Saturday, October 27, 2012

లాండ్రీ - 4 .పట్టు వస్త్రాలను శుబ్రపరచుట

పట్టు    వస్త్రాలను    శుబ్రపరచుట   
లక్ష్యము   :--- పట్టు  వస్త్రాలను   శుబ్రపరచుట    నేర్చుకోవడం .
ఉపోద్గాతము :---  పట్టు ,   పట్టు  పురుగునుండి    లభిస్తుంది .  కకూన్లను   వేడినీటిలో    నానవేసి   పోగులను   విడదీస్తారు  .   ఈ   పోగులతో    మంచి  నాణ్యమైన    సున్నితమైన    మరియు   మృదువైన   పట్టుబట్టను    తయారు   చేస్తారు .  పట్టు   బట్టలు   ఎక్కువ  ఖరీదు   కావున   వీటిని    గురించిన   జాగ్రతలు    ,  శుబ్రము    చేయు   పద్దతులను   నేర్చుకొనుట   మంచిది .
                                                       పట్టు   బట్టలను   తడిపినప్పుడు    తక్కువగా    కుంచిస్తాయి . తడిని 
ఎక్కువగా    పీల్చవు .    ఉతికే టప్పుడు    జాగ్రత్తగా     ఉతకవలెను .మృదువుగా  వుంటుంది   కావున   రాపిడి   హానికరము .  లక్స్    వంటి  తటస్త   సబ్బును   ఉపయోగించవలెను .   క్షారము   గల    సబ్బును   ఉపయోగించిన     బట్టల  మెరుపు ,  రంగు ,  మృదు త్వము     కోల్పోతాయి .   బట్టలు  బిరుసెక్కి   త్వరగా   చినుగుతాయి .    కుంకుడు    కాయ    రసాన్ని   వడగట్టి  వాడవచ్చును .  
పట్టునకు     తగు మాత్రము   వేడిని  ఉపయోగించి       ఇస్త్రీ   చేయవలెను .  
తయారు   చేయుట :--  ఉతుకుటకు     ముందు   దుస్తును   దులిపి ,   చినుగు లున్న   లేక  కుట్లు    ఉడిన    కుట్ట వలెను .   
మరకలను  తొలగించుట :---మరకలను    గోరువెచ్చని    నీటితో   తొలగించవలెను . పాత  మరకలను   తక్కువ    శక్తి    గల    బొరాక్స్  ,  సోడియం    పెర్బోరేట్  లను      ఉపయోగించి   తొలగించవలెను .   ఇవి    రంగు    వస్త్రాలను   ఉపయోగించవలెను .    తెల్లని    పట్టు  వస్త్రాలకు    హైడ్రోజెన్    పెరా క్సిడ్    లో   కొద్దిగా     అమ్మోనియా    కలిపి    ఉపయోగించ   వలెను .  
నానబెట్టుట :--- పట్టు   వస్త్రాలు    సులభముగా   శుబ్ర    పరచ వచ్చును .    అందువలన    వీటిని     నానబెట్ట నవసరము    లేదు .   తెల్లని ,   మరియు   పాలిపోయే    రంగులు గల   వస్త్రాలను   కొద్దిగా   బోరాక్స్    కలిపిన    నీటిలో   కొద్ది    సమయము   మాత్రమే   నానబెట్ట  వలెను .   
సబ్బు    నీటిని   తయారు  చేయుట :--- ఉతికేటప్పుడు        రంగు  బట్టలను     వేరు చేసి   ఏ    రంగు   కా   రంగు   బట్టలను   విడిగా   ఉతక  వలెను . ఎక్కువ    రంగు  పోయే      బట్టలకు   పోడి ఉతుకు   శ్రే యస్కరము.    
                                                                కావలిసినంత      వెచ్చని   నీటిలో    తగు మాత్రము   లక్సు 
ముక్కలను    కలపవలెను .    రంగు   బట్టలకు   కుంకుడు   కాయ   రసం    వడగట్టి    వాడ    వచ్చును .
ఉతికే  పద్ధతి    :--- గోరు   వెచ్చని     నీటిలో    సబ్బును    కలిపి   దుస్తును   నీటిలో   ముంచి   పులమవలెను .   ఎక్కువ   మురికి  వున్నా   భాగంలో    తేలికగా    రుద్దవలెను .  చాలా   మురికిగా   ఉన్న   దుస్తులను   బోరాక్స్    కలిపిన   నీటిలో   శుబ్రపరచవలెను .     
జాడించుట :--- సబ్బు    పోయే  వరకు    గోరు  వెచ్చని    నీటిలో  పలుమార్లు    బాగా   జాడించ    వలెను .     ఆఖరి     సారిగా   కొంచెము    నిమ్మరసము   లేక   సిట్రిక్    ఆమ్లము   కొన్ని  చుక్కలు   వేస్తె  బట్టలు  ప్రకాశ  వంతంగా  వుంటాయి .  బట్టకు   మెరుపు  , తేట రంగును    ఇస్తుంది . 
గెంజి    పెట్టుట   :--- ఒక   టేబుల్   చెంచా    జిగురు  పొడి   ఒక   లీటర్    నీళ్ళలో  వాడవచ్చును .   ఈ   పొడిని   ముందు   వేడినీటిలో     కరగ బెట్టి    వడగట్టి   తగినంత   నీటిలో   కలుపు  వచ్చును .     ఈ   జిగురు   నీటిలో    పిండి   నీడలో    ఆరబెట్ట   వలెను .  
ఆరబెట్టుట   :--- పట్టు  వస్త్రాలను   ఎండలో    ఆరబెట్ట  కూడదు   .దుస్తులను   నీడలో   ఆరబెట్ట వలెను .
 ఇస్త్రీ   చేయుట  :--- సగం   ఆరిన  బట్టలను   తీసి   ఇస్త్రీ  చేయ  వలెను .  పూర్తిగా   ఆరిన  బట్టలకు   నీళ్ళు    చల్లి    ఇస్త్రీ   చేసిన   మరకలు    పడతాయి   .  ఇస్త్రీ   చేసిన   బట్టను   పూర్తిగా   చెమ్మ   లేకుండా   కొంచెము    సేపు   ఆరవేసి   పూర్తిగా  ఆరిన     తరువాత     మడవ   వలెను .
======================================================================



   

No comments:

Post a Comment