బాలికల నిక్కరు

కొలతలు :---
సీటు = 20 "
పొడవు = 8 " ( 1 / 2 సీటు - 2 " )
వెడల్పు = 6 1 / 2 " ( 1 /4 సీటు + 1 1 / 2 " )
కాగితపు కొలతలు :---
పొడవు = 16 "
వెడల్పు = 13 "
కాగితమును మడచుట :---
16 " పొడవు , 13" వెడల్పు గల కాగితాన్ని తీసుకొని
వెడల్పును మధ్యకు మడచి మడతను కుడి వైపున
వుంచవలెను . పొడవును మధ్యకు మడచి మడతను అడుగున
వుంచవలెను .
నిర్మాణ క్రమము :---
A B = పుర్తిపోడవు = 8 "
A C = వెడల్పు = 6 1/2 "
A B = C D
A C = B D
A A1 = 1 "
C C1 = 1 "
C E = 1/3 సీటు = 6 1/2 "
D D1 = 1/12 సీటు + 1/ 2 " = 2 1/ 4 "
A1 C1 కలుపుము .
C1E = కలుపుము .
E D1 వంపుగా కలుపుము .
ముందుభాగము :---
A 1 G = 1/4 సీటు
A1 G చుక్కల గీతతో కలుపవలెను .
G E చుక్కల గీతతో కలుపవలెను .
నమునాను కత్తిరించుట :---
వెనుకభాగామునకై A 1 C1 , C1 E , E D1 ను నాలుగు పొరలపై కత్తిరించవలెను . ముందుభాగామునకై కాగితపునమునా
తెరచి A 1 G మరియు G E ని చుక్కలగీతపై నుండి రెండు పొరలపై కత్తిరించవలెను .
నమునా నుపయోగించి బట్టను కత్తిరించుట :---
బట్టను రెండు మడతలుగా బల్లపై పరచి బట్ట పొడవు ,
నిక్కరు పొడవును ఓకే వైపున ఉంచవలెను . ప్రక్క భాగమున కుట్టునకు 1/2 " , క్రిందిభాగమున మడతకు
1 " , పైభాగమున మడతకు 1 1 /2 " విడిచి చుక్కలగీతతో
గుర్తించవలెను . బట్టను చుక్కల గీత పైనుండి జాగ్రత్తగా
కత్తిరించవలెను .
1 .వెనుక భాగములు రెండింటిని కలిపి టాకావేసి
సాధారణ అతుకుతో కుట్టవలెను .
2. ముందు భాగములు రెండింటిని కలిపి టాకా వేసి
సాధారణ అతుకుతో కుట్టవలెను .
3 . క్రిందిభాగాన్ని 1/2 " మడచి కుట్టవలెను .
4 . పైభాగమును 1 1/2 " పట్టికి మడచి కుట్టవలెను .
5 . ఎలాస్టిక్ లేదా నాడాను ఉపయోగించవచ్చును .
బట్టను ఎన్నుకొనుట :--
కేస్ మెంట్ ,పోప్లిన్ మొదలగునవి .
బట్ట అంచనా :---
రెండుపోడవులు .
--------------------------------------/\--------------------------------------------