కొలతలు :-- చాతి = 20" పొడవు =18" ( భుజము నుండి నడుము క్రింద వరకు ) భుజము = 10" కలి పొడవు = 13" ( కుర్త పూర్తీ పొడవులో 2/3 వరకు ) కలి వెడల్పు= 7" ( కుర్త భుజములో 2/3 వంతు ) చేతులు :--- పొడవు = 13" ( 2/3 కుర్త పొడవు ) వెడల్పు = 10" ( పూర్తీ భుజము ) అతుకు :--- పొడవు = 3" వెడల్పు = 3" నిర్మాణము :-- కుర్త మద్య భాగము :--- A B = 18" A C = 5" A B = CD A C = BD A E = 1/12 చాతి A F = 1/12 చాతి E F = ముందు మెడ గుండ్రముగా కలుపుము . A G = 1/2" E G = వెనుక మెడ గుండ్రముగా కలుపుము . A H = 5" ( 1/4 చాతి వివృతి కై ) కత్తి రించావలెను . కలిని కత్తిరించుట :--- A B = 7" ( కలి వెడల్పు ) కుర్త భుజములో 2/3 వంతు A C = 13" ( కలి పొడవు ) కుర్త పూర్తి పొడవులో 2/3 వంతు A B = C D A C = B D A E = 1/12 చాతి D F = 1/12 చాతి E F కలుపవలెను . చేతులు :--- A B = 5" A C = 13" పొడవు A C = B D A B = C D అతుకు :--- A B = 1/4 చాతి - 2" =3" A C = 1/4 చాతి - 2" =3" A B = C D A C = B D కుర్త మద్య భాగామునకై కాగితమును మడచుట :--- 36" పొడవు 10" వెడల్పు గల కాగితమును తీసుకొని పొడవును మధ్యకు మడచి మడతను పైభాగమున వుంచవలెను . వెడల్పును మధ్యకు మడచి మడతను కుడివైపున వుంచవలెను . కుట్టు విధానము :---
1.కుర్త మద్యభాగమునకు ఇరువైపుల కలిలను రన్ అండ్ ఫెల్ అతుకుతో అతుకవలెను . 2.కలిలపై చేతులను కూడ రన్ అండ్ ఫెల్ అతుకుతో అతుకవలెను . 3.చేతులను 1/2" భుజములోనికి వుంచి రన్ అండ్ ఫెల్ అతుకుతో అతకవలెను . 4 . చేతి అంచులను వాలుకుట్టుతో కుట్ట వలెను . 5 .మెడకు క్రాస్ పట్టిలను ఉపయోగించి ఫైసింగ్ తో ముగించావలెను . 6 . వివృతిని మెడ భాగము క్రింద 5" కత్తి రించి రెండు పట్టిలు అతికి ముగించావలెను . 7. వివృతి పై కాజాలను గుండిలను కూడా కుట్ట వలెను . 8 . కుర్త ఇరు వైపులా కలిల చివరిభాగమున 5" విడువవలెను . సరిపడు బట్ట:--- లాన్ , గ్లాస్కో మొదలగునవి .