బేబీ మాటిని కోట్
పొడవు = భుజము నుండి అంచువరకు = 12 అంగుళములు
చేతి పొడవు = 4 1/2 అంగుళములు
వెనుక భాగము , ముందు భాగములు అన్నియు చంక భాగము వరకు ఒకే
భాగముగా అల్లవలెను
( కాస్ట్ ఆన్ ) = 247 గుండీలు (stitches )వేయవలెను .
మొదటి 8 వరుసలు = నిట్ అల్లవలెను .
9 వ వరుస :-- నిట్ అల్లవలెను ఆఖరి 8 గుండీలు (stitches )పిన్నుకు
ఎక్కించవలెను. ఇది ముందు భాగము పట్టీ కి ఉపయోగించవలెను .
10 వ వరుస :-- పర్ల్ అల్లవలెను . 231 పర్ల్ అల్లవలెను . గుండీలు ( stitches)పర్ల్
అల్లి ఆఖరి 8 గుండీలు (stitches)పిన్నుకు ఎక్కించుకోవలెను . ఇది రెండవ పట్టికి
ఉపయోగించు కోవలెను .
మిగిలిన 231 గుండీలతో ( stitches) 8 అంగుళాలు డిజైన్ అల్లవలెను .
ఒక వరుస నిట్ ఒక వరుస పర్ల్ అల్లవలెను .
బాడీ భాగము :--- బాడీ అనగా మధ్య భాగము షేప్ వచ్చుటకు
గుండీలు ( stitches)తగ్గించుతూ పోవలెను .
* K 6 (K 3 tog ) 3 సార్లు * పువ్వు గుర్తు నుండి ఆఖరి 6 గుండీల వరకు , K 6
( 141 గుండిలు ( stitches) సూది మీద ఉండును ) .
ఇప్పుడు 1/2 అంగుళము వరకు ఒక వరుస నిట్ ఒక వరుస పర్ల్
అల్లవలెను .
ఇప్పుడు పూర్తిపొడవు 8 1/2 అంగుళములు అగును .
ఇప్పుడు చంక భాగముల కొరకు విభజించుకోవలెను .
తరువాత వరుస :--- 33 గుండీలు (stitches) నిట్ అల్లి 4 గుండీలు ముగించాలి .
తరువాత
67 గుండీలు (stitches) మళ్ళీ నిట్ అల్లి 4 గుండీలు ( stitches) ముగించవలెను . మిగతా
33 గుండీలు (stitches) నిట్ అల్లవలెను .
ఇప్పుడు 33 గుండీలు (stitches)ముందు ఎడమ భాగము , 67
గుండీలు (stitches) వెనుక భాగమునకు , తరువాత 33 గుండీలు ( stitches) ముందు
కుడిభాగము .
మొదట ముందు భాగము :---- 33 గుండీలు (stitches) మీద అల్లడం ప్రారంభించాలి .
చంకభాగము వైపు ప్రతి వరస విడిచి వరుసకు ఒక్కొక్క కుట్టు చొప్పున
తగ్గించుతూ 5 గుండీలు (stitches) వరకు తగ్గించి సూది మీద 28 గుండీలు (stitches)
ఉండు వరకు అల్లవలెను . క్రింద నుండి 11 అంగుళములు వచ్చువరకు
ఒక వరుస నిట్ ఒక వరుస పర్ల్ అల్లవలెను . అనగా 2 1/2
అంగుళములు అల్లవలెను. (మొదటి 8 1/2 అంగుళములకు 2 1/2
అంగుళములు అల్లితే మొత్తము 11 అంగుళములు వస్తుంది ).
మెడ ఒంపు అల్లుట :---
మొదటి వరుస :-- రెండు గుండీలు(stitches) ముగించి నిట్ అల్లవలెను.
రెండవ వరుస :--- పర్ల్ అల్లవలెను .
మూడవ వరుస :--- రెండు గుండీలు(stitches) ముగించి నిట్ అల్లవలెను.
నాలుగో వరుస :--- పర్ల్ అల్లవలెను.
ఐదవ వరుస :--- రెండు గుండీలు (stitches)ముగించి నిట్ అల్లవలెను.
ఆరవ వరుస :--- పర్ల్ అల్లవలెను.
ఏడవ వరుస :--- రెండు గుండీలు (stitches)ముగించి నిట్ అల్లవలెను.
ఎనిమిదవ వరుస :-- పర్ల్ అల్లవలెను.
ఇప్పుడు సూది మీద 20 గుండీలు (stitches) ఉండును . వీటిని ముగించవలెను .
వెనుక భాగము :--- 67 గుండీలతో ( stitches) అల్లవలెను . ప్రతి వరుస విడిచి
వరుసకు రెండు వైపులా ఒక్కొక్క గుండి(stitch) చొప్పున నాలుగు సార్లు తగ్గించి
సూది మీద 59 గుండీలు (stitches)ఉండు వరకు అల్లవలెను . ఈ 59 గుండీలతో (stitches)
డిజైన్ అల్లవలెను.
ముందుభాగము వైపు ఉన్నంత పొడవు వెనుక భాగము వైపు కూడా
అల్లి మొదట 20 గుండీలు ( stitches) ముగించి వరుసంత నిట్ అల్లవలెను.
తరువాతి వరుసలో
20 గుండీలు(stitches) ముగించి వరుసంత పర్ల్ అల్లవలెను . మిగిలిన 19
గుండీలను (stitches)ముగించవలెను.
రెండవ ముందు భాగము :-- మిగతా 33 గుండీలతో మొదటి ముందు
భాగము అల్లిన విధంగానే అల్లవలెను .
ముందు వైపు పట్టి :--- ఈ పట్టి పై బటన్స్ , బటన్ హాల్స్ కుట్ట వలెను .
పిన్నుకు తగిలించి ఉంచిన 8 గుండీలను( stitches) సూదికి ఎక్కించి ( గార్టర్ స్టిచ్ )
అన్ని వరుసలు నిట్ అల్లవలెను . పూర్తిగా 11 అంగుళములు అల్లవలెను .
కావలిసిన చోట బటన్ హాలు చేయ వలెను.
బటన్ హాల్స్ చేయు పద్ధతి :----
బటన్ హాల్స్ మొదటి వరుస : --- K 3 , రెండు గుండీలు (stitches) ముగించి K
ఆఖరి వరకు అల్లవలెను.
బటన్ హాల్స్ రెండవ వరుస :--- K 3 రెండు గుండీలు (stitches)చేతితో వెయ్యాలి
K ఆఖరి వరకు అల్లవలెను.
చేతులు : --- 36 గుండీలు ( stitches) వేయవలెను .
15 వరుసలు నిట్ అల్లవలెను .
16 వరుస నుండి :-- ఒక వరుస నిట్ అల్లవలెను
ఒక వరుస పర్ల్ అల్లవలెను.
తరువాత ప్రతివరుసకు ఒక గుండిని (stitch ) పెంచుతూ 51 గుండీలు
వచ్చేవరకు 15 వరసలు అల్లవలెను . ఇప్పుడు సూది పై 51 గుండీలు
ఉండవలెను.
ఇప్పుడు డిజైన్ ( ఒక వరుస నిట్ అల్లవలెను , ఒక వరుస పర్ల్
అల్లవలెను. )
4 1/2 అంగుళాలు వచ్చువరకు అల్లవలెను.
చేతి పై భాగము అల్లుట :---
రెండు గుండీలు ( stitches ) కలిపి నిట్ అల్లి వరసంత నిట్ అల్లవలెను .
రెండు గుండీలు (stitches) కలిపి పర్ల్ అల్లి వరసంత పర్ల్ అల్లవలెను .
ఈ విధంగా 37 గుండీలు (stitches) వచ్చేంత వరకు అల్లవలెను
రెండు గుండీలు (stitches) ముగించి వరుసఅంతా నిట్ అల్లవలెను .
రెండు గుండీలు (stitches) ముగించి వరుసఅంతా పర్ల్ అల్లవలెను .
ఈ విధంగా 29 గుండీలు (stitches) వచ్చేంత వరకు అల్లవలెను .
మూడు గుండీలు (stitches) ముగించి వరుసఅంతా నిట్ అల్లవలెను .
మూడు గుండీలు (stitches) ముగించి వరుసఅంతా పర్ల్ అల్లవలెను .
ఈ విధంగా 11 గుండీలు (stitches) సూది మీదకు వచ్చేంత వరకు అల్లవలెను .
తరువాత 11 గుండీలను (stitches) ముగించవలెను .
రెండవ చేయి కూడా ఈ విధముగా నే అల్లవలెను.
మెడ పట్టి :--- ముందు భాగము వెనుకభాగములను భుజముల వద్ద
కలిపి కుట్టుకోవలెను . 51 గుండీలను (stitches) RIGHT SIDE మెడ చుట్టూ ఎక్కించి
ఆరు వరుసలు. అన్ని వరుసలు నిట్ అల్లి ముగించవలెను . ఈ మెడ
పట్టిని SWEATER లోపలి భాగమునకు సగం మడిచి కుట్టవలెను .
చేతులను చంకకు కలిపి కుట్టవలెను . బటన్స్ ను బటన్ హోల్ కి
సరిపోయేవి తీసుకొని కుట్టవలెను.