Wednesday, April 8, 2026

ఫండమెంటల్స్ అఫ్ టైలరింగ్ -6. ఎలక్ట్రిక్ కత్తెర

ఎలక్ట్రిక్ కత్తెరలు :---కొన్ని విదేశాలలో చాలా తేలికగా మరియు సులభంగా వాడగలిగే ఎలక్ట్రిక్ కత్తెరలు అందుబాటులో ఉన్నాయి

ఫండమెంటల్స్ అఫ్ టైలరింగ్ - 5. బటనహోల్ కత్తెరలు

బటన్‌హోల్ కత్తెరలు :--- మీకు అవసరమైన ఏ పరిమాణంలోనైనా బటన్‌హోల్స్‌ను కత్తిరించడానికి వీటిని సర్దుబాటు చేసుకోవచ్చు . మీరు టైలరింగ్‌లో నిపుణులై, చాలా బటన్‌హోల్స్ కుట్టవలసి వస్తే ఇవి ఉపయోగపడతాయి .

ఫండమెంటల్స్ అఫ్ టైలరింగ్ - 4. పింకింగ్ కత్తెర

పింకింగ్ కత్తెరలు :---- ఇవి బట్ట యొక్క కుట్ల అంచులు మరియు ఇతర ముడి అంచులను పూర్తి చేయడానికి ఉపయోగపడతాయి . ఇవి జిగ్- జాగ్ (గీతలు) వంటి కోత గీతను సృష్టిస్తాయి, ఇది గట్టి బట్టలు చిట్లిపోకుండా నివారిస్తుంది. పింకింగ్ దుస్తుల లోపలి భాగానికి చక్కని రూపాన్ని ఇస్తుంది.

ఫండమెంటల్స్ అఫ్ టైలరింగ్ - 3. డ్రెస్ మేకర్ కత్తెర

డ్రెస్ మేకర్ కత్తెరలు :---బట్టలు కత్తిరించడానికి,
కత్తెరల కంటే షియర్స్ (కత్తెరలు) చాలా అనుకూలంగా ఉంటాయి. షియర్స్‌కు, కత్తెరలకు తేడా ఏమిటంటే, వాటికి బొటనవేలు కోసం ఒక చిన్న రింగ్ హ్యాండిల్, మరియు రెండవ, మూడవ, నాల్గవ వేళ్ల కోసం ఒక పెద్ద రింగ్ హ్యాండిల్ ఉంటుంది. వాటికి పొడవైన బ్లేడ్లు కూడా ఉంటాయి. రివెట్‌కు బదులుగా బోల్ట్ లేదా స్క్రూతో బ్లేడ్లు జతచేయబడి , అధిక నాణ్యత గల స్టీల్‌తో తయారు చేయబడిన వంగిన హ్యాండిల్ ఉన్న షియర్స్‌ను ఎంచుకోవడం మంచిది . మరియు వాటిని కేవలం బట్టలు కత్తిరించడానికి మాత్రమే ఉపయోగించండి. వాటిని కింద పడేయవద్దు లేదా తుప్పు పట్టడానికి వదిలివేయవద్దు.

ఫండమెంటల్స్ అఫ్ టైలరింగ్ - 2. కత్తెరలు

                               కత్తెరలు

కత్తెరలు :--వీటికి  గుండ్రని  హ్యాండిల్స్  ఉంటాయి  మరియు

 బ్లేడ్లు  సాధారణంగా   6 అంగుళాల  కన్నా  తక్కువ. 

ఇవి  ప్రధానంగా  దారాలను  కత్తిరించడానికి రూపొందించబడ్డాయి.

మరియు  కుట్లను  కత్తిరించడానికి. అయితే, 5 అంగుళాల

  బ్లేడ్  ఉన్న  కత్తెరలు  ఉపయోగపడతాయి. ప్రారంభకులు

 బట్టను  కత్తిరించడానికి   కూడా  ఉపయోగిస్తారు.

 ఎంబ్రాయిడరీ  కోసం  మరియు  బటన్‌హోల్స్  కత్తిరించడానికి

 1/2" నుండి 1" పొడవు గల  బ్లేడ్లతో  పదునైన  మొనగల

 కత్తెరలు  అవసరం.చాలా   ఉపయోగకరంగా   ఉంటాయి.

 ఉత్తమ రకాల  కత్తెరలకు  అసమాన  బ్లేడ్‌లు ఉంటాయి.

 వెడల్పు. వెడల్పాటి బ్లేడ్ పైన ఉండేలా  వాటిని  పట్టుకోవాలి.

సన్నని బ్లేడ్.


పైన ఉండేలా పట్టుకోవాలి

ఫండమెంటల్స్ అఫ్ టైలరింగ్ - 1.వస్త్ర నిర్మాణానికి పరికరాలు మరియు సూది పని

 టైలరింగ్ యొక్క ప్రాథమిక అంశాలు

ఫండమెంటల్స్  అఫ్ టైలరింగ్ 

--------------------------------------------------------------------

వస్త్ర నిర్మాణానికి పరికరాలు 


మరియు


సూది పని

కుట్టుపని పెట్టె :--- అన్నిటికంటే ముందుగా, కుట్టుపనికి

అవసరమైన వస్తువులను ఉంచుకోవడానికి అరలు ఉన్న ఒక పెట్టె లేదా బుట్ట మీ దగ్గర ఉండాలి. ప్రతి వస్తువుకు

ఒక స్థలం ఉండేలా దానిలోని వస్తువులను అమర్చండి . కత్తిరించే పనిముట్లు :--- ------------------------------ 1. కత్తెర :--- 2. డ్రెస్ మేకర్ కత్తెర :--- 3. పింకింగ్ కత్తెర :---- 4. బటన్ హోల్ కత్తెర :--- 5. ఎలక్ట్రిక్ కత్తెర :----














Friday, August 4, 2023

KNITTING (నిట్టింగ్ ) --స్వెటరు



KNITTING  

నిట్టింగ్ 

  స్వెటరు 


                                                                         KNITTING

                                                                           స్వెటరు  

 

కావలసిన   వస్తువులు  :--- 

10  ఔన్సుల    ఊలు  

12 వ నెంబర్     సూదులు  - 2

10 వ నెంబర్ సూదులు  - 2 

12 వ నెంబర్    రెండు వైపులా   పదునుగా   వున్న  సూదులు  -  4

( ఇది  మెడ  పట్టి   అల్లునప్పుడు  ఉపయోగపడును . )


 కొలతలు :--

భుజము నుండి   కింద   అంచువరకు   22  అంగుళములు 

ఈ   స్వేటర్    పొడవు  = 22  అంగుళములు

                        వెడల్పు =  36 అంగుళములు

చేతి  పొడవు  =  18 1/2  అంగుళములు

టెన్షన్   :--10  నెంబర్   సూదులతో   7 1/2  కుట్లు    9 1/2  వరుసలు    ఒక 

 చదరపు  అంగుళమునకు   అల్లవలెను  . 

ముందు  భాగము  :---  

12 వ  నెంబరు   సూదుల    నుపయోగించి   121  గుండీలు   ( stitches ) వేయవలెను.  

ఒంటి   రిబ్   3 3/4 

 అంగుళాలు  అల్లవలెను.

మొదటి  వరుస  :--   K1 P1  ఆఖరి   గుండి (stitch  )  K1  రావలెను.  

రెండవ  వరుస :--   P1  K1  ఆఖరి  గుండి (stitch  )  P1  రావలెను.

తరువాత  వరుస  :---  ఒక   వరుస  నిట్  ఒక  వరుస   పర్ల్   అల్లవలెను.

ఈ  విధంగా   అల్లుతూ   ప్రతి  వరుసకు  ఒక  గుండీ ( stitch)  

పెంచుతూ   ,  136  గుండీలు (  stitches)  వచ్చువరకు  

అల్లవలెను.   ఈ    136   గుండీలతో  (stitches  )  13  

అంగుళాలు   అల్లవలెను.

మెడను  విభజించుట :---

మొత్తము     గుండీలను   సరిగ్గా   రెండు 

 సమభాగాలుగా  విభజించవలెను.   68  గుండీలు ( stitches  )

 రెండు   వైపుల   ఉండవలెను.  ఈ    68   గుండీలు (stitches  )

 సూదికి    ఎక్కించుకుని 

 ఎడమవైపు    మెడభాగమును    అల్లవలెను. 

 మిగత   68  గుండీలను  (stitches  ) ఒక   పెద్ద  పిన్నుకు  గాని   ఒక  సూదికి   గాని  ఎక్కించుకొని 

  ఉంచుకోవలెను.

ముందు భాగము  యొక్క  చంకభాగము   షేపు  చేయుట:---

చంక  భాగము   వైపు   8  గుండీలు (  stitches ) ముగించి   మిగత 

 గుండిలను   ( stitches) నిట్  అల్లవలెను.  

తరువాత   వరుస  పర్ల్  అల్లవలెను.

చంకవైపు  రెండు  గుండీలు ( stitches )  కలిపి  నిట్  అల్లి   ,  లైను అంతా   నిట్  అల్లవలెను.

తరువాతి  వరుస   పర్ల్   అల్లవలెను.

ఈ      విధంగా   9  సార్లు   అల్లాలి.   (  అంటే    గుండిలు  ( stitches)తగ్గుతాయి.)

ఇదే  విధంగా   అల్లుతున్నప్పుడు  మెడవైపు   కూడా 

 ప్రతి   5  వ  వరుసకొకసారి   రెండు   గుండిలు ( stitches ) కలిపి 

  నిట్   అల్లవలెను.    

చంక షేపు   వచ్చిన  తరువాత  చంకవైపు   గుండీలు  ( stitches)

తగ్గించడం  మానివేసి     మెడవైపు   ప్రతి   4

  వ  వరుసకు  ఒకసారి   గుండీలు ( stitches )

 తగ్గించవలెను.  ఆఖరికి  36  గుండీలు (stitches )

 వచ్చిన  తరువాత   చంక  భాగము  మొదలు 

 నుండి    8 3/4  అంగుళాలు   పొడవు  వరకు 

 అల్లవలెను .

భుజము  షేపు   చేయుట  :---

మొదటి   వరుస  :---12  గుండీలు   ( stitches )ముగించి   లైను   అంతా    నిట్   అల్లవలెను.   

రెండవ  వరుస  :---పర్ల్    అల్లవలెను.

 మూడవ   వరుస  :----12 గుండీలు  ( stitches )ముగించి   లైను   అంతా   నిట్  అల్లవలెను.

నాలుగవ   వరుస  :---పర్ల్  అల్లవలెను.

ఐదవ వరుస:---12  గుండీలు  ( stitches )  ముగించి   లైను   అంతా   నిట్  అల్లవలెను.

ఇప్పుడు   పిన్నుకు  పెట్టిన    గుండీలను   68

 గుండీలను   (stitches )సూదులకు   ఎక్కించుకొని   ఎడమ 

 వైపున    అల్లిన   విధంగా నే    అల్లవలెను. 

 కుడివైపున   అల్లవలెను.  దీనితో   ముందుభాగము 

  పూర్తిఅగును.   

వెనుక భాగము :--

వెనుక భాగము  కూడా   ముందు   భాగమువలె    చంకవరకు   అల్లుకోవలెను .  


వెనుక   భాగము  యొక్క  చంకభాగము   షేపు చేయుట :---

గుండీలు   (  stitches)  ముగించి   లైను  అంతా   నిట్  అల్లవలెను.

 గుండీలు   (stitches )ముగించి   లైను  అంతా   పర్ల్  అల్లవలెను.

ప్రతి     నిట్  వరుసలో   రెండు  వైపులా    రెండు  గుండీలు  ( stitches )కలిపి   నిట్  అల్లాలి .

తరువాత   వరుస   పర్ల్  అల్లవలెను.

ఈ  విధంగా   108  గుండీలు   (stitches )వచ్చేంత  వరకు  అల్లవలెను.

ముందు   భాగము  భుజముతో  సమానంగా   వచ్చేంత  వరకు  అల్లవలెను.

వెనుక  భాగము  వైపు  భుజము  షేపు  చేయుట :---

మొదటి   వరుస  :--

12  గుండీలు ( stitches ) ముగించి   ఆఖరి  వరకు  నిట్  అల్లాలి.

రెండవ వరుస :-- 12  గుండీలు  (stitches  )ముగించి   ఆఖరి  వరకు  పర్ల్  అల్లాలి.

మూడవ వరుస :-- 

12  గుండీలు ( stitches ) ముగించి   ఆఖరి  వరకు  నిట్  అల్లాలి

నాలుగవ  వరుస  :--

12  గుండీలు  ( stitches )ముగించి   ఆఖరి  వరకు  పర్ల్ అల్లాలి

ఐదవ  వరుస  :--12  గుండీలు ( stitches )ముగించి   ఆఖరి  వరకు  నిట్  అల్లాలి

 ఆరవ వరుస  :-- 12  గుండీలు (stitches  )  ముగించి   ఆఖరి  వరకు  పర్ల్ అల్లాలి.

మిగిలిన   36 గుండీలను  ( stitches)ముగించవలెను.


మెడ   పట్టీ :----

దీనికి    నాలుగు  సూదులు  రెండు    వైపులా     పదునుగా 

  ఉన్నవి  ఉపయోగించవలెను.

ముందుభాగము ,  వెనుక   భాగముల   భుజము లను   కలిపి

   కుట్టిన    తరువాత

Right side   158  గుండీలు  ( stitches ) సూదులకు   

ఎక్కించుకొని     ఒంటి రిబ్   అల్లుటకు  మొదలుపెట్టవలెను . 

' V '  ఆకారము   దగ్గర   ఒక   గుండి (stitch  )  తగ్గించుతూ   మధ్య    కుట్లకు  

SL 1 , K 1 , P . S . S .O , K 2    tog   చొప్పున   వేస్తూ  9   సార్లు   అల్లి 

 ముగించవలెను . 

చేతులు :---

12  వ   నెంబర్   సూదులు  నుపయోగించి    72  గుండీలు  వేయవలెను . 

ఒంటి రిబ్    3   అంగుళములు  వేయవలెను  .  

10  వ   నెంబర్    సూదులకు  మార్చుకొని   స్వేటర్ కు  వేసిన   నమూనాను  వేస్తూ 

అంటే    ఒక   వరుస   నిట్   ఒక   వరుస  పర్ల్   అల్లవలెను  . 


ప్రతి   3  వ   వరుసకు   ,  వ   వరుసకు   రెండు వైపులా   ఒక  గుండి ( stitch )

 పెంచుతూ  116   గుండీలు ( stitches )  వచ్చువరకు   అల్లవలెను .   


తరువాత  ప్రతి   4  వ వరుసకు   రెండువైపులా   ఒక  గుండి  ( stitch )పెంచుతూ  

 126  గుండీలు   వచ్చేంత   వరకూ   గుండీలు  పెంచవలెను. 

ఈ    126   గుండీలతో  ( stitches )  18 1/2 ''   పొడవు    వచ్చువరకు   అల్లవలెను  . 

చేతిపై   భాగము  షేపు   చేయుట  :-- 

మొదటి   వరుస :---  గుండీలు  (stitches  ) ముగించి   నిట్   అల్లవలెను . 

రెండవ    వరుస :--- 5   గుండీలు ( stitches ) ముగించి   పర్ల్  అల్లవలెను . 

మూడవ వరుస   :---   5   గుండీలు(  stitches )   ముగించి   నిట్   అల్లవలెను . 

నాలుగవ   వరుస  :---    గుండీలు  ( stitches ) ముగించి    పర్ల్    అల్లవలెను . 

ఐదవ  వరుస      :---       గుండీలు ( stitches )  ముగించి   నిట్   అల్లవలెను . 

ఆరవ  వరుస      :---      గుండీలు  ( stitches ) ముగించి    పర్ల్    అల్లవలెను . 

ఏడవ  వరుస           :---    గుండీలు  (stitches  ) ముగించి   నిట్   అల్లవలెను . 

ఎనిమిదవ   వరుస   :--   గుండీలు  (stitches  ) ముగించి    పర్ల్    అల్లవలెను . 

తొమ్మిదవ   వరుస      :---2   గుండీలు (stitches  )ముగించి   నిట్   అల్లవలెను . 

పదవ  వరుస    :---    గుండీలు  (stitches ) ముగించి    పర్ల్    అల్లవలెను . 


ఇప్పుడు   రెండు  గుండీలు  ( stitches )కలిపి    నిట్  అల్లి   వరుస   అంతా  నిట్  

అల్లి  ఆఖరి    రెండు    గుండీలు   (stitches  )కలిపి    నిట్    అల్లవలెను  .  

ఈ     విధంగా     30    గుండీలు  (stitches   ) వచ్చేవరకు   అల్లవలెను . 

ఇప్పుడు   30   గుండీలు  (stitches ) ముగించవలెను . 

ఇంకొక  చెయ్యి    కూడా  ఇదే విధంగా    అల్లవలెను . 

                                     భుజములను     ప్రక్క   భాగములను     చేతులను   గట్టి  కుట్టు  తో 

  కుట్టవలెను.