Monday, November 5, 2012

లాండ్రీ - 5 .లేసు వస్త్రాలను శుబ్ర పరచుట

లేసు   వస్త్రాలను   శుబ్ర పరచుట 
లక్ష్యము :---లేసు  వస్త్రాలను    శుబ్రపరచుట.

ఉపోద్ఘాతము:--- లేసు   సున్నితమైనది .  ఇది   నూలు ,  పట్టు ,  జరీ  దారాలతో   అల్లబడి  

ఉంటుంది .  రక రకాల   అల్లికలు   అల్లి   అలంకరణగా   వాడుదురు .  లేసు   చేతితో   లేక   మెషిన్    తో 

 అల్ల వచ్చును . సున్నితమైన   దారాలతో       చేయబడినది   కావున   శుబ్ర పరచునపుడు    తగు   

జాగ్రత్తలు   తీసుకోనవలెను .

పద్ధతి  :---  శుబ్ర పరచుటకు     ముందు    చిరుగులు     ఏ వైన     ఉన్న    సరి    చేయవలెను .  

సాధారణముగా    లేసు   తెల్లని   నూలు     దారముతో   అల్లబడి   ఉంటుంది .  కావున   లేసును    తెల్లని  
 నూలు   బట్టలను   శుబ్ర   పరచు    విధానముతో   శుబ్రపరచ   వచ్చును .

ఉడక    బెట్టుట :---  లేసు    ముక్కలను   ఒక    సన్నని   బట్టలో    మూట   కట్టవలెను .   

నీటిలో   సబ్బు  ముక్కలను   మరియు   లేసు  మూటను  వేసి    పది  నిముషముల  వరకు   సన్నని   

సెగపై    ఉడక  బెట్ట  వలెను .  

ఉతుకు  విధానము :--- లేసును   శుబ్ర  పరచు   వివిధ   పద్దతులు  :--- 
1.ఎక్కువ  మురకి  ఉన్న   లేసును   సబ్బు  నీటిలో   నాన బెట్ట వలెను .     మురికి   సులువుగా   వదల 

వలెనన్న    సబ్బు    నీటిలో   కొంచెము   బొరాక్స్    కలపవలెను .   ఈ విధముగా    అర   గంట    

నానబెట్టిన   తరువాత     ఉతికి   శుబ్ర మైన     నీటిలో   జాడించ వలెను .   

2. లేసును    వెచ్చని   సబ్బు  నీటిలో   ఉతక  వచ్చును .  తెల్లని   లేసైన    రిన్   సబ్బును    వాడ 

వచ్చును .రంగు  లేసునకు    లక్సు    ముక్కలను    నీటిలో   కలిపి    వాడవచ్చును .   సబ్బు    నీటిలో   
లేసును   ముంచి   పిండి  పిసికిన  విధంగా     మురికిపోయే     వరకు   ఉతికి   మురికి    వదలిన   

 తరువాత    శుబ్ర మైన    వెచ్చని   నీటిలో    జాడించ వలెను .  

3. పొడవైన     లేసును    శుబ్ర  పరచుటకు    ఒక    పొడవైన     సీసాసు     తీసుకొని   దాని  చుట్టూ    

ఫ్లానేల్  బట్టను     చుట్టి     దానిపై    లేసును    క్రమంగా    చుట్టి   లేసు    చివరి    భాగాన్ని    ఊడకుండా   
 టాకా  వెయ  వలెను .   సీసాను    వెచ్చని     సబ్బు   నీటిలో   ముంచి     చేతితో   మురికి   పోయేవరకు   

రుద్దవలెను .   మురికి    పోయిన  తరువాత    శుబ్ర మైన    వెచ్చని    నీటిలో   జాడించ  వలెను .

4.చిన్న   లేసు  ముక్కలను    శుబ్ర    పరచ వలెనన్న    ఒక  వెడల్పు     సీసాలో    వెచ్చని   సబ్బు  నిరు  
పోసి   లేసు   ముక్కలను     సీసాలలో    వేసి   సీసాను   మూసి    బాగా   ఊపవలెను .   మురికి   

పోయిన  తరువాత   శుబ్రమైన    నీటిలో    జాడించ  వలెను .   

గెంజి    పెట్టుట :---బియ్యము    ఉడకబెట్టి    వంచిన  గెంజిలో    తగు  మాత్రము    నీళ్ళు  కలిపి    

వాడ  వచ్చును .  తెల్లని   లేసునకు   గెంజిలో    నీలి  మందు   కలుపవలెను .   క్రీం    రంగు   లేసైనచో     

టీ   చుక్కలను   గెంజిలో   కలప  వలెను .   

ఆరవేయ వలెను :---లేసును    ఒక  తువ్వాలు   లో   ఉంచి   తువ్వాలును     గట్టిగా   చుట్టి    

ఒత్తవలెను .  లేసును   ఒక   దళసరి  బట్టపై   పరచి    అంచులను   గుండు   సూదితో   అమర్చ    వలెను .
ఇస్త్రీ  చేయుట :---   ఆరిన  తరువాత     ఇస్త్రీ   చేయ   వలెను .