరి   8  గుండీలు   (stitches   )పిన్నుకు                 


ఎక్కించవలెను.   ఇది   ముందు   భాగము   పట్టీ కి    ఉపయోగించవలెను . 

10 వ   వరుస   :-- పర్ల్  అల్లవలెను  .    231  పర్ల్   అల్లవలెను .   గుండీలు   (  stitches)పర్ల్   


అల్లి   ఆఖరి    8   గుండీలు   (stitches)పిన్నుకు  ఎక్కించుకోవలెను .  ఇది రెండవ   పట్టికి       

ఉపయోగించు  కోవలెను . 

మిగిలిన    231    గుండీలతో ( stitches)     అంగుళాలు   డిజైన్   అల్లవలెను . 

ఒక   వరుస  నిట్   ఒక     వరుస   పర్ల్     అల్లవలెను . 

బాడీ   భాగము  :---   బాడీ అనగా     మధ్య  భాగము   షేప్    వచ్చుటకు   

గుండీలు   ( stitches)తగ్గించుతూ  పోవలెను . 

*   K 6    (K 3   tog  )  3  సార్లు   *   పువ్వు  గుర్తు   నుండి    ఆఖరి   6  గుండీల   వరకు   , K 6

 ( 141  గుండిలు  ( stitches) సూది   మీద   ఉండును ) .   


ఇప్పుడు     1/2  అంగుళము   వరకు   ఒక   వరుస   నిట్    ఒక   వరుస పర్ల్    

అల్లవలెను . 

ఇప్పుడు   పూర్తిపొడవు    8 1/2    అంగుళములు    అగును . 

ఇప్పుడు    చంక  భాగముల   కొరకు   విభజించుకోవలెను . 

తరువాత    వరుస   :---    33   గుండీలు (stitches) నిట్   అల్లి   4  గుండీలు   ముగించాలి .  

తరువాత  

67  గుండీలు (stitches)  మళ్ళీ   నిట్   అల్లి    గుండీలు   ( stitches)  ముగించవలెను .   మిగతా   

33  గుండీలు  (stitches) నిట్   అల్లవలెను  . 

                     ఇప్పుడు    33   గుండీలు  (stitches)ముందు   ఎడమ   భాగము  ,  67  

గుండీలు  (stitches) వెనుక భాగమునకు ,   తరువాత    33  గుండీలు  ( stitches) ముందు   

కుడిభాగము . 

మొదట   ముందు  భాగము  :----   33   గుండీలు   (stitches) మీద   అల్లడం  ప్రారంభించాలి . 

చంకభాగము  వైపు    ప్రతి   వరస    విడిచి  వరుసకు    ఒక్కొక్క   కుట్టు   చొప్పున  

 తగ్గించుతూ     గుండీలు  (stitches)  వరకు   తగ్గించి   సూది మీద     28    గుండీలు (stitches)

ఉండు  వరకు   అల్లవలెను .   క్రింద   నుండి   11  అంగుళములు   వచ్చువరకు     

ఒక వరుస     నిట్   ఒక వరుస   పర్ల్   అల్లవలెను  .    అనగా  2 1/2   

అంగుళములు   అల్లవలెను.   (మొదటి   8 1/2 అంగుళములకు    2 1/2  

 అంగుళములు   అల్లితే   మొత్తము  11  అంగుళములు వస్తుంది ). 


మెడ   ఒంపు   అల్లుట  :---   

మొదటి    వరుస   :--  రెండు     గుండీలు(stitches)   ముగించి    నిట్   అల్లవలెను.   

రెండవ    వరుస    :---  పర్ల్   అల్లవలెను  . 

మూడవ    వరుస   :---  రెండు     గుండీలు(stitches)   ముగించి    నిట్   అల్లవలెను.   

నాలుగో వరుస       :---  పర్ల్   అల్లవలెను. 

ఐదవ  వరుస          :---  రెండు     గుండీలు   (stitches)ముగించి    నిట్   అల్లవలెను.   

ఆరవ వరుస           :---   పర్ల్   అల్లవలెను. 

ఏడవ   వరుస         :---   రెండు     గుండీలు   (stitches)ముగించి    నిట్   అల్లవలెను.   

ఎనిమిదవ    వరుస :--   పర్ల్   అల్లవలెను. 

ఇప్పుడు   సూది మీద    20  గుండీలు  (stitches)  ఉండును   .   వీటిని   ముగించవలెను . 


వెనుక  భాగము  :---   67   గుండీలతో  ( stitches)    అల్లవలెను   .   ప్రతి   వరుస   విడిచి   

వరుసకు  రెండు వైపులా  ఒక్కొక్క  గుండి(stitch)   చొప్పున  నాలుగు  సార్లు   తగ్గించి   

సూది మీద   59  గుండీలు  (stitches)ఉండు     వరకు    అల్లవలెను .    ఈ    59  గుండీలతో   (stitches)

డిజైన్     అల్లవలెను. 

ముందుభాగము    వైపు     ఉన్నంత     పొడవు    వెనుక భాగము  వైపు   కూడా   

అల్లి     మొదట 20  గుండీలు  ( stitches)     ముగించి   వరుసంత    నిట్   అల్లవలెను.  

తరువాతి   వరుసలో   

20 గుండీలు(stitches)    ముగించి   వరుసంత      పర్ల్   అల్లవలెను  .   మిగిలిన   19   

గుండీలను   (stitches)ముగించవలెను. 

రెండవ   ముందు భాగము  :-- మిగతా   33   గుండీలతో    మొదటి   ముందు 

భాగము   అల్లిన విధంగానే    అల్లవలెను .   

ముందు వైపు   పట్టి  :---  ఈ   పట్టి  పై    బటన్స్  ,  బటన్  హాల్స్    కుట్ట  వలెను . 

పిన్నుకు    తగిలించి   ఉంచిన    8   గుండీలను( stitches)   సూదికి    ఎక్కించి   ( గార్టర్  స్టిచ్ )

అన్ని వరుసలు    నిట్   అల్లవలెను .    పూర్తిగా    11  అంగుళములు   అల్లవలెను .    

కావలిసిన చోట    బటన్   హాలు    చేయ వలెను. 

బటన్  హాల్స్  చేయు  పద్ధతి   :---- 

 బటన్  హాల్స్  మొదటి వరుస   : --- K 3  ,  రెండు   గుండీలు  (stitches) ముగించి  K  

 ఆఖరి వరకు    అల్లవలెను. 

 బటన్  హాల్స్ రెండవ   వరుస   :--- K 3  రెండు   గుండీలు   (stitches)చేతితో   వెయ్యాలి    

K  ఆఖరి వరకు    అల్లవలెను.

చేతులు   : ---   36   గుండీలు ( stitches)   వేయవలెను  . 

15 వరుసలు    నిట్   అల్లవలెను   .  

16  వరుస   నుండి   :-- ఒక   వరుస    నిట్    అల్లవలెను 

                                          ఒక   వరుస    పర్ల్      అల్లవలెను. 

తరువాత    ప్రతివరుసకు  ఒక   గుండిని (stitch  )   పెంచుతూ   51   గుండీలు   

వచ్చేవరకు  15  వరసలు   అల్లవలెను  .   ఇప్పుడు    సూది పై    51   గుండీలు    

ఉండవలెను.   

ఇప్పుడు   డిజైన్  (  ఒక   వరుస    నిట్    అల్లవలెను , ఒక   వరుస    పర్ల్      

అల్లవలెను. )

 4 1/2  అంగుళాలు    వచ్చువరకు   అల్లవలెను. 

చేతి    పై భాగము  అల్లుట :--- 

రెండు   గుండీలు ( stitches ) కలిపి   నిట్   అల్లి   వరసంత   నిట్   అల్లవలెను  .   

రెండు   గుండీలు (stitches) కలిపి   పర్ల్   అల్లి   వరసంత   పర్ల్    అల్లవలెను  .   

ఈ   విధంగా   37   గుండీలు (stitches) వచ్చేంత  వరకు    అల్లవలెను 

రెండు  గుండీలు (stitches)  ముగించి   వరుసఅంతా     నిట్   అల్లవలెను . 

రెండు  గుండీలు (stitches)  ముగించి   వరుసఅంతా     పర్ల్    అల్లవలెను . 

ఈ   విధంగా   29   గుండీలు (stitches)   వచ్చేంత  వరకు    అల్లవలెను . 

మూడు    గుండీలు  (stitches) ముగించి   వరుసఅంతా     నిట్   అల్లవలెను . 

మూడు    గుండీలు  (stitches) ముగించి   వరుసఅంతా     పర్ల్   అల్లవలెను . 

ఈ   విధంగా   11  గుండీలు  (stitches)  సూది   మీదకు  వచ్చేంత  వరకు    అల్లవలెను . 

తరువాత    11    గుండీలను (stitches)  ముగించవలెను . 

రెండవ  చేయి     కూడా     ఈ  విధముగా నే      అల్లవలెను.  

మెడ  పట్టి  :---  ముందు     భాగము      వెనుకభాగములను    భుజముల    వద్ద  

కలిపి కుట్టుకోవలెను .  51    గుండీలను  (stitches)   RIGHT SIDE   మెడ   చుట్టూ  ఎక్కించి  

ఆరు   వరుసలు. అన్ని  వరుసలు    నిట్   అల్లి    ముగించవలెను  .    ఈ   మెడ   

పట్టిని   SWEATER   లోపలి భాగమునకు      సగం   మడిచి  కుట్టవలెను . 

చేతులను    చంకకు    కలిపి    కుట్టవలెను    .   బటన్స్ ను   బటన్  హోల్    కి  

సరిపోయేవి     తీసుకొని    కుట్టవలెను. 










Sunday, November 8, 2020

మిషను ఎంబ్రాయిడరీ - అలంకారపు కుట్లు

            7.  అలంకారపు  కుట్లు

1. రన్నింగ్ ( Running ) :---



దీనికి  పైన  క్రింద   కూడ   సిల్క్  దారాన్ని  ఉపయోగించవలెను.  ఫ్రెషర్  ఫుట్ ని   తీసివేసి   ఫ్రేమ్ ను   బట్ట యొక్క  వెనక వైపున   బిగించవలెను.  డిజైనును   బట్ట  నునుపు  వైపు  వేసి  అది  సూదికిందకు తెచ్చి  ఫ్రెషర్  బార్  ను  కిందకు  దించవలెను.బాబిన్  దారము  పైకి  తెచ్చుకోవలెను. డిజైను  ననుసరించి  మామూలు  మిషను కుట్టు  కుట్టునట్లే  కుట్టవలెను.   ఈ   రన్నింగ్   కుట్టుతో  పువ్వులు  ,  ఆకులు  ,కొమ్మల  మధ్య  భాగాన్ని  పూరించవచ్చు.   ఈ  ఎంబ్రాయిడరీ   ఏ  విధమైన   బట్టపైన  అయిన  చేయవచ్చును.

2.  కార్డింగ్ ( Carding ):—



డిజైనును   తిన్ననివైపు  వేసి  ఫ్రేమ్  బట్ట  వెనుకవైపున  బిగించవలెను.  బట్ట అప్పుడు  వెనుకకు  తిప్పిన  నునుపు  వైపు  అగును. డిజైను  భాగమును  ఫ్రెషర్  బార్  కిందకు  జరిపి ,   ఫ్రెషర్  బార్  ను  కిందకు  దించవలెను.  బాబిన్  దారం  పైకి     తెచ్చుకోవలెను.  డిజైను  అవుట్  లైను  ను    మామూలు  రన్నింగ్

కుట్టుతో  కుట్టి ,   దాని   మీద  ఫ్రేమ్  ను  అటు  ఇటు  కదుపుతూ   కార్డింగ్  కుట్టు  కుట్టవలెను.  ఈ  ఎంబ్రాయిడరీ   గుడ్డ  కంటే   కాస్త  ఎత్తుగా  కనబడి   డిజైను  బాగుగా  కనబడునట్లు  చేయును.  దీనికి  పైన  కింద   సిల్క్   దారమును ,  లేదా  పైన  సిల్క్  దారము ,  బాబిన్  నందు  నూలు  దారమును  ఉపయోగించి  కూడ  చేయవచ్చును.   ఇది  అన్ని    రకములైన   వస్త్రములపైన   చేయవచ్చును.  ఇదే  కార్డింగ్  కుట్టు   ఎప్లిక్   ( Applique  work ) పనిచేయునప్పుడు ,  నెట్  వర్క్(  Net work )   చేయునప్పుడు,  ఐలెట్  పని ( Eyelet work )  మరియు  కాటన్  పని   ( Cotton  work ) చేయునప్పుడు   ఎక్కువ   ఉపయోగపడును.      

3. రవుండ్  స్టిచ్   ( Round  stitch ):--- ఈ 



 ఎంబ్రాయిడరీకి  సాధారణంగా  లావు  దారం  సూదికి  ,  సన్నటి  దారం  బాబిన్  లోను  ఉంచి  చేయవలెను.   కింది  టెన్షన్ ను  వదులుచేసి  పై  టెన్షన్ ను  బిగించ వలెను.    ఫ్రెషర్  ఫుట్  ను   తీసివేయవలెను.  డిజైనును   బట్టకు  నునుపువైపు   వేయవలెను.   ఫ్రేమ్  బిగించిన    తరువాత     ఫ్రెషర్    బార్   ను  పైకి   ఎత్తి     ఫ్రెషర్ బార్   కింద  డిజైనుగల  భాగమును   తేవలెను.  బాబిన్  దారమును  కూడ  ఒక    కుట్టుకుట్టి  పైకి  తెచ్చుకోవలెను.   డిజైనును  అనుసరించి   కుట్టు  గుండ్రముగా   ఫ్రేమును  తిప్పుతూ   కుట్టవలెను.  ఈ  కుట్టు  చిన్న చిన్న  చక్రాలవలె  అందముగా  కనపడును. 

స్కాలోపింగ్   (Scalloping ) :---

ఈ  ఎంబ్రాయిడరీని   కార్డింగ్  తో  చేయవలెను.   ఇది  టెబుల్  క్లాత్  అంచులకు , చీర  అంచులకు  వాడుదురు. ఇది  చివర  అంచులందు  దారాలు  ఊడిపోకుండా  చేయుటయే  కాక  అంచుకు  ఒక  అందాన్ని  ఇచ్చును. సన్నటి  దారము  పైన  కింద  కూడ  వేసి  చేయవలెను.  లేదా  కుట్టు  గట్టిగా  ఎత్తుగా  కనపడవలెనంటే  పైన  సిల్క్  కింద  నూలు  దారాన్ని  వాడవలెను.ఇది  ఒక  డిజైనులో  వేసిన  తరువాత  ఆ  డిజైను  ననుసరించి  బట్టను  కత్తిరించవలెను.  ఇది  వేసిన  పిదప  దీనికి  మీద  పువ్వులు  , ఇతర  ఎంబ్రాయిడరీలైన  చేయవచ్చును.   అంచులు  ఆర్చెస్    వలే  కనబడును.

5.  సాటిన్  స్టిచ్  (Satin  stitch ) :--



ఈ  కుట్టు  బాగా  కుదరవలెనంటే    బాబిన్  లోను  సూదికి  కూడా  లావు  దారము  వేసి  కుట్టవలెను.   చేతితో  ముద్ద కుట్టు  ఏ విధంగా  కుడతామో  అదే  విధంగా  మిషను  మీద  సాటిన్  కుట్టు   కుట్టవలెను.  దీనిలో  కుట్టు  దగ్గర  దగ్గర  గా  ఉండి  వత్తుగా  , అందముగా  కనబడును.  డిజైను  గల  భాగము  గుడ్డకన్నా  ఎత్తుగా  కనబడును. ఈ  కుట్టు కుట్టుటకు    ముందు  రన్నింగ్  కుట్టు కుట్టవచ్చును.

6. ఎప్లిక్  వర్క్ ( Applique  work)  :--- 



ఎప్లిక్  కుట్టు పనికి  సొంపును  కూర్చు  కళ.  మామూలు   ఎంబ్రాయిడరీ  కంటే  తక్కువ  కాలములో   పెద్ద   పెద్ద  రంగులతో  కూడిన   నమూనాలను  తయారు  చేయవచ్చును.  మనకు  కావలసిన   అనేక    ఆకారములలో   గుడ్డను  కత్తిరించి  ఈ  ముక్కలను  నేర్పుతో  వేరొక  బట్ట పై  కుట్టవలెను.  ప్రస్తుతం  ఈ  కళను  బజారు  సంచులు, టేబులు క్లాతులు  , తెరలు  కుషను  కవర్లు  మొదలగు  వాటిని  అందంగా  తయారు  చేయుటకు  ఉపయోగించుచున్నారు.  నూలు  బట్టలు, ఉన్ని  బట్టలు,  సిల్క్  బట్టలు  మొదలగునవన్నియు  ఇందుకు  ఉపయోగించ   వచ్చును.  పుష్పములు, ఆకులు , జంతువులు , కొమ్మలు  ఏఏ  భాగములకు  సరిపడు  బట్టను  ఆయా  భాగములకు   తీసుకొని  దానిని   ముందుగా  ఇస్త్రీ   చేయవలెను. తరువాత   నమూనాను  కత్తిరించవలెను.  నమూనా  అంచులను కూడ  మడవ  వలెనన్న   అక్కడక్కడ  కత్తెరతో  గాట్లు   పెట్టి  వెనుకకు  మడిచి   ఇస్త్రీ   చేయవలెను.  జిగ్  జాగ్  మిషను  నందు   కుట్టుటకు  మడవ నక్కరలేదు.

ఆ  మిషను  నందు   దానికదే  మడత  పడుతూ   కుట్టుటకు  ఏర్పాటు  కలదు .ఈ   విధంగా   మడతపెట్టిన   నమూనాలను   టాకా  కుట్టుతో   కుట్టి  తరువాత  దానిని  అలాగే  ఎంబ్రాయిడరీ   చేయవలసిన  బట్టపై  నునుపు  వైపు  పెట్టి  మొదట  రెండింటిని   కలిపి  టాకా  వేయవలెను.   తరువాత    దానిమీద  కార్డింగ్  చేయవలెను.   చేతితో  చేయు  ఎప్లిక్  కి   మిషను  మీద  చేయు  ఎప్లిక్  కు  తేడా  ఈ  కుట్టునందే  కలదు.  చేతితో  చేయునప్పుడు  చుట్టూ  బ్లాంకెట్  స్టిచ్  చేయాలి. మిషను  నందు  కార్డింగ్  చేయాలి.  గుడ్డ  యొక్క  నిలువు  అడ్డములు ,  దానిపై  అతుకు  నమూనా  యొక్క  నిలువు అడ్డముల  ననుసరించి  యుండవలెను.  లేనిచో  ఎప్లిక్    కుట్టునప్పుడు   ముడతలు   పడగలవు.  

            ఈ   ఎప్లిక్   నమూనాను  కత్తిరించకుండా  కూడ  కుట్టవచ్చును.

దీనికై  ముందుగా   డిజైను  ట్రేస్  చేయవలెను.  తరువాత      ఆగుడ్డను  ఎప్లిక్  చేయవలసిన  గుడ్డపై  నునుపు  వైపు  పెట్టి   చుట్టూ  టాకా వేయవలెను.   తరువాత    డిజైనును  అనుసరించి  రన్నింగ్  చేయవలెను.  రన్నింగ్   చేసిన   తరువాత     రన్నింగ్  చుట్టూ  ఎక్కువగా  నున్న  బట్టను   రన్నింగ్   వెంబడి  కత్తిరించి  వేయవలెను.   తరువాత   ఈ  రన్నింగ్   మీద  కార్డింగ్  చేయవలెను.  మిషను   మీద   చేయు  ఎప్లిక్  పని  త్వరగా  అగుటయే  కాక   చేతితో  చేసిన  దానికన్నను   చక్కగా   కనబడును.  దీనికై   డిజైను  ననుసరించి   వివిధరంగులు   వాడవలెను.  ఉదాహరణకి  పువ్వులు   ఆకులు  ఉన్నయెడల   ఎరుపు  రంగు  ఆకుపచ్చ  రంగు  కొమ్మలున్నయెడల  మట్టిరంగు  (Brown )   వాడవలెను.   ఈ  విధంగా  రకరకాల  రంగులు  ఉపయోగించి  బట్టకు  ఎంతో  సొంపును  తేవచ్చును.

7. నెట్ పని ( Net work ) :--- 



దీనికై  నెట్   లేదా  వలగుడ్డను   ఉపయోగించవలెను.  ఈ  వల గుడ్డ    పెట్టి   కుట్టవలసిన  గుడ్డ  వెనుకవైపున   వలగుడ్డ   పెట్టి   టాకా  వేయవలెను.  ముందునున్న  గుడ్డ  పై   డిజైనును  గీసి  డిజైను  వెంబడి  రన్నింగ్  చేయవలెను.  ఆ  రన్నింగ్  వెంబడి   కార్డింగ్  చేయవలెను.  తరువాత   పైన  ఉన్న  గుడ్డను  డిజైనును  అనుసరించి   లోపలివైపు  కత్తిరించవలెను.   అప్పుడు  కార్డింగ్  చేసిన  వలగుడ్డ   మాత్రము   కనబడును.  ఇది  కూడ  గుడ్డకు  ఒక  అందము  నిచ్చును.

8. ఐలెట్  కుట్టు (Eyelet   work ) :----



మొదట  డిజైనును   నునుపు  వైపు   ట్రేస్  చేయవలెను.   ఫ్రెషర్  బార్   కిందకు  డిజైనును   జరిపి   చుట్టు రన్నింగ్   చేయవలెను.  తరువాత  రన్నింగ్  వెంబడి  కార్డింగ్  చేయవలెను.

కార్డింగ్  చేయుటకు  ముందు  డిజైను  మధ్యలో   ఖాళీ  ఏర్పడి  కన్ను  ఆకారములో  కనబడును.

  ఇదే కన్ను  ఆకారము   పెద్ద  సైజు  చేయవలసి  వచ్చినప్పుడు  డిజైను  యొక్క  ఆకారము  చెడిపోకుండా    ఆ  డిజైను  మధ్యలో   కూడా సన్నగా   కార్డింగ్  చేయవలెను.  ఈ  మధ్యలో  ఉన్న  కార్డింగ్   డిజైను  యొక్క   రెండుచివరలను   కలిపి  ఉంచుతుంది.

ఆకారాన్ని  చెడగొట్టదు.  పెద్ద  పెద్ద  పువ్వులు  మొదలగునవి  చేసినప్పుడు  కూడా  మధ్యమధ్యలో  ఇలా  కార్డింగ్  చేయవలెను.  మధ్యలో  చేసిన  కార్డింగ్  వదలి  ఈ  వైపు  ఆ  వైపు   నున్న  గుడ్డను  కత్తిరించవలెను.

9.  లాంగ్  అండ్  షార్ట్  ( Long  and  short ) :---



డిజైనును  బట్ట   నునుపు  వైపు     వేసి  వెనుక  వైపు  ఫ్రేమ్  ను   బిగించవలెను.  తరువాత   డిజైనును   ఫ్రెషర్ బార్   కిందికి   తీసుకొచ్చి     ఫ్రెషర్ బార్ ను  కిందకి     దించి   ఎంబ్రాయిడరీ   చేయుటకు  ప్రారంభించవలెను.   బాబిన్  లోని  దారాన్ని  కూడా   పైకి  తెచ్చుకోవలెను.   దీనికి   పైన ,  కింద   కూడ   సిల్క్  దారాన్ని   ఉపయోగించవలెను.    షేడెడ్   దారమైతే  మరింత  అందముగా  ఉండును.   ఇది  సాటిన్   స్టిచ్   వలె  కుట్టవలెను.  కాని    సాటిన్ స్టిచ్  లో  వలె  అన్ని  కుట్లు    సమానముగా  ఒకే  మోస్తరుగా   ఉండవు.    డిజైన్   పూరించుటలో   కొన్ని  పొడవు   కుట్లను    కొన్ని   పొట్టి  కుట్లను   ఒక  వరుస     తరువాత    మరియొక   వరుస   ప్రక్క  ప్రక్కన   వేయవలెను.   ఒక  పొట్టి  కుట్టు  , ఒక  పొడవు  కుట్టు  తో   ఈ  కుట్టు  కూడ   చూచుటకు  అందముగా  ఉండును.  ఈ   కుట్టుతో   ఆకులు,  పువ్వులు ,  మొగ్గలు   అన్ని  కుట్టవచ్చును.  రెండు  రకములయిన  కుట్లకలయిక  కనుక  లాంగ్  అండ్   షార్ట్   అని  పేరొచ్చినది.   

10.  కాటన్  వర్క్  ( Cotton  work):--- ఈ   కాటన్  వర్క్  చేయుటకు  బేండేజ్  కాటన్  వాడవలెను.   అది  పొరలు  పొరలు  గా  చుట్టబడి   వుండును.  కనుక  దాన్ని  గుడ్డపైన   పరవడం  తేలిక  మరియు   అన్ని   వైపుల   సమానముగా   ఉండును.   మనకు  కావలసిన   డిజైనును   ఒక  పేపరు  పై  వేసుకో వలెను.      గుడ్డపై  నునుపు  భాగమున     కాటన్   ఒక  పొర  పరిచి  దానిపై  ఈ  డిజైన్   కాగితమును   వుంచి  డిజైన్  చుట్టు  రన్నింగ్   చేయవలెను.   డిజైన్  అవుట్  లైన్  రన్నింగ్  చేసిన   తరువాత  మెల్లగ   కాగితమును   చింపి   వేయవలెను.     రన్నింగ్  కుట్టు   ఉన్నందున     కాటన్  బట్టకు   అతకబడి  ఉండును.  డిజైన్   పేపర్   చింపివేసిన  తరువాత   రన్నింగ్  వెంబడి  కార్డింగ్  చేయవలెను.  తరువాత  మధ్యలో   ఏవైన  భాగాలున్న  అవి  రన్నింగ్  తో  గాని   కార్డింగ్  తో  గాని  కుట్టవలెను.    ఈ  కాటన్  తో   కుందేలు,  కుక్క ,  ఏనుగు   మొదలైన    బొమ్మలు  కూడ  కుట్ట  వచ్చును.  వాటి  కండ్లు  మొదలగునవి  పూసలు  గాని  చెమ్కీలు  గాని   కుట్టి  పూర్తి  చేయవలెను.  దీనికి  పైన  కింద    సిల్క్  దారాన్ని   వాడవలెను.  పైన  సిల్క్ ,  కింద  కాటన్  కూడ   వాడవచ్చును.

                     ఈ   మిషను ఎంబ్రాయిడరీ  

    లన్నీ  కూడ  మిషను  నెమ్మదిగా  తొక్కుతూ   ఫ్రేమ్  ను   మిషను  కదలికతో   పాటు  నెమ్మదిగా  కదుపుతూ  చేయవలెను.    ఏ  మాత్రము  తేడా  వచ్చినా   దారం  తెగిపోవడం  జరుగుతుంది.  తరువాత  టెన్షన్   సరిచేసుకుంటు   కుట్టవలెను.  ముందుగా  వ్రాసిన  జాగ్రత్తలు   చదువుకుని  వాటిని  పాటించుతు   మిషను  ఎంబ్రాయిడరీని   చేయవలెను.

సూదితో  ఎంబ్రాయిడరీ   చేయుట:—

(Embroidery   with  needle )

బట్టపై  నురగవైపు  నమూనాను  గీసుకొని  ఫ్రేమ్  ను  బిగించవలెను.  ప్రెషర్ బార్  ని   పైకి   ఎత్తి   నమూనాను  సూది  కిందకి  జరిపి    కుట్టుపని  సాగించవలెను.

                ఒక  పెద్ద  సూదిని   తీసుకొని  నమూనాపై  పెట్టి  సూదికిటు  అటు  కార్డింగ్  చేయవలెను.  అలా  సూదిని  జరుపుకుంటూ   కార్డింగ్  చేయవలెను.  కార్డింగ్  చేయడం  పూర్తి అయిన  తరువాత  సూదిని  తీసివేయవలెను. సూదిని  పెట్టి  చేయడం  వలన  ఈ  కార్డింగ్  ఎత్తుగా  కనబడును.    దీనితో  పువ్వులు  , ఆకులు , కొమ్మలు,  మొగ్గలు  అన్నియు  ఎంబ్రాయిడరీ  చేయవచ్చును.  కుట్టు  సరిగ్గా   సూదికి  ఈ  ప్రక్క   ఆ  ప్రక్క  పడవలెను.   ఏ  మాత్రము  తేడా  వచ్చిన   రెండు సూదులు  ఒకదాని  కొక్కటి  తగిలి  మిషను   సూది  విరిగిపోవును.

-----------------------------------------------------

2. ట్వయిన్  దారముతో  ఎంబ్రాయిడరీ  చేయుట (  Twine  work )  :--- 

 బట్ట పై   నురగ  వైపు  నమూనాను  గీసుకుని    ఫ్రేమ్ ను   బిగించవలెను.  ప్రెషర్  బార్   ను  పైకి  ఎత్తి  సూది  కిందకు  ఫ్రేమును  జరిపి     డిజైను  వెంబడి  ట్వయిన్  దారాన్ని   పెట్టి  ఇటు  అటు  కార్డింగ్  చేయవలెను.  ఈ  విధంగా  చేయుట వలన  కార్డింగ్  చేసిన  భాగము  ఎత్తుగా  కనపడును.  కుట్టు  సమానముగా  వచ్చును.  

-----------------------------------------------------

3. కార్డింగ్ ( Carding ) :---

డిజైను    గీతల   వెంబడి  ముందు  రన్నింగ్  కుట్టు   కుట్టి  తరువాత   ఆ  కుట్టు  కిటు  అటు  సూదిని  కదుపుతూ   కార్డింగ్   కుట్టు కుట్టవలెను.    ఇది  కొమ్మలకు  ఆకులకు  వాడిన   అందముగా  కనబడును.  ఎప్లిక్  ,  ఐలెట్  ,  కట్ వర్క్  మొదలగు  ఇతర  కుట్లు  కుట్టడానికి   కార్డింగ్  కుట్టు  ప్రధానమైనది.

---------------------------------------------------4. కట్  ఎంబ్రాయిడరీ  (Cut  work ) :--  డిజైను   గుడ్డ పై  వేసుకున్న  తరువాత  ఫ్రేమును  బిగించి   ప్రెషర్  బార్ ను  పైకెత్తి    సూది  కిందకు  వచ్చునట్లుగా   జరిపి   నమూనా  వెంబడి  కార్డింగ్  చేయవలెను.   కార్డింగ్  పూర్తిగా  చేసిన  తరువాత   నమూనా  లోపలి  వైపు  కత్తిరించవలెను.  లేదా   మొదట   నమూనా  లోపల  కత్తిరించిన   తరువాత  అంచు వెంబడి   కార్డింగ్  చేయవలెను.  ఈ  విధంగా  రెండు రకాలుగా   కూడా   చేయవచ్చును.  డిజైను  పెద్దగా  ఉన్న  యెడల  మధ్యభాగము  కత్తిరించునప్పుడు  ఆకారము  చెడిపోయే   అవకాశము  కలదు.  కనుక  నమూనా  మధ్యలో  కూడా  అక్కడక్కడ   కార్డింగ్  చేయవలెను.

ఈ   ఎంబ్రాయిడరీ    కత్తిరించి  చేయుట  వలన  కట్ ఎంబ్రాయిడరీ   అని  పేరు  వచ్చింది.


Sunday, January 5, 2020

మిషను ఎంబ్రాయిడరీ - 1. మిషను నందు చేయవలసిన మార్పులు

                మిషను  ఎంబ్రాయిడరీ 
1. మిషను నందు చేయవలసినమార్పులు
 కొన్ని  సులభమైన  మార్పులు చేసి  మిషను  ఎంబ్రాయిడరీ  చేయుట. దీనికి  మిషను  నందు:

1. ప్రెషర్  ఫుట్  ను  తొలగించుట.
2. ఫీడ్  డాగ్ ను   మార్పుచేయుట
3.టెన్షను  మార్పుచేయుట

మొదలైన  మార్పులు   మిషను  నందు  చేసి  ఎంబ్రాయిడరీకి  పనికి  వచ్చువిధంగా  తయారుచేయవలెను. 

  2. ప్రెషర్  ఫుట్  ను  తొలగించుట


ప్రెషర్  బార్  ని  పైకి  ఎత్తి  స్ర్రూని  విప్పి  ఫ్రెషర్  ఫుట్ ని  తొలగించవలెను.

3. ఫీడ్  డాగ్  మరియు  బాబిన్  టెన్షన్  

ఫీడ్ డాగ్  ను  మార్పుచేయుటకు   201 క్లాస్  మిషన్స్  లో   మిషను   వెనుకకు  
మరల్చవలెను.  బాబిన్  టెన్షన్ ను  మిషన్స్ నందు  రెగ్యులేట్ చేయవలెనంటే   సైడ్ ప్లేట్   ఎడమ ప్రక్కకు  తొలగించి  టెన్షన్  స్ర్రూను సరిచేయవలెను.  టెన్షను  ఎక్కువ  చేయవలెనన్న   స్ర్రూని మనవైపు  తిప్పవలెను.  టెన్షన్   తక్కువ  చేయవలెనన్న  స్ర్రూని   అవతలి వైపుకు  తిప్పవలెను.

సింగర్  మిషన్  నందు  ఫీడ్  డాగ్  మార్పుచేయుట:  
సింగర్   ( singer 15 - 90 ) 15-90 మరియు  15 - 91  క్లాస్  మిషను  నందు  మిషన్ ను  వెనుకకు  మరల్చి  తంబ్  స్ర్రూని  తీసివేయవలెను.

  4. బాబిన్  త్రెడ్  టెన్షన్  సరిచేయుట 

బాబిన్  త్రెడ్  టెన్షన్  ను   15 - 90 మరియు  15 - 91  క్లాస్  మిషన్  నందు 
బెడ్  సైడ్  ప్లేట్   ప్రక్కకు   తొలగించి  బాబిన్    కేస్  ను  బయటికి  తీయవలెను.  స్ర్రూ   ద్వారా  టెన్షన్  సరిచేయవలెను. ఈ  స్ర్రూ  బాబిన్  కేస్  బయటి  వైపు  అమర్చబడి యున్నది.  టెన్షన్   ఎక్కువ   చేయవలెను.    స్ర్రూ   ని  కుడి  ప్రక్కకు  ,  టెన్షన్  తక్కువ  చేయవలెనన్న   స్ర్రూని   ఎడమ ప్రక్కకు   తిప్పవలెను.  

సింగర్  221  - 1 మరియు  66  మిషన్లయందు  బాబిన్   టెన్షన్   సరిచేయుట :
  ఈ   మిషన్  నందు  బాబిన్  పైన  
ఫీడ్  కవర్  ప్లేట్   ఉంటుంది.  దానికి  ఒక  స్ర్రూ   బిగించబడిఉంటుంది.    ఈ   ప్లేట్  సులభంగా  తీయవచ్చు.  బాబిన్  కేస్  ను   పైకి  తీసి    టెన్షన్   స్ర్రూ  ద్వారా  సరిచేయవచ్చు. టెన్షన్  ఎక్కువ  చేయవలెనన్న  స్క్రూను  కుడివైపుకు,  తక్కువ   చేయవలెనన్న   స్ర్కూ  ని  ఎడమవైపునకు  తిప్పవలెను.
బాబిన్  త్రెడ్ టెన్షను  66_16  మరియు  66_18  మిషన్  నందు  మార్పుచేయుట:-
 ఈ  మిషను  నందు  బాబిన్  ఒక ప్రక్కకు  ఉండక  వెల్లకితల  పైకి  కనబడుతూ  ఉండును.  దీనికై  బెడ్ సైడ్  ప్లేట్  ను  ప్ర క్కకి  తొలగించి  పెద్ద స్క్రూ ని  తిప్పి  టెన్షన్    సరిచేయవలెను.  టెన్షన్  ఎక్కువ  చేయవలెనన్న  స్క్రూని  మన వైపునకు  త్రిప్పవలెను.  టెన్షన్  తక్కువ  చేయవలెనన్న  స్క్రూని అవతలి వైపునకు   తిప్పవలెను.  

          5.  పై టెన్షన్  సరిచేయుట 

ముందు  చెప్పిన  వన్నియు  బాబిన్  కేస్  నందు,  బాబిన్ నందు  టెన్షన్  సరిచేయుటకు  పనికి  వచ్చును.  ఇప్పుడు  మిషను  పై భాగమునందు గల సూది  ,  దారము  యొక్క టెన్షన్  సరిచేయుట తెలుకోవలెను.  ఇది  టెన్షన్  కంట్రోల్  ద్వారా  చేయవలెను.  ఎప్పుడు  గాని  ప్రెషర్ ఫుట్  కిందనున్నప్పుడే  ఈ  టెన్షన్  కంట్రోల్  చేయబడును. టెన్షన్ ఎక్కువ  చేయవలెనన్న  తంబ్  నట్ ను  కుడివైపునకు,  తక్కువ చేయవలెనన్న  తంబ్ నట్  ను  ఎడమవైపునకు  తిప్పవలెను.  'న్యూట్రల్ '  కుట్టును  ముందుకు,  వెనుకకు  రానీక రెగ్యులేట్  చేస్తుంది.

గమనిక :-- ప్రతి  మిషనుకు  నంబరు  ఇవ్వడం  జరిగింది.  ఒక్కొక్క  మిషనుకు  బాబిన్ ,  బాబిన్  కేస్  అమరిక  వేరీవేరుగా  ఉన్నవి. కొన్నింటికి  సైడుకు, కొన్నిటికి  మధ్యన  ఉన్నవి.  అది  గమనించుకొని  మనము  మిషను  నందు  మార్పులు  చేయునపుడు  ఏ  మిషనుకు   ఏ   మార్పులు  చేయవలెనో  అవే  మార్పులు  చేయవలెను. అదే  విధంగా  బాబిన్  టెన్షన్  సరిచేయునప్పుడు  కూడ   రెండు రకములైన  కేస్  లు   చూపించడమైనది.   ఏ బాబిన్  కేస్  ననుసరించి   ఆ  మార్పులు   చేయవలెను.  

6. మిషను  ఎంబ్రాయిడరీ  చేయునపుడు  తీసుకోవలసిన  జాగ్రత్తలు

ఎంబ్రాయిడరీ   ఫ్రేమ్  ఉపయోగించకుండ   ఎంబ్రాయిడరీ  చేయరాదు.  అచ్చునందు  బట్ట  మరీ  వదులుగాను  మరీ  బిగుతుగాను గాక  సమంగా   బిగించవలెను.  ఎక్కువ  లాగరాదు.  ఎంబ్రాయిడరీ ఫ్రేమ్   కదలిక  మిషను   కదలికలో   కలియవలెను.  అప్పుడే  కుట్టు నునుపుగా  , సమంగా వచ్చును.  కదలిక  ఎక్కువ  త్వరగా  గాని,  మెల్లగా  గాని  అయిన  దారం తెగిపోవడం,  కుట్టు  అవకతవకలుగా  రావడం  జరుగుతుంది.  ముందుగా  ఒక  పాత  గుడ్డను  తీసుకుని  కుట్లు  సమానంగా  వచ్చువరకు,    సాధన  చేయవలె.  ఎంబ్రాయిడరీ   ఫ్రేమ్  ఎప్పుడు  గాని  డిజైన్  ఉన్న  భాగమున  కాక  వెనకవైపున  బిగించవలెను  అనగా  ఫ్రేమ్ వెనకవైపున    డిజైను  వచ్చును.  ఆ  డిజైనును   సూది   కింద  అమర్చి ఎంబ్రాయిడరీ  చేయవలెను.  సిల్క్  దారమును   ఉపయోగించి  ఎంబ్రాయిడరీ  చేయవలె.  కొన్ని కొన్ని  కుట్లకు   సూదికి  సిల్క్  దారము  బాబిన్  లో   నూలు దారము పెట్టి  కూడ  చేయవచ్చును.



Wednesday, June 19, 2019

ఫ్రెంచ్ నాట్ - ( FRENCH KNOT )





ఫ్రెంచ్  నాట్ :---సూదిని దారంతో  గుడ్డ పైకి  గుచ్చిన  తరువాత  దారము   సూది చుట్టూతా   చుట్టి   తిరిగి సూదిని  అదే  స్థలములో       క్రిందికి  గుచ్చవలెను.  ఇదే  విధంగా    దగ్గర  దగ్గర గా  వేస్తే  పువ్వు వలె       తయారగును. ఇది  ఒక ముడి  వలే  ఉండును.   దీనిని   పువ్వు  యొక్క  పుప్పొడి  కి  కుట్టుదురు.                    

ముడి కుట్టు - (DOUBLE KNOT )


(DOUBLE KNOT  ):--   ముడి   కుట్టు :— దీనిని   ఎక్కువ  పోగుల   దారముతో  కుట్టవలెను.   అన్ని  ముడులనీ  సమాన  సైజు లో  కుట్టిన   పూసలు  కుట్టినట్టుగా   ఉండును.

56 . రోజ్ కుట్టు ( Bullion knot)






రోజే స్టిచ్ :-- (  Bullion knot) :---  ఫ్రెంచ్ నాట్  లను  దగ్గర దగ్గర  గా  మూడు  ,  నాలుగు    వేసిన  రోజే స్టిచ్ గా తయారగును.