Thursday, July 28, 2016

ఎంబ్రాయిడరి- 31.అప్లిక్ కుట్టు

అప్లిక్  వర్క్ :— అప్లిక్   కుట్టుపనికి  సొంపును  కూర్చు  కళ. బుటేదారు  పని  కంటే  తక్కువ కాలములో  పెద్ద పెద్ద  రంగులతో  కూడిన  నమూనాలను   తయారు చేయవచ్చు.  మనకు  కావలసిన  అనేక  ఆకారములలో  పుష్పములు  ,ఆకులు  కొమ్మలు  ,  జంతువులు , ఇతర బొమ్మల  నమూనాలను  గుడ్డపై  కత్తిరించి  ఈ  ముక్కలనీ  వేరోక  బట్టపై  నేర్పుతో  కుట్టవలెను.  ప్రస్తుతము  ఈ కళను  బజారు సంచులు  ,  కుషనులు  ,  తెరలు  ,  మేజా గుడ్డలు  మొదలగు  వాటిని  అతి అందముగా  తయారుచేయుటకు  ఉపయోగించుచున్నారు.  నూలు  బట్టలు,  సిల్కు బట్టలు  , ఉన్ని  బట్టలు  మొదలగునవన్నియు ఇందు ఉపయోగింపవచ్చు.
  ఒక  బట్టపై  మనకు  ఇష్టమైన  నమూనాను  అప్లిక్ చేయవలసి  వచ్చినచో  ఒక   ఉల్లిపొర      కాగితము పై  ఆ   బొమ్మలోని  ముఖ్యమైన  భాగములను  విడివిడిగా  గీయవలెను.  తరువాత  ప్రతిభాగమునకు సరిపడుౡ వర్ణములలో  గుడ్డలను కత్తిరించవలెను. పెద్ద పెద్ద  నమూనాలను  తయారుచేయునప్పుడు  frame  ఉపయోగించిన  బట్ట  ముడతలు  పడదు .
    నమూనాను   గుడ్డపై నుంచి   ఇస్ర్తీ  చేయవలెను. తరువాత   నమూనాలో  ఉన్న   ఆకృతులను  వేర్వేరు  రంగులలో   కత్తిరించవలెను.   ఈ  కత్తిరించిన  ముక్కలను  మాదిరిగా  తీసుకొని  వేర్వేరు  రంగు గుడ్డలనేకము  కత్తిరించవలెను. గుడ్డ యొక్క  పడుగు ,  పేక లు  దానిపై   నతుకు నమూనా యొక్క  పడుగు,  పేకల  ననుసరించి  యుండవలెను.  లేనిచో  ఎప్లిక్  కుట్టినప్పుడు  ముడతలు  పడగలవు.
    కత్తిరించిన  ఎప్లిక్  నమూనాలను  దానికి  తగిన  రంగు  చిక్కదనము  గల  అనువైన  అదేరకపు  గుడ్డపైన  అతుకవలెను.  ఎప్లిక్   నమూనాలను   ఒకదానిపై   మరియొక దానిని 
































.

No comments:

Post a Comment