కృత్రిమ పోగుల బట్టలను శుబ్రపరచుట
లక్ష్యము :--- కృత్రిమ పోగుల బట్టలను శుబ్రపరచుట నేర్చుకొనుట .
ఉపోద్గాతము :---కృత్రిమపోగులు కోల్ టార్ నుండి లభించే కొన్ని పదార్ధాలనుండి లభిస్తుంది .
పదార్ధాలను హెక్సమిధిలిన్ డై అమిన్ అడిపిక్ ఆమ్లము వీ టి సంయోగము వలన ఏర్పడిన నైలాన్ లవణమును దారంగా వాడుదురు .
కృత్రిమ పోగులు క్రమమైన తీగవలె ఉండును . కాలినప్పుడు రసాయన పదార్ధాల వాసన వస్తుంది . ఈ పోగులు అతివేగంగా కాలుతాయి . కాబట్టి మంట దగ్గర ఈ దుస్తులను ఉపయోగించిన ప్రమాదకరము . ఈ వస్త్రాలు నలగవు . ఇస్త్రీ ఎక్కువ అవసరము లేదు .
మరకలను తొలగించుట :--- మరకలను పలుచనచేసిన రసాయన పదార్ధాలను ఉపయోగించి తొలగించ వలెను . రసాయన పదార్ధాలు కృత్రిమ వస్త్రాలకు హాని కలిగించును .కావున జాగ్తత్తగా చేయవలెను .
సబ్బు నీరు :---స్వాదు నీటిలో తటస్ట మైన సబ్బు వేసి సబ్బు నీరు తయారు చేయవలెను . సబ్బు నీరు గోరు వెచ్చనిథై ఉండవలెను . దుస్తును సబ్బు నీటిలో విప్పి తేలికగా రుద్దుతూ , పిండుతూ శుబ్ర పరచ వలెను . సబ్బు నీటిలో దుస్తులను ఎక్కువ సేపు ఉంచరాదు . మురికి వున్నా భాగాలను జాగ్రత్తగా నురుగుతో రుద్ది శుబ్ర పరచవలెను .
జాడించుట :--- రెండు , మూడు సార్లు నీటిలో జాడించ వలెను . సబ్బు దుస్తునకు అంటుకొని ఉండిపోయిన యెడల దుస్తునకు హాని కలుగును మరియు దుర్వాసన వేయును .
ఆరవేయుట :--- దుస్తులను రెండు అరచేతులలో నుంచుకొని నొక్కుచు తేమను తొలగించ వలెను . దుస్తులను నీడలో ఆరవేయవలెను . దుస్తులను చక్కగా పరచి ఆరబెట్టవలెను .
ఇస్త్రీ చేయుట :--- కృత్రిమ పోగుల వస్త్రాలకు ఎక్కువ వేడితో ఇస్త్రీ చేయరాదు . చాలా తక్కువ వేడితో ఇస్త్రీ చేయ వలెను .
ముగింపు :--- ఇది హైడ్రో ఫోనిక్ అగుట వలన తడిని పీల్చదు . త్వరగా ఆరిపోవును .
ఈ కారణముల వలన నేత పరిశ్రమలోనే ఇది ప్రసిద్ది కెక్కినది .
=========================================================================
No comments:
Post a Comment