Friday, August 12, 2016

ఎంబ్రాయిడరి - 46. టైైడ్ హెర్రింగ్ బోన్ కుట్టు


ఎంబ్రాయిడరి- 45. త్రెడెడ్ హెర్రింగ్ బోన్ కుట్టు


ఎంబ్రాయిడరి - 44. క్లోజ్ డ్ హెర్రింగ్ బోన్


ఎంబ్రాయిడరి —43. హెర్రింగ్ బోన్ కుట్టు

హెర్రింగ్ బోన్ :— ఇది   ముక్కలు   అతకడానికి  , మాసికలు   వేయడానికి    ఉపయోగించవచ్చు. అంతేగాక    దీనిని    ఎంబ్రాయిడరీ    డిజైనులలో    కూడ    వాడవచ్చు.  రెండు    లైనులపై  పనిని    చేయవలెను.  పై    లైను  మీద  కుడి  వైపుకు  చిన్న కుట్టు   వేసి  దారాన్ని    సూది క్రింద   నుంచి    తీయవలెను.   తరవాత    మళ్ళీ    సూదిని    క్కిందలైను    పై   గుచ్చి  కుడివైపునకు    కుట్టి    ఎడమవైపునకు.   చిన్న   కుట్టును    తీయవలెను.   ఇప్పుడు   దారాన్ని  సూదిపైకి    ఉంచవలెను.  కుట్టు   కుట్టు కి    మధ్య    స్థలము  సమానముగా    ఉండవలెను. దీనిలో  మరొకరకము  హెర్రింగ్  బోన్  కుట్టు     దగ్గర దగ్గరగా    ఉండును.   పైన  కుట్టు   గట్టి కుట్టు వలె    దగ్గర దగ్గర గా    వచ్చును.   దీనిని   క్లోజ్ డ్  హెర్రింగ్ బోన్  అందురు. (Closed Herring bone )
షాడో వర్క్   ( Shadow  work ) :--- సన్నటి    గుడ్డ    మీద    ఈ    క్లోజ్ డ్    హెర్రింగ్   బోన్   కుట్టు  కుట్టిన    దీనిని షాడో వర్క్  అందురు .  గుడ్డ    వెనుక   వైపున   డిజైనును  కుట్టవలెను . గుడ్డ  
ముందు    భాగమున   పైన .   కిందవేసిన     గట్టి   కుట్టు  మాత్రము   కనబడును.  మిగతా   డిజైన్   భాగమంతయు    దారము   రంగు   లేతగా  షాడో   వలే   కనబడును.  

ఎంబ్రాయిడరి - 42. షెవ్రాన్ కుట్టు



Sunday, August 7, 2016

ఎంబ్రాయిడరి- 36.బటన్ హోల్ కుట్టు - 1


ఎంబ్రాయిడరి - 35. బటన్ హొల్ కుట్టు

బటన్ హోల్  ( Button  Hole ):--- దీన్ని  బ్లాంకెట్  స్టిచ్   అని  కూడ  అంటారు.  ఇందులో  కుట్లన్నీ  దగ్గర దగ్గర  గా  ఉండును.  సూదిని   గుడ్డ  పైకి  గుచ్చిన  తరువాత    దారమును   సూది క్రింద  నుండి   తీసి  సూదిని  పైకి  లాగవలెను. దారము  లూప్  వలె  ఏర్పడును. ఇదే విధంగా  అన్ని కుట్లకు  దారము  సూదిక్రింద నుండి  తీయవలె.  ఈ  కుట్టుకు   ఒక వైపున  కుట్టు  గొలుసు  వలె  ఏర్పడును.  దీనిని  సాధారణముగా   పువ్వులు  నింపుటకు  ,  బ్లాన్ కెట్  చివర  పోగులు  ఊడిపోకుండా   కుట్టుదురు.