మరకలు
మరక :--- ఐస్-క్రీం
తెల్లనినూలు :---సబ్బుతో ఉతకవలెను . బోరాక్స్ ద్రవములొ ముంచి తిరిగి శుబ్రముగా ఉతకవలెను .
రంగునూలు :---సబ్బుతో ఉతకవలెను . బోరాక్స్ ద్రవములొ ముంచి తిరిగి
శు బ్ర ముగా ఉతకవలెను .
పట్టు , ఉన్ని :----సబ్బుతో ఉతకవలెను . ఒక కప్పు నీటిలో NH 3 చుక్కలను వేసి మరక పై ఉపయోగించ వలెను.
కృత్రిమ వస్త్రాలు :---సబ్బుతో ఉతకవలెను . ఒక కప్పు నీటిలో NH 3 చుక్కలను వేసి మరక పై ఉపయోగించ వలెను.
===========================================================================
మరక :--- బూట్ పోలిష్
తెల్లని నూలు :--- మరకను తుడిచి గ్రీజు రుద్ది వేడి నీటిలో ఉతకవలెను .
రంగు నూలు :--- తెల్లని నూలు కు చేసిన విధానమే .
పట్టు , ఉన్ని :--- కిరోసిన్ లో ను , టర్పెన్ టైన్ లోను ముంచి సాల్వెంట్ సబ్బు తో ఉతకవలెను .
కృత్రిమ వస్త్రాలు :---పట్టు ,ఉన్ని కి చేసిన విధానము .
==========================================================================
మరక :--- నూనె
తెల్లని నూలు :--- సబ్బు , వేడి నీటితో తీయవచ్చును .
రంగునూలు :--- తెల్లని నూలుకు చేసిన విధానమే .
పట్టు , ఉన్ని :--- 1. వేడి నీటికి బదులు గోరు వెచ్చని నీటి ఉపయోగించ వలెను .
2. సుద్ద పొడిని మరక మీద పరచి కొంత సేపు ఉంచి దులిపి వేయవలెను .
3. అద్దుడు కాగితాలను మరకపై నుంచి ఇస్త్రి చేయ వలెను .
కృత్రిమ వస్త్రాలు :--- సుద్ద పొడితో మరకను కప్పి అద్దుడు కాగితమును మరకపై
నుంచి ఇస్త్రి చేయ వలెను .
=========================================================================
మరక :--- పెయింట్
తెల్లని నూలు :--- టర్పెన్ టైన్ తో నాన బెట్టి తరువాత కిరోసిన్ ఉపయోగించి మరకను తీయ వలెను . తరువాత సబ్బు తో ఉతకవలెను .
రంగునూలు :--- తెల్లని నూలుకి చేసిన విధానమే .
పట్టు , ఉన్ని :--- తెల్లని నూలుకి చేసిన విధానమే .
కృత్రిమ వస్త్రాలు :--- తెల్లని నూలుకి చేసిన విధానమే .
==========================================================================