Sunday, January 5, 2020

మిషను ఎంబ్రాయిడరీ - 1. మిషను నందు చేయవలసిన మార్పులు

                మిషను  ఎంబ్రాయిడరీ 
1. మిషను నందు చేయవలసినమార్పులు
 కొన్ని  సులభమైన  మార్పులు చేసి  మిషను  ఎంబ్రాయిడరీ  చేయుట. దీనికి  మిషను  నందు:

1. ప్రెషర్  ఫుట్  ను  తొలగించుట.
2. ఫీడ్  డాగ్ ను   మార్పుచేయుట
3.టెన్షను  మార్పుచేయుట

మొదలైన  మార్పులు   మిషను  నందు  చేసి  ఎంబ్రాయిడరీకి  పనికి  వచ్చువిధంగా  తయారుచేయవలెను. 

  2. ప్రెషర్  ఫుట్  ను  తొలగించుట


ప్రెషర్  బార్  ని  పైకి  ఎత్తి  స్ర్రూని  విప్పి  ఫ్రెషర్  ఫుట్ ని  తొలగించవలెను.

3. ఫీడ్  డాగ్  మరియు  బాబిన్  టెన్షన్  

ఫీడ్ డాగ్  ను  మార్పుచేయుటకు   201 క్లాస్  మిషన్స్  లో   మిషను   వెనుకకు  
మరల్చవలెను.  బాబిన్  టెన్షన్ ను  మిషన్స్ నందు  రెగ్యులేట్ చేయవలెనంటే   సైడ్ ప్లేట్   ఎడమ ప్రక్కకు  తొలగించి  టెన్షన్  స్ర్రూను సరిచేయవలెను.  టెన్షను  ఎక్కువ  చేయవలెనన్న   స్ర్రూని మనవైపు  తిప్పవలెను.  టెన్షన్   తక్కువ  చేయవలెనన్న  స్ర్రూని   అవతలి వైపుకు  తిప్పవలెను.

సింగర్  మిషన్  నందు  ఫీడ్  డాగ్  మార్పుచేయుట:  
సింగర్   ( singer 15 - 90 ) 15-90 మరియు  15 - 91  క్లాస్  మిషను  నందు  మిషన్ ను  వెనుకకు  మరల్చి  తంబ్  స్ర్రూని  తీసివేయవలెను.

  4. బాబిన్  త్రెడ్  టెన్షన్  సరిచేయుట 

బాబిన్  త్రెడ్  టెన్షన్  ను   15 - 90 మరియు  15 - 91  క్లాస్  మిషన్  నందు 
బెడ్  సైడ్  ప్లేట్   ప్రక్కకు   తొలగించి  బాబిన్    కేస్  ను  బయటికి  తీయవలెను.  స్ర్రూ   ద్వారా  టెన్షన్  సరిచేయవలెను. ఈ  స్ర్రూ  బాబిన్  కేస్  బయటి  వైపు  అమర్చబడి యున్నది.  టెన్షన్   ఎక్కువ   చేయవలెను.    స్ర్రూ   ని  కుడి  ప్రక్కకు  ,  టెన్షన్  తక్కువ  చేయవలెనన్న   స్ర్రూని   ఎడమ ప్రక్కకు   తిప్పవలెను.  

సింగర్  221  - 1 మరియు  66  మిషన్లయందు  బాబిన్   టెన్షన్   సరిచేయుట :
  ఈ   మిషన్  నందు  బాబిన్  పైన  
ఫీడ్  కవర్  ప్లేట్   ఉంటుంది.  దానికి  ఒక  స్ర్రూ   బిగించబడిఉంటుంది.    ఈ   ప్లేట్  సులభంగా  తీయవచ్చు.  బాబిన్  కేస్  ను   పైకి  తీసి    టెన్షన్   స్ర్రూ  ద్వారా  సరిచేయవచ్చు. టెన్షన్  ఎక్కువ  చేయవలెనన్న  స్క్రూను  కుడివైపుకు,  తక్కువ   చేయవలెనన్న   స్ర్కూ  ని  ఎడమవైపునకు  తిప్పవలెను.
బాబిన్  త్రెడ్ టెన్షను  66_16  మరియు  66_18  మిషన్  నందు  మార్పుచేయుట:-
 ఈ  మిషను  నందు  బాబిన్  ఒక ప్రక్కకు  ఉండక  వెల్లకితల  పైకి  కనబడుతూ  ఉండును.  దీనికై  బెడ్ సైడ్  ప్లేట్  ను  ప్ర క్కకి  తొలగించి  పెద్ద స్క్రూ ని  తిప్పి  టెన్షన్    సరిచేయవలెను.  టెన్షన్  ఎక్కువ  చేయవలెనన్న  స్క్రూని  మన వైపునకు  త్రిప్పవలెను.  టెన్షన్  తక్కువ  చేయవలెనన్న  స్క్రూని అవతలి వైపునకు   తిప్పవలెను.  

          5.  పై టెన్షన్  సరిచేయుట 

ముందు  చెప్పిన  వన్నియు  బాబిన్  కేస్  నందు,  బాబిన్ నందు  టెన్షన్  సరిచేయుటకు  పనికి  వచ్చును.  ఇప్పుడు  మిషను  పై భాగమునందు గల సూది  ,  దారము  యొక్క టెన్షన్  సరిచేయుట తెలుకోవలెను.  ఇది  టెన్షన్  కంట్రోల్  ద్వారా  చేయవలెను.  ఎప్పుడు  గాని  ప్రెషర్ ఫుట్  కిందనున్నప్పుడే  ఈ  టెన్షన్  కంట్రోల్  చేయబడును. టెన్షన్ ఎక్కువ  చేయవలెనన్న  తంబ్  నట్ ను  కుడివైపునకు,  తక్కువ చేయవలెనన్న  తంబ్ నట్  ను  ఎడమవైపునకు  తిప్పవలెను.  'న్యూట్రల్ '  కుట్టును  ముందుకు,  వెనుకకు  రానీక రెగ్యులేట్  చేస్తుంది.

గమనిక :-- ప్రతి  మిషనుకు  నంబరు  ఇవ్వడం  జరిగింది.  ఒక్కొక్క  మిషనుకు  బాబిన్ ,  బాబిన్  కేస్  అమరిక  వేరీవేరుగా  ఉన్నవి. కొన్నింటికి  సైడుకు, కొన్నిటికి  మధ్యన  ఉన్నవి.  అది  గమనించుకొని  మనము  మిషను  నందు  మార్పులు  చేయునపుడు  ఏ  మిషనుకు   ఏ   మార్పులు  చేయవలెనో  అవే  మార్పులు  చేయవలెను. అదే  విధంగా  బాబిన్  టెన్షన్  సరిచేయునప్పుడు  కూడ   రెండు రకములైన  కేస్  లు   చూపించడమైనది.   ఏ బాబిన్  కేస్  ననుసరించి   ఆ  మార్పులు   చేయవలెను.  

6. మిషను  ఎంబ్రాయిడరీ  చేయునపుడు  తీసుకోవలసిన  జాగ్రత్తలు

ఎంబ్రాయిడరీ   ఫ్రేమ్  ఉపయోగించకుండ   ఎంబ్రాయిడరీ  చేయరాదు.  అచ్చునందు  బట్ట  మరీ  వదులుగాను  మరీ  బిగుతుగాను గాక  సమంగా   బిగించవలెను.  ఎక్కువ  లాగరాదు.  ఎంబ్రాయిడరీ ఫ్రేమ్   కదలిక  మిషను   కదలికలో   కలియవలెను.  అప్పుడే  కుట్టు నునుపుగా  , సమంగా వచ్చును.  కదలిక  ఎక్కువ  త్వరగా  గాని,  మెల్లగా  గాని  అయిన  దారం తెగిపోవడం,  కుట్టు  అవకతవకలుగా  రావడం  జరుగుతుంది.  ముందుగా  ఒక  పాత  గుడ్డను  తీసుకుని  కుట్లు  సమానంగా  వచ్చువరకు,    సాధన  చేయవలె.  ఎంబ్రాయిడరీ   ఫ్రేమ్  ఎప్పుడు  గాని  డిజైన్  ఉన్న  భాగమున  కాక  వెనకవైపున  బిగించవలెను  అనగా  ఫ్రేమ్ వెనకవైపున    డిజైను  వచ్చును.  ఆ  డిజైనును   సూది   కింద  అమర్చి ఎంబ్రాయిడరీ  చేయవలెను.  సిల్క్  దారమును   ఉపయోగించి  ఎంబ్రాయిడరీ  చేయవలె.  కొన్ని కొన్ని  కుట్లకు   సూదికి  సిల్క్  దారము  బాబిన్  లో   నూలు దారము పెట్టి  కూడ  చేయవచ్చును.