Saturday, October 27, 2012

లాండ్రీ - 4 .పట్టు వస్త్రాలను శుబ్రపరచుట

పట్టు    వస్త్రాలను    శుబ్రపరచుట   
లక్ష్యము   :--- పట్టు  వస్త్రాలను   శుబ్రపరచుట    నేర్చుకోవడం .
ఉపోద్గాతము :---  పట్టు ,   పట్టు  పురుగునుండి    లభిస్తుంది .  కకూన్లను   వేడినీటిలో    నానవేసి   పోగులను   విడదీస్తారు  .   ఈ   పోగులతో    మంచి  నాణ్యమైన    సున్నితమైన    మరియు   మృదువైన   పట్టుబట్టను    తయారు   చేస్తారు .  పట్టు   బట్టలు   ఎక్కువ  ఖరీదు   కావున   వీటిని    గురించిన   జాగ్రతలు    ,  శుబ్రము    చేయు   పద్దతులను   నేర్చుకొనుట   మంచిది .
                                                       పట్టు   బట్టలను   తడిపినప్పుడు    తక్కువగా    కుంచిస్తాయి . తడిని 
ఎక్కువగా    పీల్చవు .    ఉతికే టప్పుడు    జాగ్రత్తగా     ఉతకవలెను .మృదువుగా  వుంటుంది   కావున   రాపిడి   హానికరము .  లక్స్    వంటి  తటస్త   సబ్బును   ఉపయోగించవలెను .   క్షారము   గల    సబ్బును   ఉపయోగించిన     బట్టల  మెరుపు ,  రంగు ,  మృదు త్వము     కోల్పోతాయి .   బట్టలు  బిరుసెక్కి   త్వరగా   చినుగుతాయి .    కుంకుడు    కాయ    రసాన్ని   వడగట్టి  వాడవచ్చును .  
పట్టునకు     తగు మాత్రము   వేడిని  ఉపయోగించి       ఇస్త్రీ   చేయవలెను .  
తయారు   చేయుట :--  ఉతుకుటకు     ముందు   దుస్తును   దులిపి ,   చినుగు లున్న   లేక  కుట్లు    ఉడిన    కుట్ట వలెను .   
మరకలను  తొలగించుట :---మరకలను    గోరువెచ్చని    నీటితో   తొలగించవలెను . పాత  మరకలను   తక్కువ    శక్తి    గల    బొరాక్స్  ,  సోడియం    పెర్బోరేట్  లను      ఉపయోగించి   తొలగించవలెను .   ఇవి    రంగు    వస్త్రాలను   ఉపయోగించవలెను .    తెల్లని    పట్టు  వస్త్రాలకు    హైడ్రోజెన్    పెరా క్సిడ్    లో   కొద్దిగా     అమ్మోనియా    కలిపి    ఉపయోగించ   వలెను .  
నానబెట్టుట :--- పట్టు   వస్త్రాలు    సులభముగా   శుబ్ర    పరచ వచ్చును .    అందువలన    వీటిని     నానబెట్ట నవసరము    లేదు .   తెల్లని ,   మరియు   పాలిపోయే    రంగులు గల   వస్త్రాలను   కొద్దిగా   బోరాక్స్    కలిపిన    నీటిలో   కొద్ది    సమయము   మాత్రమే   నానబెట్ట  వలెను .   
సబ్బు    నీటిని   తయారు  చేయుట :--- ఉతికేటప్పుడు        రంగు  బట్టలను     వేరు చేసి   ఏ    రంగు   కా   రంగు   బట్టలను   విడిగా   ఉతక  వలెను . ఎక్కువ    రంగు  పోయే      బట్టలకు   పోడి ఉతుకు   శ్రే యస్కరము.    
                                                                కావలిసినంత      వెచ్చని   నీటిలో    తగు మాత్రము   లక్సు 
ముక్కలను    కలపవలెను .    రంగు   బట్టలకు   కుంకుడు   కాయ   రసం    వడగట్టి    వాడ    వచ్చును .
ఉతికే  పద్ధతి    :--- గోరు   వెచ్చని     నీటిలో    సబ్బును    కలిపి   దుస్తును   నీటిలో   ముంచి   పులమవలెను .   ఎక్కువ   మురికి  వున్నా   భాగంలో    తేలికగా    రుద్దవలెను .  చాలా   మురికిగా   ఉన్న   దుస్తులను   బోరాక్స్    కలిపిన   నీటిలో   శుబ్రపరచవలెను .     
జాడించుట :--- సబ్బు    పోయే  వరకు    గోరు  వెచ్చని    నీటిలో  పలుమార్లు    బాగా   జాడించ    వలెను .     ఆఖరి     సారిగా   కొంచెము    నిమ్మరసము   లేక   సిట్రిక్    ఆమ్లము   కొన్ని  చుక్కలు   వేస్తె  బట్టలు  ప్రకాశ  వంతంగా  వుంటాయి .  బట్టకు   మెరుపు  , తేట రంగును    ఇస్తుంది . 
గెంజి    పెట్టుట   :--- ఒక   టేబుల్   చెంచా    జిగురు  పొడి   ఒక   లీటర్    నీళ్ళలో  వాడవచ్చును .   ఈ   పొడిని   ముందు   వేడినీటిలో     కరగ బెట్టి    వడగట్టి   తగినంత   నీటిలో   కలుపు  వచ్చును .     ఈ   జిగురు   నీటిలో    పిండి   నీడలో    ఆరబెట్ట   వలెను .  
ఆరబెట్టుట   :--- పట్టు  వస్త్రాలను   ఎండలో    ఆరబెట్ట  కూడదు   .దుస్తులను   నీడలో   ఆరబెట్ట వలెను .
 ఇస్త్రీ   చేయుట  :--- సగం   ఆరిన  బట్టలను   తీసి   ఇస్త్రీ  చేయ  వలెను .  పూర్తిగా   ఆరిన  బట్టలకు   నీళ్ళు    చల్లి    ఇస్త్రీ   చేసిన   మరకలు    పడతాయి   .  ఇస్త్రీ   చేసిన   బట్టను   పూర్తిగా   చెమ్మ   లేకుండా   కొంచెము    సేపు   ఆరవేసి   పూర్తిగా  ఆరిన     తరువాత     మడవ   వలెను .
======================================================================



   

Friday, October 26, 2012

లాండ్రీ - 3 .కృత్రిమ పోగుల బట్టలను శుబ్రపరచుట

కృత్రిమ  పోగుల   బట్టలను   శుబ్రపరచుట 
లక్ష్యము :---  కృత్రిమ   పోగుల   బట్టలను    శుబ్రపరచుట    నేర్చుకొనుట  . 
ఉపోద్గాతము  :---కృత్రిమపోగులు    కోల్ టార్     నుండి    లభించే   కొన్ని   పదార్ధాలనుండి   లభిస్తుంది  .
 పదార్ధాలను    హెక్సమిధిలిన్     డై    అమిన్   అడిపిక్   ఆమ్లము    వీ టి    సంయోగము  వలన    ఏర్పడిన   నైలాన్   లవణమును    దారంగా   వాడుదురు .   
                                                                    కృత్రిమ   పోగులు   క్రమమైన   తీగవలె    ఉండును .  కాలినప్పుడు   రసాయన   పదార్ధాల    వాసన    వస్తుంది .  ఈ   పోగులు    అతివేగంగా    కాలుతాయి . కాబట్టి   మంట  దగ్గర   ఈ   దుస్తులను   ఉపయోగించిన    ప్రమాదకరము .  ఈ   వస్త్రాలు   నలగవు .  ఇస్త్రీ  ఎక్కువ    అవసరము  లేదు .
మరకలను  తొలగించుట :--- మరకలను    పలుచనచేసిన    రసాయన    పదార్ధాలను    ఉపయోగించి  తొలగించ  వలెను .   రసాయన   పదార్ధాలు    కృత్రిమ    వస్త్రాలకు   హాని   కలిగించును .కావున   జాగ్తత్తగా    చేయవలెను .    
సబ్బు  నీరు   :---స్వాదు  నీటిలో    తటస్ట మైన    సబ్బు  వేసి    సబ్బు  నీరు    తయారు   చేయవలెను . సబ్బు   నీరు   గోరు  వెచ్చనిథై    ఉండవలెను .    దుస్తును    సబ్బు  నీటిలో   విప్పి  తేలికగా    రుద్దుతూ   ,  పిండుతూ    శుబ్ర పరచ వలెను .    సబ్బు   నీటిలో   దుస్తులను    ఎక్కువ   సేపు  ఉంచరాదు .   మురికి  వున్నా    భాగాలను   జాగ్రత్తగా    నురుగుతో    రుద్ది   శుబ్ర పరచవలెను .
జాడించుట :--- రెండు ,  మూడు    సార్లు   నీటిలో     జాడించ వలెను .   సబ్బు   దుస్తునకు    అంటుకొని   ఉండిపోయిన  యెడల   దుస్తునకు   హాని    కలుగును  మరియు    దుర్వాసన    వేయును .
ఆరవేయుట :--- దుస్తులను   రెండు   అరచేతులలో     నుంచుకొని    నొక్కుచు   తేమను   తొలగించ   వలెను .    దుస్తులను   నీడలో     ఆరవేయవలెను .    దుస్తులను    చక్కగా   పరచి   ఆరబెట్టవలెను .
ఇస్త్రీ   చేయుట  :--- కృత్రిమ    పోగుల   వస్త్రాలకు    ఎక్కువ  వేడితో     ఇస్త్రీ   చేయరాదు .  చాలా   తక్కువ   వేడితో    ఇస్త్రీ   చేయ  వలెను .
ముగింపు  :--- ఇది    హైడ్రో   ఫోనిక్       అగుట    వలన    తడిని   పీల్చదు .   త్వరగా    ఆరిపోవును .
ఈ  కారణముల      వలన   నేత    పరిశ్రమలోనే   ఇది  ప్రసిద్ది  కెక్కినది . 

========================================================================= 

Thursday, October 25, 2012

లాండ్రీ - 2. ఉన్ని బట్టలను ఉతుకుట

ఉన్ని    బట్టలను   ఉతుకుట  
లక్ష్యము :---ఉన్ని    బట్టలను   ఉతుకుటను   నేర్చుకొనుట .
ఉపోద్ఘాతము   :--- ఉన్ని  బట్టలు      అల్లికలో   నుండుట   వలన   ఎక్కువ    మురికి  చేరుతుంది  .అందువలన    దుస్తులను   బాగా   దులపవలెను .  చిరుగులను    మరమ్మతు  చేయవలెను .మరకలున్న  తీసివేయవలెను .  చేతితో   అల్లిన   దుస్తుల  ఆకారము   ఉతికినప్పుడు   కోల్పోయే  ప్రమాదముంది .   కనుక   తడుపుటకు    ముందు   కాగితముపై   దుస్తులను   పెట్టి   చుట్టూ      ఆకారమును   గీయవలెను .  
ఉతుకునప్పుడు    తీసుకొనవలసిన   జాగ్రత్తలు :---   
1. గోరువెచ్చని  నీటిలో   ఉతక   వలెను .
2. క్షారము    ఉపయోగించాకూడదు .
3. సోడా    ఉన్న  సబ్బును    ఉపయోగించ  కూడదు .
4.  రాపిడి    నుపయోగించ   కూడదు .
తయారు  చేయుట :--
ఉతికిన    తరువాత   దుస్తును   పేపరుపై    పెట్టి   ముందు   గీసిన    ఆకారమునకు    సరిచేయవలెను .  
దుస్తును    టేబుల్    పై   ఆరవేసిన   యెడల    ఒక    ప్రక్క   ఆరిన    తరువాత   మరియొక   ప్రక్కకు   
త్రిప్పుచుండ  వలెను .       
మరకలను    తొలగించుట  :---చల్లని   లేక   గోరు  వెచ్చని    నీటితో   మరకలను    తొలగించ వలెను .
పాత    మరకలను    తొలగించుటకు    తక్కువ    శక్తీ  గల   అమ్లములను   ఉపయోగించవలెను .
నానబెట్టుట  :---  ఊలు    దుస్తులను   నానబెట్టుట  వలన   దుస్తులు    పాడై   పోవును .
నీటిని    సిద్దము    చేయుట:-- గోరువెచ్చని    మంచినీరు   నుపయోగించావలెను .  ఉస్ణోగ్రత   స్టిరముగా    నుండవలెను .
సబ్బు :--- ఊలు   దుస్తులను   తటస్తమైన   సబ్బుతో    ఉతకవలెను .
ఉతుకువిధానము :--సబ్బు  ముక్కలతో   ,  గోరువెచ్చని   నీటితో   నురగను    తయారుచేయవలెను .
దుస్తును   దులిపి   సబ్బు   నీటిలో    ముంచ వలెను .    దుస్తు    యొక్క   మురికి  పోవునంతవరకు 
ఒక  అరచేతిలో   దుస్తును   తీసుకోని    మరియొక   చేతితో   దానిపై       సబ్బు  నీరు   పోయుచు   ,దుస్తు   పై     రుద్దుతూ   ,   దుస్తును   పిండుతూ    ఉతకవలెను   .  దుస్తును   సబ్బు నీటిలో  నుండి   తీసి   దుస్తును     నొక్కవలెను .   దుస్తును   గోరువెచ్చని  నీటిలో   పలుమారులు   జాడించ వలెను .ఏదైనా   సబ్బు   దుస్తునందు    ఉండిన         అది    హాని  కలిగించును   .  ఆఖరుగా   తెల్లని  దుస్తును   నీటిలో  కొంచెము   సిట్రిక్   ఆసిడ్    వేసి     జాడించ వలెను .    రంగు   దుస్తులను   ఆఖరుగా   నీటిలో    కొంచెము     వెనిగర్   వేసి   జాడించ వలెను .   దుస్తుల   తేమను    తొలగించవలెను .   దుస్తుల   తేమను    తొలగించవలెను .   దుస్తును   తువ్వాలు    మద్య  పెట్టి   చుట్టి   చేతులతో   నొక్కి   తేమను  తొలగించవలెను . 
ఆరబెట్టుట :---
వెచ్చని   పొడి  స్తలములో   దుస్తులను   ఆరబెట్ట వలెను .  తడి   కొంచము  తగ్గిన  తరువాత   పేపరుపై   దుస్తును   పరచి   ముందు  సైజుకు    తీసుకు  రావలెను .   అనగా   ఉతుకుటకు   ముందు  గిసిన   గీతకు   సరిపడువరకు    మెల్లగా     లాగి   సరిచేయవలెను .     నీడలో  ఆరబెట్ట వలెను .
ఇస్త్రీ  చేయుట :--- కొంచెము   తడి  తగ్గిన   తరువాత   ఇస్త్రీ    చేయవలెను .   దుస్తుపై    సన్న  బట్టను   పరచి  దానిపై   ఇస్త్రీ   చేయవలెను .    దుస్తు   రెండు  వైపులా   ఇస్త్రీ    చేయవలెను .
======================================================================= 
 

Sunday, October 21, 2012

లాండ్రీ - 1. తెల్లని నూలు ,లినెన్ వస్త్రాలను ఉతుకు విధానము

        తెల్లని నూలు ,లినెన్   వస్త్రాలను     
                                        ఉతుకు    విధానము .
లక్ష్యము  :--- నూలు   వస్త్రములను  , లినెన్   వస్త్రములను   ఉతుకుట  .
పద్ధతి  :---
దుస్తులను   తయారు  చేయుట   :---
జేబులను   ఖాళి  చేసి   , అలంకరణ  బొత్తములను   గాని   బకేల్స్  గాని   ఉన్న   తీసి  వేయవలెను .
చిరుగులను   కుట్ట  వలెను .  బట్టలను   శుభ్రపరచు    నపుడు     పోని    మరకలను   ముందే  తొలగించవలెను .
దుస్తులను    వేరు  చేయుట   :---
దుస్తులను    ఈ   క్రింద   చెప్పిన   విధానములో    వేరు  చేయ  వలెను .
1. ముతక  దుస్తులు  .
2. చాల  మురికి  బట్టలు .
3. తక్కువ    మురికి  బట్టలు.
4 . చేతి  రుమాళ్ళు  .
నానబెట్టుట  :---  
దుస్తులను   చల్లని   నీ టిలో    నానబెట్ట  వలెను .  కొంచెం   సేపు    నానబెట్టుట    వలన   దుమ్ము , ధూళి తొలగిపోవును . కాలర్స్  ,  చేతి  కఫ్ఫ్స్   సబ్బు  నీటితో   బాగుగా   వుతికి     పిమ్మట   నాన బెట్ట  వలెను.
ఇది    మురికిని   త్వరగా   వదిలించును .  
                                                            దుస్తులను     ముఖ్యముగా    జిడ్డు    సంబందమైన    మురికి  గల  వాటిని   ఒక   ఓన్సు    సోడా   ఒక   గ్యాలను   నీటిలో   వేసి   నాన   బెట్ట వలెను .  చేతి   రుమళ్ళని 
వేరుగా   ఒక   టీ   స్పూను   ఉప్పు   ఒక    గ్యాలను   నీటిలో   వేసి   ,  అందులో  నాన బెట్టవలెను .  చీముడు    ఉన్న   రుమాళ్ళను    ఈ   ఉప్పు    శుబ్రపరచును .   
ఉతుకు  విధానము :---
నానబెట్టిన       నీటిలో    నుండి   బట్టలను   పిండి ,  తీసి   ,  గోరు  వెచ్చని     నీటిని   మరియు   సబ్బు ను   ఉపయోగించి    ఉతకవలెను . తెల్లని    నూలు     వస్త్రములను    ఎక్కువ   వేడి     నీటిలో   ఉతకవలెను .
ఎక్కువ    మురికి    కనబడు   స్లల మందు    జాగ్ర త్త గా     ఉతకవలెను .   రెండు  మూడు   సార్లు   జాదించిన  పిదప   ఉడకబెట్టవలెను .

ఉడకబెట్టుట   :---
తెల్లని  దుస్తులను    ఉడకబెట్ట వచ్చును .   ఎవైన      మరకలను   తొలగించుటకు   ఇది   ఉపయోగపడును . 1  టీ   స్పూను   సోడా   ,  ఒక  టేబులు   స్పూన్     సబ్బును   ఒక    గ్యాలను   నీటిలో   కలుపవలెను   .  సోడా   ఒక్క  దానినే    ఉపయోగించి న    బట్టలకు  హాని  కలుగును .
జాడించుట   :---ఉడకబెట్టిన    పిదప   బట్టలను    చల్లని   నీటిలో   వేయవలెను .  సబ్బు  అంతయు   పోవువరకు    పలుమార్లు     జాడించ వలెను .  
గెంజి  ,  నీ లిమందులను    పెట్టుట :---   కావలసినంత    నీలిమందును    గెంజిలో   కలుపవలెను.
తరువాత   బాగుగా   కలుపవలెను .  కలుపని    యెడల   నీలిమందు   దుస్తులపై   అక్కడక్కడ   అంటుకొని   ఉండిపోవును .  తెల్లని   వస్త్రములను   ముంచి    పిండ వలెను .  
ఆరవేయుట   :--- బైట   సూర్య రశ్మి  లో   ఆరవేయుట    వలన     బట్టలు   ఎక్కువ  తెల్లగా   కనబడును .
త్వరగా    ఆరును .  సుక్ష్మ    క్రిములున్న  యెడల    చనిపోవును .   ఎక్కువ  ఎండలో    ఎక్కువసేపు   ఆరబెట్ట కూడదు .  ఎక్కువ  ఎండా   తెల్లని   దుస్తులను   పసుపు  రంగుగా   మార్చును .
ఇస్త్రీ   చేయుట  :--- పూర్తిగా   ఆరిన   దుస్తులను   తడి  చేసి   ఇస్త్రీ   చేయవలెను .ముడతలను   పోగొట్టెంత   వేడిగా   ఇస్త్రీ   పెట్టె    ఉండవలెను .   ఇస్త్రీ   పెట్టె  చల్లగా    ఉన్న  యెడల   దుస్తునకు    పెట్టిన   గెంజి   ఇస్త్రీ పెట్టెకు    అంటుకొని   ఇస్త్రీ   చేయుట   కష్టమగును . .