Showing posts with label ఎంబ్రాయిడరి —43. హెర్రింగ్ బోన్ కుట్టు. Show all posts
Showing posts with label ఎంబ్రాయిడరి —43. హెర్రింగ్ బోన్ కుట్టు. Show all posts

Friday, August 12, 2016

ఎంబ్రాయిడరి —43. హెర్రింగ్ బోన్ కుట్టు

హెర్రింగ్ బోన్ :— ఇది   ముక్కలు   అతకడానికి  , మాసికలు   వేయడానికి    ఉపయోగించవచ్చు. అంతేగాక    దీనిని    ఎంబ్రాయిడరీ    డిజైనులలో    కూడ    వాడవచ్చు.  రెండు    లైనులపై  పనిని    చేయవలెను.  పై    లైను  మీద  కుడి  వైపుకు  చిన్న కుట్టు   వేసి  దారాన్ని    సూది క్రింద   నుంచి    తీయవలెను.   తరవాత    మళ్ళీ    సూదిని    క్కిందలైను    పై   గుచ్చి  కుడివైపునకు    కుట్టి    ఎడమవైపునకు.   చిన్న   కుట్టును    తీయవలెను.   ఇప్పుడు   దారాన్ని  సూదిపైకి    ఉంచవలెను.  కుట్టు   కుట్టు కి    మధ్య    స్థలము  సమానముగా    ఉండవలెను. దీనిలో  మరొకరకము  హెర్రింగ్  బోన్  కుట్టు     దగ్గర దగ్గరగా    ఉండును.   పైన  కుట్టు   గట్టి కుట్టు వలె    దగ్గర దగ్గర గా    వచ్చును.   దీనిని   క్లోజ్ డ్  హెర్రింగ్ బోన్  అందురు. (Closed Herring bone )
షాడో వర్క్   ( Shadow  work ) :--- సన్నటి    గుడ్డ    మీద    ఈ    క్లోజ్ డ్    హెర్రింగ్   బోన్   కుట్టు  కుట్టిన    దీనిని షాడో వర్క్  అందురు .  గుడ్డ    వెనుక   వైపున   డిజైనును  కుట్టవలెను . గుడ్డ  
ముందు    భాగమున   పైన .   కిందవేసిన     గట్టి   కుట్టు  మాత్రము   కనబడును.  మిగతా   డిజైన్   భాగమంతయు    దారము   రంగు   లేతగా  షాడో   వలే   కనబడును.