మాసికలు
4.ఫ్లానల్ మాసిక :---
1. మాసికను కొలతల ననుసరించి కత్తిరించి , చిరుగు క్రింది బాగమున మాసిక నుంచి కుదిరిన తరువాత టాకా వేసి , హెర్రింగ్ బోన్ కుట్టు తో కుట్ట వలెను . ఈ కుట్టు ను
మూల లందు కుట్లు కలియునట్లు కుట్ట వలెను .
2. చిరుగును మరగ వైపునకు త్రిప్పి మూలల నుండి 1/4" వదిలి చిరుగును కత్తిరించా వలెను .
3. అంచుల వద్ద హెర్రింగ్ బోన్ కుట్టు కుట్టి ముగించ వలెను .
=========================================================================
చిరిగిన భాగాన్ని వేరొక బట్ట ముక్కతో కప్పి అతుకు వేయుటను మాసిక అని అందురు .
ఇది డార్నింగ్ చేయడానికి వీలు లేనప్పుడు చేయుదురు .
దీనిలో మూడు రకాలు కలవు.
1. సాదా మాసిక ( PLAIN PATCH )
2. ప్రింటెడ్ మాసిక ( PRINTED PATCH )
3. ఫ్లానల్ మాసిక . ( FLANNAL PATCH )
మాసికలు కుట్టు నప్పుడు జ్ఞాపక ముంచుకొన విషయములు:---
1. మాసికలు శుబ్రముగా ను , జాగ్రత్తగాను కుట్ట వలెను .
2. మాసిక చిరుగు కన్నా నాలుగు వైపులా 1" ఎక్కువ ఉండవలెను .
3. పాత దుస్తునకు క్రొత్త మాసికను వెయ కూడదు . ఒక వేళ క్రొత్త బట్టను
ఉపయోగించ వలసి వచ్చినప్పడు బట్టను రెండు మారులు ఉతికి ఇస్త్రి చేయ వలెను .
4. మాసికలను కుట్టుటకు ఉపయోగించు దారము దుస్తు రకమును రంగును అనుసరించి ఉండ వలెను . ఉదాహరణ :--- నూలునకు నూలు , పట్టునకు పట్టు దారమును ఉపయోగించ వలెను .
5. ప్రింటెడ్ బట్టకు ప్రింట్ కలియునట్లు మాసిక వేయవలెను .
6. దుస్తు యొక్క నిలువు మాసిక నిలువు ఒకే వైపున ఉంచి కు ట్ట వలెను .
1. సాదా మాసిక :---
ఈ మాసిక సాదా ( PLAIN ) బట్టలకు ఉపయోగింతురు .
1 చిరుగు చుట్టూ మాసిక వేయవలసిన భాగాన్ని కొలత తీసి మాసికను అదే కొలతలతో కత్తిరించ వలెను .
2. మాసికను సరిగ్గా చిరుగుపై నుంచి అంచులను మడచి టాకా వేసి , వాలుకుట్టు కుట్ట వలెను . సాదా మాసికలో మాసికను తిరుగ వైపున కుట్ట వలెను . వాలు కుట్టు కుట్టునప్పుడు మూలలందు కుట్లు నిలువుగా ఉండునట్లు కుట్ట వలెను .
3. మరగ వైపు నుండి మాసికను కత్తిరించుము . చిరుగు నాలుగు వైపులా చివరినుండి 1/4" మడతకు వదలి కత్తిరించిన చిరుగు ఒక ఆకారమునకు వచ్చును .
4. తిరిగి అంచులను మడచి టాకా వేసిన తరువాత వాలుకుట్టు కుట్ట వలెను .
అంచులను జాగ్రత్త గాను శుబ్రముగాను మడవ వలెను .
2. ప్రింటెడ్ మాసిక :--
దుస్తు డిజైన్ తో మాసిక డిజైన్ కలియునట్లు చూచి కత్తిరించ వలెను .
కుట్టు నకు ఉపయోగించిన దారము దుస్తు రకమును , రంగును కలియునట్లు
చూడవలెను .
చిరుగు కొలతల ననుసరించి మాసికను కత్తిరించ వలెను .
మాసికను మరగ ( RIGHT SIDE ) వైపు వేయ వలెను .
1. దుస్తు పైన గల ప్రింట్ తో మాసిక ప్రింట్ కలియునట్లు అమర్చి , మాసిక
కుదురిన తరువాత టాకా వేయ వలెను . వాలు కుట్టు కుట్టునప్పుడు
మూలలందు గట్టిగా నుండుటకు కుట్ట వలెను .
2. తిరుగ వైపునకు మాసికను త్రిప్పి నాలుగు వైపులా మూలలనుండి
మడతకై 1/4" వదలి కత్తిరించ వలెను .
3. కత్తిరించిన అంచులకు పోగుల ఊడకుండా అంచులను బటన్ హోల్ కుట్టు తో
కుట్టి ముగించ వలెను .
దుస్తు డిజైన్ తో మాసిక డిజైన్ కలియునట్లు చూచి కత్తిరించ వలెను .
కుట్టు నకు ఉపయోగించిన దారము దుస్తు రకమును , రంగును కలియునట్లు
చూడవలెను .
చిరుగు కొలతల ననుసరించి మాసికను కత్తిరించ వలెను .
మాసికను మరగ ( RIGHT SIDE ) వైపు వేయ వలెను .
1. దుస్తు పైన గల ప్రింట్ తో మాసిక ప్రింట్ కలియునట్లు అమర్చి , మాసిక
కుదురిన తరువాత టాకా వేయ వలెను . వాలు కుట్టు కుట్టునప్పుడు
మూలలందు గట్టిగా నుండుటకు కుట్ట వలెను .
2. తిరుగ వైపునకు మాసికను త్రిప్పి నాలుగు వైపులా మూలలనుండి
మడతకై 1/4" వదలి కత్తిరించ వలెను .
3. కత్తిరించిన అంచులకు పోగుల ఊడకుండా అంచులను బటన్ హోల్ కుట్టు తో
కుట్టి ముగించ వలెను .
4.ఫ్లానల్ మాసిక :---
1. మాసికను కొలతల ననుసరించి కత్తిరించి , చిరుగు క్రింది బాగమున మాసిక నుంచి కుదిరిన తరువాత టాకా వేసి , హెర్రింగ్ బోన్ కుట్టు తో కుట్ట వలెను . ఈ కుట్టు ను
మూల లందు కుట్లు కలియునట్లు కుట్ట వలెను .
2. చిరుగును మరగ వైపునకు త్రిప్పి మూలల నుండి 1/4" వదిలి చిరుగును కత్తిరించా వలెను .
3. అంచుల వద్ద హెర్రింగ్ బోన్ కుట్టు కుట్టి ముగించ వలెను .
=========================================================================
No comments:
Post a Comment