Wednesday, November 21, 2012

లాండ్రీ - 6 .పొడివుతుకు ( డ్రై-క్లీనింగ్ )

పొడివుతుకు   ( డ్రై-క్లీనింగ్  ) 
లక్ష్యము :---   డ్రై -క్లీనింగ్   పద్దతిలో   బట్టలను  శుబ్ర పరచుటను    నేర్చు కొనుట .
ఉపోద్ఘాతము  :---అన్ని   దుస్తులను   సబ్బు , నీరుతో   శుబ్రపరచుట 
శ్రేయస్కరము   కాదు .  ఖరీదైన   పట్టు  వస్త్రాలను , రేయాన్ , ఊలు   దుస్తులు   ఉతుకుట   వలన    వాని  సహజ   గుణాలైన   సున్నితత్వము ,  మెరుపును   పోగొట్టుకుంటాయి . అటువంటి   వస్త్రాలు   డ్రై - క్లీనింగ్   పద్దతిలో   శుబ్రము   చేయ బడతాయి .  
                                   డ్రై - క్లీనింగ్   లో    సబ్బు , నీటికి   బదులుగా   
జిడ్డును    పిల్చే   పొడులు   ,  ద్రావణులు   ఉపయోగిస్తారు .
జిడ్డును    పిల్చే   పొడులు:---బియ్యం    పొడి , పెసరపప్పు  పిండి  , సుద్ద పొడి , పౌడర్  ,  తవుడు   మొదలగునవి .
జిడ్డును   కరిగించే    ద్రావణులు :--- పెట్రోల్  , కార్బన్  టెట్రా  క్లోరైడ్ , బెంజిన్ .                                                    
డ్రై క్లీనింగ్   చేయుటకు   ముందు  దుస్తును   తయారు  చేయుట :---
1. దుస్తులను    పరిక్షించుట .  
2.చిరుగులను  కుట్ట వలెను .
3.జేబులను     ఖాళీ  చేసి ,  లోహపు    గుండిలను   తీసివేయవలెను .
4.దుమ్ము   పోవడానికి   బ్రష్    చేయ వలెను .
5. జిడ్డు  మరకలను   తప్ప   మిగతా   అన్ని   మరకలను   తగు   పద్దతి  లో  తొలగించవలెను .  జిడ్డు  మరకలు   డ్రై  క్లీనింగ్    పద్దతిలో   పోతాయి .
అన్ని    మరకలను   తొలగించిన    తరువాత   దుస్తును   ఆరబెట్ట  వలెను .
డ్రై క్లీనింగ్  లో    రెండు   పద్దతులు :---
1.  ద్రావణి తో     పొడివుతుకు  .
2.  జిడ్డును   పీల్చే  పోడులతో    పోడి వుతుకు .
1.  ద్రావణితో     పొడి వుతుకు :---
ఒక   మూత   పాత్రలో   సగము   వరకు    పెట్రోల్   పోసి   అందులో   మురికిగా   వున్న    దుస్తును    ముంచి   మూత    పెట్టి  15 నిముషములు    పాత్రను   కదపవలెను .    తరువాత   మూతను    తీసి తెడ్డుతో   దుస్తును   తీసి  పెట్రోలు   అంతా    పాత్రలోకి   పడిపోయిన   తరువాత    ఒక  బేసిన్    లో   దుస్తును   పెట్టి   తెడ్డుతో   నొక్కి   మొత్తము   పెట్రోలు   పోయిన  తరువాత   నీడలో    ఆరబెట్ట  వలేను. . పెట్రోలు   వాసన   పోయిన   తరువాత   ఇస్త్రీ   చేయ  వలెను
 డ్రై  క్లీనింగ్     పంప్  నుపయోగించి    పొడివుతుకు :--
కంటైనర్ లో      కావలసినంత    పెట్రోలు    పోసి ,  దుస్తులను   పెట్రోల్  లో  ముంచ  వలెను .  కర్ర   తెడ్డు లతో     దుస్తు లను   క్రిందికి   నొక్కవలెను .  బాగా   కలిపి   మూత   బిగించవలెను .   తరువాత  కంటైనర్ ని    కూడా    కదిలించవలెను .   ఈ   విధముగా   చేయుట   వలన    పెట్రోల్ ,  దుస్తు లు    కూడా    అలా   కదులుతూ   లేక   తిరుగుతూ   ఉంటాయి .  suction  washer  ను   తెడ్డు కు   బదులుగా   వాడుదురు .  ఈ   విధంగా    15   నిముషములు   ఉంచ వలెను .  
                                              దుస్తును    బయటకి    తీసి   తెడ్డునకు 
చుట్ట  వలెను .  తరువాత    తెడ్డునకు   చుట్టుకొని    ఉన్న   దుస్తును   కర్ర    చెంచాతో   నొక్కి   సాద్యమైనంత     ఎక్కువ   పెట్రోలును    తీసి   వేయవలెను .   ఒక   బేసిన్ లో   దుస్తునుంచి   ఒక   వైపు  కర్ర   స్పూనుతో   నొక్కి   మరికొంత    పెట్రోలును   తియవలెను .  పెట్రోలును  వడపోత   కాగితముతో   గాని   , ఫిల్టర్  తో   గాని  ఒక   సీసా లోకి  వడగట్టి     బిగుతుగా   ఉన్న   మూతను     పెట్టవలెను . 
ఆరబెట్టుట :---సూర్యరశ్మి    తగలకుండా   నీడలో   దుస్తులను   వ్రేలా డ దీయ    వలెను .   ఇట్లు   చేయుట   వలన  పెట్రోలు    వాసన   పోవును .   
ఇస్త్రీ   చేయుట  :--- దుస్తు   నందు   పెట్రోల్   వాసన   పోవునంత   వరకు  ఇస్త్రీ   చేయరాదు . దుస్తులను   వాటి   యొక్క   గుణాలను   బట్టి   ఇస్త్రీ   చేయవలెను .   
ముఖ్యగమనిక :---పెట్రోల్   ఆవిరి   అయిపోయేంత   లోగా   వేగముగా   శుభ్ర పరచి ,  జాడించి , వడగట్ట వలెను .  (  వేడికి    దూరముగా   ఉంచి   ఈ   పద్దతి    చేయవలెను .)  ఎందువలనంటే   వేడికి   పెట్రోల్   మండి పోవును .
2.  జిడ్డును   పీల్చే  పోడులతో    పోడి వుతుకు:---
కావలసిన   పరికరములు :--- దుప్పటి  , అద్దుడు   కాగితము , జిడ్డు   పిల్చే   పొడి  ,  చిన్న  బ్రష్ .  
                           బల్లపై    దుప్పటిని   పరచి   దానిపై   అద్దుడు   కాగితము   పరవలెను .  దీనిపై    దుస్తు   మాసిన  భాగాన్ని    పైకి  ఉండేటట్లు   వేసి  మాసిన   భాగం పై    జిడ్డు  పీల్చే   పొడిని   చల్లి ,  మెల్లిగా   రుద్ది   ,  అరగంటసేపు   అలాగే   ఉంచిన    దుస్తులో  నున్న   జిడ్డును  పీల్చి   మురికిని   తీసి   వేస్తుంది .   దుస్తుపై   నున్న   పొడిని   బ్రష్ తో    దులిపి   వేయవలెను .   దుస్తు   పూర్తిగా   శుబ్ర పరచవలె నన్న   ఈ   పద్దతిని   రెండు   మూడు   సార్లు    చేసిన   దుస్తు   మురికి   వదలును .         ముగింపు :---ఖరీదైన    దుస్తులను   వాటి   యొక్క  సున్నితత్వమును,   మెరుపును     పోగొట్టు   కోకుండా  శుబ్రము   చేసుకొనుటకు   ఇది   ఉత్తమమైన    పద్దతి .   ఇది   రంగు   పోయే   దుస్తులను   కూడా   శుబ్ర పరచుటకు   ఉత్తమమైన   పద్దతి .  
===============================================