చాతి = 20"
పొడవు = 18" ( భుజము నుండి నడుము క్రింద వరకు )
భుజము = 10"
కలి పొడవు = 13" ( కుర్త పూర్తీ పొడవులో 2/3 వరకు )
కలి వెడల్పు= 7" ( కుర్త భుజములో 2/3 వంతు )
చేతులు :---
పొడవు = 13" ( 2/3 కుర్త పొడవు )
వెడల్పు = 10" ( పూర్తీ భుజము )
అతుకు :---
పొడవు = 3"
వెడల్పు = 3"
నిర్మాణము :--
కుర్త మద్య భాగము :---
A B = 18"
A C = 5"
A B = CD
A C = BD
A E = 1/12 చాతి
A F = 1/12 చాతి
E F = ముందు మెడ గుండ్రముగా కలుపుము .
A G = 1/2"
E G = వెనుక మెడ గుండ్రముగా కలుపుము .
A H = 5" ( 1/4 చాతి వివృతి కై ) కత్తి రించావలెను .
కలిని కత్తిరించుట :---
A B = 7" ( కలి వెడల్పు ) కుర్త భుజములో 2/3 వంతు
A C = 13" ( కలి పొడవు ) కుర్త పూర్తి పొడవులో 2/3 వంతు
A B = C D
A C = B D
A E = 1/12 చాతి
D F = 1/12 చాతి
E F కలుపవలెను .
చేతులు :---
A B = 5"
A C = 13" పొడవు
A C = B D
A B = C D
అతుకు :---
A B = 1/4 చాతి - 2" =3"
A C = 1/4 చాతి - 2" =3"
A B = C D
A C = B D
కుర్త మద్య భాగామునకై కాగితమును మడచుట :---
36" పొడవు 10" వెడల్పు గల కాగితమును తీసుకొని పొడవును మధ్యకు మడచి మడతను పైభాగమున వుంచవలెను .
వెడల్పును మధ్యకు మడచి మడతను కుడివైపున వుంచవలెను .
కుట్టు విధానము :---
1.కుర్త మద్యభాగమునకు ఇరువైపుల కలిలను రన్ అండ్ ఫెల్ అతుకుతో అతుకవలెను .
2.కలిలపై చేతులను కూడ రన్ అండ్ ఫెల్ అతుకుతో అతుకవలెను .
3.చేతులను 1/2" భుజములోనికి వుంచి రన్ అండ్ ఫెల్ అతుకుతో అతకవలెను .
4 . చేతి అంచులను వాలుకుట్టుతో కుట్ట వలెను .
5 .మెడకు క్రాస్ పట్టిలను ఉపయోగించి ఫైసింగ్ తో ముగించావలెను .
6 . వివృతిని మెడ భాగము క్రింద 5" కత్తి రించి రెండు పట్టిలు అతికి ముగించావలెను .
7. వివృతి పై కాజాలను గుండిలను కూడా కుట్ట వలెను .
8 . కుర్త ఇరు వైపులా కలిల చివరిభాగమున 5" విడువవలెను .
సరిపడు బట్ట:---
లాన్ , గ్లాస్కో మొదలగునవి .
No comments:
Post a Comment