Wednesday, December 7, 2011

టైలరింగ్ - 26 . సాదా జాకెట్

సాదా   జాకెట్





సాదా   జాకెట్  











కొలతలు:---
చాతి = ౩౦"
పొడవు  = 1/3 చాతి  + 3" = 13"
చేతి   పొడవు   =  1/3 చాతి  = 10"
భుజము    = 1/6 చాతి + 1 1/2" = 6 1/2"
కాగితపు   కొలతలు :---
పొడవు  =  30" 
వెడల్పు  = 18" 
కాగితమును    మడచుట :---
వెడల్పును    మధ్యకు   మడచి   మడతను   కుడివైపున   వుంచవలెను . పొడవును   మధ్యకు    మడచి   మడతను   పైన  వుంచవలెను .
నిర్మాణము :---వెనుక   భాగము  :---   
A B   =  పూర్తిపోడవు + 1" మడత   కొరకు 
A C   =  1/4 చాతి - 1/2"
C C1 = 1/4 చాతి + 1 1/2" 
A D   =  1/2 భుజము + 1/4"
D D1 = క్రిందికి  తిన్నగా   కలుపుము  .
A E   = 1/12 చాతి 
D E1  = 1/2 " క్రిందికి  'D' నుండి  
E E1  =  కలుపుము .
A F    = 1"
E F    = వెనుక   మెడ   కలుపుము .
D1 H  = 1 1/2" 
C1 H E1 = వెనుక   చంక   కలుపుము .
C C1  =  B B1
B1 G  =  1/2" లోపలికి 
C1 G  =  కలుపుము .
 B G   మద్యబిండువు = X
X  వద్ద    డార్ట్     కుట్టవలెను .
డార్ట్   పొడవు   = 5"
డార్ట్   వెడల్పు  = 1/2"  
ముందుభాగము :---
A F1  = 5"
E F1  = ముందుమెడ   కలుపుము .
D1 H1  = 1" పైకి   D1 నుండి
C1 H1 E1 = ముందుచంక   కలుపుము .
నమునాను   కత్తిరించుట  :---
వెనుక    భాగామునకై   F E ,  E E1 ,  E1 H C1 , C1G , కత్తిరించావలెను . ముందుభాగామునకై   నమునాను   తెరచి 
F1 E ,  E1 H1 C1  కత్తిరించావలెను . ముందుభాగామును  
F1 B    వద్ద   కత్తిరించిన    రెండు   ముందు భాగములు   విడివిడిగా   వచ్చును .  వీటిపై   డార్ట్ లు   గుర్తించవలెను .
ముందు   భాగమున   డార్ట్ లు   గుర్తించుట :--
E   నుండి  1"  దూరమున   = O  గుర్తించవలెను .
O R      =  1/4 చాతి 
C1 M   =  2 1/2"
M M1   =  పొడవు  = 2 1/2"
                 వెడల్పు = 1/4" 
 C1 G   =  మద్యబిండువు   P 
 P P1    =  పొడవు  =  4" 
                 వెడల్పు  = 1/2"
G B      =  మద్య  బిందువు  = Y 
Y Y1    =  పొడవు  =  ౩"
                వెడల్పు =  1"
F1 B    =  మద్యబిండువు  =  L
L L1    =  పొడవు  = 3 "
                వెడల్పు  = 1/2"
B X1    =  1/2"  క్రిందికి   B  నుండి  
ముందుభాగామునకై   ఎక్కువతీసుకొనవలెను .
చేతులు :---
పొడవు   =  1/3 పొడవు  = 10"
వెడల్పు  =   1/4 చాతి - 1" = 6 1/2"
కాగితపు   కొలతలు :--- 
పొడవు  =  20 " ( రెండు  చేతి  పొడవులు )
వెడల్పు  = 13 " ( రెండు   వెడల్పులు  )
కాగితమును   మడచుట :---
వెడల్పును   మద్యకుమడచి   మడతను   కుడివైపున   వుంచవలెను .  పొడవును   మద్యకుమడచి  మడతను  పైన   వుంచవలెను .
చేతుల  నిర్మాణము :--- 
A B  = 1/4 చాతి - 1"
A C  = పూర్తి   పొడవు  +2" 
A B   = C D 
A C   = B D
A E   =  1/12 చాతి + 1/2"
E B   = తిన్నగా   కలుపుము .
E B   = మద్యబిండువు  O  .
O X   = 1//2"  పైకి   O  నుండి 
E X B  = కలుపుము  .
EOB    =  కలుపుము.
C F   =  1"  లోపలి కి 
E F   =  ప్రక్క   భాగమును   కలుపుము .
కుట్టు  విధానము  :--












1.  భుజములను   సాధారణ   అతుకుతో  కుట్టవలెను . 
2.  ముందు   భాగమున  డార్ట్ లను    జాగ్రత్తగా    గుర్తించి    కుట్టవలెను
3.  వెనుక   భాగమున   డార్ట్  లను   కుట్టవలెను .
4.  ముందుభాగమున    హుక్స్    పట్టిలను   కుట్టవలెను .
5.  మెడను   పైపింగ్   తో  గాని   నకిలిమడతతో కుట్టి    ముగించావలెను 
6.  చేతులను    అతుకవలెను .
7.  చేతులను   అడుగు   భాగమున  1/2" వాలు   కుట్టు   కుట్ట  వలెను
8.  చేతుల   ప్రక్కభాగాములు ,  జాకెట్    ప్రక్కభాగాములను    కలుపవలెను .
9. నడుము   వద్ద   చుట్టూ   1 1/2"  పట్టిని   అతికి   లోపలికి 
   మడచి  వాలు   కుట్టు   కుట్ట   వలెను . 
సరిపడుబట్ట   :---
2/2  ,2/1 ,  రూబి  మొదలగునవి . 
బట్ట   అంచనా  :---
 రెండు  బాడీ   పొడవులు   +  రెండు   చేతి   పొడవులు .  

-----------------------------------------------------------------------------------

Monday, December 5, 2011

టైలరింగ్ - 25 . ఛిన్నపిల్లల జాకెట్



                 ఛిన్నపిల్లల    జాకెట్ 
కొలతలు:---
చాతి        =  24"
పొడవు    =  1/2  చాతి +2"  = 14"
భుజము  =  1/2 చాతి - 1" = 11"
చేతి   పొడవు  = 1/4 చాతి  = 6"
కాగితపు   కొలతలు :--- 
పొడవు    =  28" ( రెండు   పొడవులు )
వెడల్పు   =   16" ( అడుగున   వెడల్పుకు   రెండింతలు )
కాగితమును   మడచుట :-- 
వెడల్పును    మధ్యకు   మడచి  మడతను    కుడి   వైపున   
ఉంచవలెను . పొడవును   మధ్యకు   మడచి  మడతను  పైన  ఉంచవలెను .  
నిర్మాణము  :---
వెనుకభాగము :---
 A B   =  పూర్తి   పొడవు  = 14" 
A C    =  1/4  చాతి - 1"
C C1  =  1/4 చాతి + 1 1/2"
A D    =  1/2 భుజము  + 1/4"  
D D1  =  తిన్నగా    కలుపుము .
A E    =   1/12  చాతి 
D E1  =  1/2"  క్రిందికి    ' D ' నుండి 
E E1  =  కలుపుము  .
A F    =  1" వెనుక    మెడ  
E F    = మెడ   కొరకు   గుండ్రముగా    కలుపుము .
C1E1  =  వెనుక    చంక   కలుపుము .
A G     = 1/3  చాతి + 1" 
C1 G1 = C G
G G1   = కలుపుము .
G G1   = మద్య   బిందువు   ' O ' 
' O ' వద్ద     డార్ట్    కుట్టవలెను .
P P1 = డార్ట్   పొడవు .  ' O ' నుండి    పైకి   2"  క్రిందికి  2  1/2 " వెడల్పు   1/2" గుర్తించి  కుట్టవలెను .   
G1 H   = 1"
B I      = 1/4  చాతి + 2"
C1 H  I  =  ప్రక్కభాగామును    కలుపుము .
B B1  =  1/2"  క్రిందికి    
ముందుభాగము :--- 
A F1   = 1/8 చాతి 
C1 E1 = ముందు   చంక   కలుపుము .
E F1   =  ముందు   మెడ   కలుపుము .
I B1   వంపుగా    కలుపుము
కత్తిరించుట :--- 
వెనుక   భాగామునకై    F E ,  E E1 , E1 C1 , C1 H , H I వరకు కత్తిరించావలెను .  ముందు   భాగామునకై   నమునాను   తెరచి 
ఒకభాగమును    వేరు    చేసి   F1 E , E E1 , E1 C1  కత్తిరించావలెను .  
 కాగితమును   మడచుట :-- 
వెడల్పును    మధ్యకు   మడచి  మడతను    కుడి   వైపున   
ఉంచవలెను . పొడవును   మధ్యకు   మడచి  మడతను  పైన  ఉంచవలెను . 
చేతులు :---  
A B  =  1/2  భుజము 
A C  =  1/4 చాతి  + 1"   
A E  =  1/12  చాతి +1"
E B  =  ముందు   వెనుక    చేతి   ఆకారములో   కలుపుము .
C F  =  1"
E F  =  ప్రక్క     భాగమును  కలుపుము .
కత్తిరించుట :--- 
వెనుక    భాగామునకై   B E , E F  వరకు  నాలుగు   పొరలు   కత్తిరించుము . ముందుభాగామునకై   నమునాను   తెరచి 
రెండు  పొరలను   లోతుగా    చేతి  ఆకారములో   కలుపుము .
కుట్టువిధానము :---
 1.ముందు   వెనుక   భాగము  లందు   డార్ట్    లను   గుర్తించి  టాకావేసి    మిషను    చేయవలెను .
2.భుజము   మరియు   ప్రక్కభాగాములను   సాధారణ    అతుకుతో   అతకవలెను .
౩.ముందు   భాగమును   పూర్తిగా   మధ్యకు   కత్తిరించి  ఎడమవైపున  1 1/2"   వెడల్పు  12"  పొడవు  పట్టి   వివ్రుతికై   అతుకవలెను . కుడివైపున    1 " వెడల్పు  12 " పొడవు   గల  పట్టిని   అతుకవలెను 
4. మెడను    క్రాస్   పట్టిని   ఉపయోగించి   పైపింగ్   లేదా  నకిలీ   మడతతో   కుట్ట    వలెను .
5. వివ్రుతిపై   హు క్క్సులను     కుట్ట  వలెను .
6. చేతుల   క్రింది   భాగమున   1/2"  మడచి   టాకా   వేసి   వాలు కుట్టు   కుట్టవలెను .
సరిపడు   బట్ట  :-- 
కాటన్ , పోలి స్టార్  ,  సిల్క్  మొదలగునవి .
బట్ట   అంచనా :--
రెండు   పొడవులు + రెండు   చేతి   పొడవులు . 
-------------------------------------/\---------------------------------------------

Saturday, December 3, 2011

టైలరింగ్ - 24 .పైజమా

పైజమా



                                  
                                         పైజమా
కొలతలు :--
సీటు        = 18"
పొడవు    = సీటు + 4"( నడుము   నుండి   మడమ   వరకు )
 కాగితపు   నమూనా   కొలతలు :--
పొడవు     =  22 + 3"    = 25" (1 1/2"  నడుము   మడతకు
                                          ( 1 1/2" కాలి   మడతకు  )
వెడల్పు     =  1/3 + 3"  = 9" మడతపై
52"  పొడవు ,  18"  వెడల్పు   గల   కాగితమును   తీసికొని  
వెడల్పును   మధ్యకు   మడచి    మడతను   కుడివైపున   వుంచవలెను .  పొడవును   మధ్యకు   మడచి  మడతను   
 పైన   ఉంచవలెను .
నిర్మాణము  :---  
ముందుభాగము  :---
A A1  =  1 1/2"  మడత    కొరకు  
A1 B  = పూర్తిపోడవు  
B B1  = 1 1/2"  అడుగున   మడత   కొరకు 
A C    = 1/3  సీటు  + 1"
C C1  = 1/3  సీటు +1 /12 సీటు 
A D    =  1/3 సీటు  
D D1  =  తిన్నగా   కలుపుము .
A C    =  D D1 
D1 X  =  1/6  సీటు   పైకి 
C1 X D  వంపుతో   కలుపుము .
B1 E   =  1/3  సీటు  + 1"  
E E1   =   1/3  సీటు + 1 1/2"
C1 E1 E   వంపుగా    కలుపుము .
వెనుక   భాగము :---
D H   =  1" పైకి 
A H    =  కలుపుము .
C1 H  =  కలుపుము .
C1 F   =   1" బయటికి 
E F1   =  1"  బయటికి
F H     =  వంపుగా   కలుపుము. 
F F1    =  వంపుగా   కలుపుము  . 
నమునాను    కత్తిరించుట  :--  ముందుగా  వెనుక   భాగామునకై  
A H D F F1   ను   కత్తిరించావలెను .  కాగితపు   నమునాను   తెరచి  పై    రెండు    పొరలను    ముందుభాగామునకై    A D X C1 E1 E  లను   కత్తిరించావలెను .
 కాగితపు   నమూనా   ఉపయోగించి   బట్టను   కత్తిరించుట :--
బట్ట   నిలువును  మధ్యకు   మడచి   మడతపై   నమూనా  ముందు భాగము   నుంచి      కుట్టునకు   1/2"  వదిలి   గీత   గీసి  
కత్తిరించావలెను .   అదే    విధంగా   వెనుక   భాగము   కూడా   కత్తిరించావలెను .  
కుట్టు విధానము :--- 

1. ఒక   ముందుభాగము   ఒక   వెనుక   భాగము   కలిపి   
    గట్టికుట్టు   వాలు    కుట్టు   ఉపయోగించి   కుట్టిన   అతుకుతో  
    ( రన్   అండ్   ఫెల్  )  కుట్టవలేను .

2. మద్య  భాగము   కూడా   రన్  అండ్  ఫెల్   అతుకుతో   కుట్టవలేను .
౩. నడుము   భాగము    మరియు  కాలి   భాగము   మడతలు   లేకుండా    మడచి     టాకా వేసి   మిషను   చేయవలెను .
సరిపడు   బట్ట  :---  
లాన్  క్లాత్ ,  టేరికాటన్   మరియు   తెల్లని   బట్టలు ,  గీతలున్న    బట్టలు .
బట్ట   అంచనా  :--- 
రెండు   పొడవులు  +  ౩".
----------------------------------------/\-----------------------------------------