టై అండ్ డై
ఉద్దేశము :--- తెల్లని నూలు బట్టకు టై అండ్ డై చేయుట.
కావలసిన పరికరములు :--- స్టవ్ , పెద్ద గిన్నె , చిన్న గిన్నె , చెక్క గరిటె ( తెడ్డు ) ,
చిన్న మస్లిన్ క్లాత్ , జాడించుటకు టబ్బులు .
కావలసిన పదార్దములు :---డై , హైడ్రో , కాస్టిక్ సోడా . ( hydro , caustic soda , dye )
డై యింగ్ చేయుట :--
1. డై యింగ్ చేయవలసిన బట్టను నీటిలో నానబెట్ట వలెను .
2. డై ను చిన్న గిన్నిలోకి తీసుకోని , వేడినీటిని పోసి కరిగించ వలెను .
3. స్టవ్ మీద ఉన్న గిన్నెలోని నీరు వేడిగా అయిన తరువాత అందులో మొదటగా
hydro ను వేయవలెను . తరువాత caustic soda ను , వేడినీటిలో కరిగించిన dye ను
వేయవలెను .
4. తడిపిన బట్టను విప్పి వేడినీటిలో ఉన్న డై ద్రావణములో వేయవలెను .
5. వేడినీటిలో బట్టను 15 ని ముషములు ఉడకబెట్ట వలెను .
6. మంచినీటిలో డై చేసిన బట్టను పలుమారులు జాడించ వలెను . తెల్లని నీరు వచ్చేవరకు జాడించ వలెను .
7. బట్టను గట్టిగా పిండి వేసి నీడలో ఆరవేయ వలెను .