Tuesday, October 4, 2016

ఎంబ్రాయిడరి - 51. c. డ్రాన్ త్రెడ్ వర్క్ -3

 డ్రా న్   త్రెడ్ వర్క్ :--  జిగ్   జాగ్  హెమ్ స్టిచ్  :--  దీని  లోనే   జిగ్  జాగ్   విధము గా  కూడా  
హెమ్ స్టిచ్    కుట్ట  వ చ్చును .    దారపు  పోగులు   W   షేపు లో  గాని   M    షేపు  లో గాని   

వచ్చును. 

ఎంబ్రాయిడరి - 51. b. డ్రాన్ త్రెడ్ వర్క్ -2

ఈ  కుట్టును  సాధారణంగా  చేతిగుడ్డల,  టేబుల్  క్లాత్ ల  , నేప్ కిన్ ల అంచులకు  వాడుదురు.  అంచులందు  అడ్డపోగులను  తీసివేసి  మిగత నిలువు  పోగులను  అయిదు లేక  ఆరు పోగులను కలిపి  ఒక వైపున  గాని  రెండువైపుల  గాని కుట్టవలెను.
1. హెమ్  స్టిచ్ :— సూదిని  నాలుగు పోగుల కిందనుండి తీసి  గుడ్డకు  చిన్న  హెమ్  కుట్టు  కుట్టవలెను.  ఇదే విధంగా  పైన కిందకూడ  కుట్టవచ్చును.

Thursday, September 22, 2016

ఎంబ్రాయిడరి - 51 .a .డ్రాన్ త్రెడ్ వర్క్ కొరకు బట్ట నుంండి పోగులను తీయుట

డ్రా నే  త్రెడ్  వర్క్   :-- (Drawn  Thread  work  :--  ఈ  కుట్టును   సాధారణము గా   చేతి గుడ్డల     , టేబులు  క్లాత్  ల ,    నాప్కిన్ ల అంచులకు  వాడుదురు .  అంచు లందు  అడ్దు  పోగులను  తీసి వేసి.  మి గ తా   నిలువు        పోగులను  5    లే క   6  పోగులను       కలిపి ఒక వైపున  గాని రెండు వైపుల గాని  కుట్టవలెను. 

Sunday, September 18, 2016

ఎంబ్రాయిడరి - 51. డ్రాన్ త్రెడ్ వర్క్ -1



 

డ్రా నే  త్రెడ్  వర్క్   :-- (Drawn  Thread  work  :--  ఈ  కుట్టును   సాధారణము గా   చేతి గుడ్డల     , టేబులు  క్లాత్  ల ,    నాప్కిన్ ల అంచులకు  వాడుదురు .  అంచు లందు  అడ్దు  పోగులను  తీసి వేసి.  మి గ తా   నిలువు        పోగులను  5    లే క   6  పోగులను       కలిపి ఒక వైపున  గాని రెండు వైపుల గాని  కుట్టవలెను. 
హెమ్ స్టిచ్ :-- సూదిని  నాలుగు  పోగుల  కింద  నుండి  తీసి  గుడ్డకు  చిన్న  హెమ్ కుట్టు  కుట్ట  వలెను . ఇదే  విధంగా  పైన  కింద కూడ  కుట్టవచ్చును.            

Friday, August 12, 2016

ఎంబ్రాయిడరి - 46. టైైడ్ హెర్రింగ్ బోన్ కుట్టు


ఎంబ్రాయిడరి- 45. త్రెడెడ్ హెర్రింగ్ బోన్ కుట్టు


ఎంబ్రాయిడరి - 44. క్లోజ్ డ్ హెర్రింగ్ బోన్


ఎంబ్రాయిడరి —43. హెర్రింగ్ బోన్ కుట్టు

హెర్రింగ్ బోన్ :— ఇది   ముక్కలు   అతకడానికి  , మాసికలు   వేయడానికి    ఉపయోగించవచ్చు. అంతేగాక    దీనిని    ఎంబ్రాయిడరీ    డిజైనులలో    కూడ    వాడవచ్చు.  రెండు    లైనులపై  పనిని    చేయవలెను.  పై    లైను  మీద  కుడి  వైపుకు  చిన్న కుట్టు   వేసి  దారాన్ని    సూది క్రింద   నుంచి    తీయవలెను.   తరవాత    మళ్ళీ    సూదిని    క్కిందలైను    పై   గుచ్చి  కుడివైపునకు    కుట్టి    ఎడమవైపునకు.   చిన్న   కుట్టును    తీయవలెను.   ఇప్పుడు   దారాన్ని  సూదిపైకి    ఉంచవలెను.  కుట్టు   కుట్టు కి    మధ్య    స్థలము  సమానముగా    ఉండవలెను. దీనిలో  మరొకరకము  హెర్రింగ్  బోన్  కుట్టు     దగ్గర దగ్గరగా    ఉండును.   పైన  కుట్టు   గట్టి కుట్టు వలె    దగ్గర దగ్గర గా    వచ్చును.   దీనిని   క్లోజ్ డ్  హెర్రింగ్ బోన్  అందురు. (Closed Herring bone )
షాడో వర్క్   ( Shadow  work ) :--- సన్నటి    గుడ్డ    మీద    ఈ    క్లోజ్ డ్    హెర్రింగ్   బోన్   కుట్టు  కుట్టిన    దీనిని షాడో వర్క్  అందురు .  గుడ్డ    వెనుక   వైపున   డిజైనును  కుట్టవలెను . గుడ్డ  
ముందు    భాగమున   పైన .   కిందవేసిన     గట్టి   కుట్టు  మాత్రము   కనబడును.  మిగతా   డిజైన్   భాగమంతయు    దారము   రంగు   లేతగా  షాడో   వలే   కనబడును.  

ఎంబ్రాయిడరి - 42. షెవ్రాన్ కుట్టు



Sunday, August 7, 2016

ఎంబ్రాయిడరి- 36.బటన్ హోల్ కుట్టు - 1


ఎంబ్రాయిడరి - 35. బటన్ హొల్ కుట్టు

బటన్ హోల్  ( Button  Hole ):--- దీన్ని  బ్లాంకెట్  స్టిచ్   అని  కూడ  అంటారు.  ఇందులో  కుట్లన్నీ  దగ్గర దగ్గర  గా  ఉండును.  సూదిని   గుడ్డ  పైకి  గుచ్చిన  తరువాత    దారమును   సూది క్రింద  నుండి   తీసి  సూదిని  పైకి  లాగవలెను. దారము  లూప్  వలె  ఏర్పడును. ఇదే విధంగా  అన్ని కుట్లకు  దారము  సూదిక్రింద నుండి  తీయవలె.  ఈ  కుట్టుకు   ఒక వైపున  కుట్టు  గొలుసు  వలె  ఏర్పడును.  దీనిని  సాధారణముగా   పువ్వులు  నింపుటకు  ,  బ్లాన్ కెట్  చివర  పోగులు  ఊడిపోకుండా   కుట్టుదురు.

Thursday, July 28, 2016

ఎంబ్రాయిడరి- 31.అప్లిక్ కుట్టు

అప్లిక్  వర్క్ :— అప్లిక్   కుట్టుపనికి  సొంపును  కూర్చు  కళ. బుటేదారు  పని  కంటే  తక్కువ కాలములో  పెద్ద పెద్ద  రంగులతో  కూడిన  నమూనాలను   తయారు చేయవచ్చు.  మనకు  కావలసిన  అనేక  ఆకారములలో  పుష్పములు  ,ఆకులు  కొమ్మలు  ,  జంతువులు , ఇతర బొమ్మల  నమూనాలను  గుడ్డపై  కత్తిరించి  ఈ  ముక్కలనీ  వేరోక  బట్టపై  నేర్పుతో  కుట్టవలెను.  ప్రస్తుతము  ఈ కళను  బజారు సంచులు  ,  కుషనులు  ,  తెరలు  ,  మేజా గుడ్డలు  మొదలగు  వాటిని  అతి అందముగా  తయారుచేయుటకు  ఉపయోగించుచున్నారు.  నూలు  బట్టలు,  సిల్కు బట్టలు  , ఉన్ని  బట్టలు  మొదలగునవన్నియు ఇందు ఉపయోగింపవచ్చు.
  ఒక  బట్టపై  మనకు  ఇష్టమైన  నమూనాను  అప్లిక్ చేయవలసి  వచ్చినచో  ఒక   ఉల్లిపొర      కాగితము పై  ఆ   బొమ్మలోని  ముఖ్యమైన  భాగములను  విడివిడిగా  గీయవలెను.  తరువాత  ప్రతిభాగమునకు సరిపడుౡ వర్ణములలో  గుడ్డలను కత్తిరించవలెను. పెద్ద పెద్ద  నమూనాలను  తయారుచేయునప్పుడు  frame  ఉపయోగించిన  బట్ట  ముడతలు  పడదు .
    నమూనాను   గుడ్డపై నుంచి   ఇస్ర్తీ  చేయవలెను. తరువాత   నమూనాలో  ఉన్న   ఆకృతులను  వేర్వేరు  రంగులలో   కత్తిరించవలెను.   ఈ  కత్తిరించిన  ముక్కలను  మాదిరిగా  తీసుకొని  వేర్వేరు  రంగు గుడ్డలనేకము  కత్తిరించవలెను. గుడ్డ యొక్క  పడుగు ,  పేక లు  దానిపై   నతుకు నమూనా యొక్క  పడుగు,  పేకల  ననుసరించి  యుండవలెను.  లేనిచో  ఎప్లిక్  కుట్టినప్పుడు  ముడతలు  పడగలవు.
    కత్తిరించిన  ఎప్లిక్  నమూనాలను  దానికి  తగిన  రంగు  చిక్కదనము  గల  అనువైన  అదేరకపు  గుడ్డపైన  అతుకవలెను.  ఎప్లిక్   నమూనాలను   ఒకదానిపై   మరియొక దానిని 
































.

ఎంబ్రాయిడరి- 30.కచ్ వర్క్— 1


ఎంబ్రాయిడరి - 29.కచ్ వర్క్ తిన్నగా


ఎంబ్రాయిడరి - 28.ఫెదర్ కుట్టు


ఎంబ్రాయిడరి -27. కచ్ వర్క్

కచ్  వర్క్  :-- దీని లో  మొట్ట మొదట  ఎంబ్రాయిడరీ   దారము తో  క్రాస్  ఆకారముతో  కుట్లు కుట్టవలెను.   దీని  ఆదా రంగా   దీని  మీద సూదితో  ఒక్క  కుట్టు  మీదికి  ఒక్క  కుట్టు  కిందికి  వచ్చునట్టు  గా  సూది  సరిగ్గా  కుట్ల  మధ్య నుండి  కిందికి  పైకి  గుద్దకి  గుచ్చకుండా ముందుగా  వేసిన   క్రాస్ కుట్టు  మధ్య నుండి కొత్త వలెను. గుడ్డ అడుగు భాగమున  ఏ  విధమైన  కుట్టు  కనబడదు. 

Saturday, July 16, 2016

ఎంబ్రాయిడరి - 26.లాంగ్ యండ్ షార్ట్

లాంగ్  అండ్  షార్ట్  :-- (  Long and short ) :---ఇది  సాటిన్   స్టిచ్  వలె   కుట్ట వలెను . కానీ  ఇందులో  అన్ని  కుట్లు   సమానముగా  వుండవు.  డిజైన్   పూరించుట లో   కొన్ని  పొడవు  కుట్లను   , కొన్ని పొట్టి   కుట్లను   ఒక వరుస తరువాత   మరియొక  వరుస  ప్రక్క  ప్రక్కన  దగ్గర గా వేయవలెను  . 

ఎంబ్రాయిడరి - 25. ముద్ద కుట్టు


Saturday, July 9, 2016

ఎంబ్రాయిడరి- 24.లాంగ్ హాంగ్ డిటాచ్డ గొలుసు కుట్టు


ఎంబ్రాయిడరి - 23. లేజి డైైజి గొలుసు కుట్టు


ఎంబ్రాయిడరి - 22. వీట్ ఇయర్ గొలుసు కుట్టు


ఎంబ్రాయిడరి - 21.రోజెట్ గొలుసు కుట్టు


ఎంబ్రాయిడరి - 20. కేబుల్ గొలుసు కుట్టు


ఎంబ్రాయిడరి - 19. ఒపెన్ గొలుసు కుట్టు


ఎంబ్రాయిడరి - 18. చెకర్డ్ గొలుసు కుట్టు


ఎంబ్రాయిడరి - 17. చెకర్డ్ గొలుసు కుట్టు


ఎంబ్రాయిడరి - 16. జిగ్ జాగ్ గొలుసు కుట్టు


ఎంబ్రాయిడరి -15. త్రెడెడ్ గొలుసు కుట్టు


Thursday, July 7, 2016

ఎంబ్రాయిడరి - 14.విప్పుడ్ గొలుసు కుట్టు


ఎంబ్రాయిడరి - 13.గొలుసు కుట్టు



గొలుసు  కుట్టు :-- సూదిని  దారంతో  పైకి తెచ్చిన      తరువాత  దారము  ఎడమచేతితో    పట్టుకొని  సూదిని    మరల  మొదట గుచ్చిన  స్థలమునుండి  గుచ్చి పై కి తీయవలెను.  ఇప్పుడు   దారమును  సూది కిందవైపు  చుట్టూ  తిప్పి సూదిని పైకి   లాగిన  గొలుసులాగా  ఏర్పడును.        





ఎంబ్రాయిడరి - 12. క్రాస్ కుట్టు


ఎంబ్రాయిడరి - 11.డబుల్ క్రాస్ కుట్టు