రిపేరులు - డార్నింగ్
సన్నని కూర్పు కుట్లని ఉపయోగించి చిన్న చిరుగులను కుట్టు పద్ధతినే డార్నింగ్ అని అందురు .
a.) డార్నింగ్ చేయు నమునా తిరిగి చూచుకొనుటకు సులభముగా ఉండును .
b.) డార్నింగ్ చేస్తున్నప్పుడు ఆ భాగాన్ని చేతితో మూసివేయరాదు .
c.) రిపేరు చేసిన భాగాన్ని చేతితో రుద్దరాదు . అట్లు చేసినయెడల పోగులు రాలిపోవును లేదా అందము చెడి పోవుటకు అవకాశము కలదు .
2. డార్నింగ్ ఒక క్రమ పద్దతిలో చేయవలెను లేదా కొత్తగా ప్రక్కనే చిరిగిపోవుటకు అవకాశము కలదు . దీర్ఘ చతురస్రాకారములో డార్నింగ్ చేయుట ఉత్తమము .
3.డార్నింగ్ చేయునపుడు రెండు కొనల వద్ద 1/4" దారము వదలి , ప్రతి వరుస చివర లూపు వలె దారము వదలవలెను . ఇట్లు చేయుటవలన బట్ట కుంచించునపుడు ఉపయోగపడును .
4. డార్నింగ్ చేయునపుడు ఆ బట్టకు సరిపడు దారము , రంగును ఎంచు కొనవలెను .
సాధారణముగా పట్టునకు పట్టు , ఊలు నకు ఊలు , నూలు నాకు నూలు ఉపయోగించవలెను .
5. డార్నింగ్ చేసినపుడు బట్టను సాగదీయ రాదు . బట్ట నుండి దారమును లాగునప్పుడు
బొటనవ్రేలితో దారమును పట్టుకొన వలెను .
కావలసిన సూదులు :--- దీనికి పొడవైన మరియు పెద్ద రంద్రముగల సూదిని వాడవలెను .
a) పొడవైన సూదివలన ఎక్కువ సంఖ్య లో కుట్లను తీయుటకు ఉపయోగపడుతుంది .
b) పెద్ద రంద్రముండుట వలన ఆ బట్ట యొక్క ప్రత్యేకమైన దారాన్ని సులభముగా ఎక్కించుటకు వీలుకలుగును .
సూదిని కుట్టునపుడు పట్టుకొనవలసిన దిశ :---
up rows - from the chest
down rows - towards the chest
డార్నింగ్ చేయవలెను . అడ్డముగా చిరిగితే నిలువుగా చేయవలెను . 7వ లేక 8 వ నెంబర్ గల సూదులు ఉపయోగించవలెను . అంచు వైపున గల పోగుతో డార్నింగ్ చేసిన యెడల అది చక్కని ఫలితమునిచ్చును . బట్ట పోగులు రాలి పోయోదైన యెడల అంచులను సన్నని సూది , దారము సహాయముతో చిన్న చిన్న ఫిష్ బోన్ కుట్టు వేయవలెను . చిరుగు మొదలు వద్ద సూదిని గ్రుచ్చి 1/6" వంతు దూరములో సూదిని బయటికి తీయవలెను . ఈ విధంగా చిరుగు చివరి వరకు చేయవలెను . చిరుగు అంచులు రెండూ బట్ట రాంగ్ సైడ్ లో దగ్గరికి చేర్చబడతాయి . తరువాత డార్నింగ్ చేసిన తరువాత ఈ కుట్లు విప్పివేయ వలెను .
డార్నింగ్ చేయుటలో ప్రాధమిక సూత్రాలు :---
1. డార్నింగ్ చేయునపుడు ఎడమ చేతివైపు వైపు మొదలుపెట్ట వలెను . ఎందుకనగా a.) డార్నింగ్ చేయు నమునా తిరిగి చూచుకొనుటకు సులభముగా ఉండును .
b.) డార్నింగ్ చేస్తున్నప్పుడు ఆ భాగాన్ని చేతితో మూసివేయరాదు .
c.) రిపేరు చేసిన భాగాన్ని చేతితో రుద్దరాదు . అట్లు చేసినయెడల పోగులు రాలిపోవును లేదా అందము చెడి పోవుటకు అవకాశము కలదు .
2. డార్నింగ్ ఒక క్రమ పద్దతిలో చేయవలెను లేదా కొత్తగా ప్రక్కనే చిరిగిపోవుటకు అవకాశము కలదు . దీర్ఘ చతురస్రాకారములో డార్నింగ్ చేయుట ఉత్తమము .
3.డార్నింగ్ చేయునపుడు రెండు కొనల వద్ద 1/4" దారము వదలి , ప్రతి వరుస చివర లూపు వలె దారము వదలవలెను . ఇట్లు చేయుటవలన బట్ట కుంచించునపుడు ఉపయోగపడును .
4. డార్నింగ్ చేయునపుడు ఆ బట్టకు సరిపడు దారము , రంగును ఎంచు కొనవలెను .
సాధారణముగా పట్టునకు పట్టు , ఊలు నకు ఊలు , నూలు నాకు నూలు ఉపయోగించవలెను .
5. డార్నింగ్ చేసినపుడు బట్టను సాగదీయ రాదు . బట్ట నుండి దారమును లాగునప్పుడు
బొటనవ్రేలితో దారమును పట్టుకొన వలెను .
కావలసిన సూదులు :--- దీనికి పొడవైన మరియు పెద్ద రంద్రముగల సూదిని వాడవలెను .
a) పొడవైన సూదివలన ఎక్కువ సంఖ్య లో కుట్లను తీయుటకు ఉపయోగపడుతుంది .
b) పెద్ద రంద్రముండుట వలన ఆ బట్ట యొక్క ప్రత్యేకమైన దారాన్ని సులభముగా ఎక్కించుటకు వీలుకలుగును .
సూదిని కుట్టునపుడు పట్టుకొనవలసిన దిశ :---
up rows - from the chest
down rows - towards the chest
నిలువుగా చిరిగిన చిరుగును డార్నింగ్ చేయుట :---
ఇది సాధారణముగా చాకు నుపయోగించునప్పుడు నిర్లక్ష్యము వలన ఏర్పడుతుంది . ఇది నిలువుగా గాని అడ్డముగా గాని చిరుగును . దారాలు నిలువుగా చిరిగితే అడ్డముగా డార్నింగ్ చేయవలెను . అడ్డముగా చిరిగితే నిలువుగా చేయవలెను . 7వ లేక 8 వ నెంబర్ గల సూదులు ఉపయోగించవలెను . అంచు వైపున గల పోగుతో డార్నింగ్ చేసిన యెడల అది చక్కని ఫలితమునిచ్చును . బట్ట పోగులు రాలి పోయోదైన యెడల అంచులను సన్నని సూది , దారము సహాయముతో చిన్న చిన్న ఫిష్ బోన్ కుట్టు వేయవలెను . చిరుగు మొదలు వద్ద సూదిని గ్రుచ్చి 1/6" వంతు దూరములో సూదిని బయటికి తీయవలెను . ఈ విధంగా చిరుగు చివరి వరకు చేయవలెను . చిరుగు అంచులు రెండూ బట్ట రాంగ్ సైడ్ లో దగ్గరికి చేర్చబడతాయి . తరువాత డార్నింగ్ చేసిన తరువాత ఈ కుట్లు విప్పివేయ వలెను .
'L' ఆకారముగా చిరిగిన చిరుగును డార్నింగ్ చేయుట :---
బట్ట యొక్క రాంగ్ సైడ్ డార్నింగ్ చేయవలేను . చేప ముళ్ళు కుట్టుతో అంచులను కుట్ట వలెను . బట్ట మరీ సున్నితమైన దయిన యెడల , ఎక్కువ పోగులు రాలిపోయే దయిన యెడల బట్ట అడుగున ఒక దళసరి పేపర్ నుంచి కుట్ట వలెను . దీని వలన
ముడుతలు తక్కువగా పడుటకు అవకాశము కలుగును .
బట్టను బొటన వ్రేలు , చూపుడు వ్రేలు , మద్య వ్రేళ్ళ సహాయముతో పట్టుకొనుము .
బట్ట యొక్క అడ్డపు పోగుల వైపు డార్నింగ్ చేయుట మొదలుపెట్టవలెను . ఎడమ చేతి వైపు డార్నింగ్ చేయుట మొదలుపెట్టవలెను . ఒకటి ,రెండు లేక మూడు పొరల దారమును సూది లోకి తీసుకొని అన్ని వరుసలలో సమాన సంఖ్య లో కుట్లు వేయ వలెను . అదే విధముగా మరియొక వైపు కూడా కుట్టవలెను . చిరుగు పైన 1/4" నుండి కుట్లు మొదలు పెట్టవలెను . అన్ని వరుసలు సమ దూరములో ఉండవలెను .
రంద్రాన్ని డార్నింగ్ చేయుట :---
చిరుగు దగ్గర బయటకు వచ్చిన పోగులను కత్తిరించి డార్నింగ్ చేయు స్థలమును శుబ్ర పరచి తిరగవైపునకు త్రిప్పి కుట్టుటకు మొదలుపెట్ట వలెను .
కుట్టు నప్పుడు రంద్రమున్న స్థ లమందు దారమును వదలి తిరిగి రంద్రము చివరనుండి కుట్టుటకు మొదలు పెట్టవలెను . డార్నింగ్ నిలువుగాను అడ్డముగాను చేసిన రంద్రమున్న స్థ లమునందు దారమును అల్లిక వలే కుట్టిన నేత వలే వచ్చును . ఈ విధంగా రంద్రము కుట్లతో మూయబడును .