Saturday, December 10, 2011

టైలరింగ్ - 27 .బ్యాండ్ జాకెట్ ( షేపు జాకెట్ )

బ్యాండ్   జాకెట్ 

                            బ్యాండ్ జాకెట్ 
                 















                       
కొలతలు :--- 
చాతి              = 30"
పొడవు          = 1/3 చాతి + 3"=13"
చేతి  పొడవు   = 1/3 చాతి 
భుజము         = 1/6 చాతి + 1 1/2" = 6 1/2"
కాగితపు    కొలతలు :---
పొడవు  = 30"
వెడల్పు  = 18"
కాగితమును   మడచుట :---
వెడల్పును   మధ్యకు   మడచి  మడతను   కుడి  వైపున   వుంచవలెను . పొడవును   మధ్యకు   మడచి  మడతను  పైన  
వుంచవలెను .
నిర్మాణము :---వెనుకభాగము :---
A B   =  పూర్తి  పొడవు  +1" మడతకొరకు
A C   =  1/4 చాతి - 1/2"
C C1 =  1/4 చాతి + 1 1/2"
A D   =   1/2" భుజము + 1/4"
D D1  =  తిన్నగా  క్రిందికి   కలుపుము .
A E    = 1/12  చాతి 
D E1  = 1/2" క్రిందికి   'D'  నుండి 
E E1   = కలుపుము .
A  F    = 1"
E F     = వెనుక   మెడ    ఆకారములో   కలుపుము .
C1 E1  = వెనుక   చంక   కలుపుము .
C C1   =  B B1 
B1 G   =  1/2" లోపలికి 
C1 G   =  కలుపుము .
B G     =  మద్యబిందువు   = X  .
X    వద్ద  డార్ట్   కుట్టవలెను .
డార్ట్   పొడవు  =  3 1/2"
ముందుభాగము :---
A F1  =  5"
E F1  =   ముందుమెడ   గుండ్రముగా   కలుపుము .
C1 E1= ముందు   చంక   ఆకారములో  కలుపుము .
B I     = 3"
X Y    = 2"
G J    =  2"
J I      = వంపుగా   కలుపుము .
బ్యాండ్ :---
 A B   = 3 1/2"
 A C   = 1/4 నడుము 
 A B   = C D
 A C   = B D
 D D1  = 2 1/2"
 E E1  = 2 1/2"
 D1 A  = వంపుగా   కలుపుము .
చేతులు  :--    
A B     = 1/2  భుజము  + 1/4"
A C     = పుర్తిపోడవు + 2"
A B     =  C D
A E     =  1/12 చాతి 
E B     = ముందు  వెనుక   చేతి  ఆకారములో   కలుపుము .
C F     = 1"లోపలికి  
E F     =  ప్రక్కభాగామును   కలుపుము .
కుట్టువిధానము  :---

















1. భుజములను   కలుపుము .
2. ముందు   వెనుక   డార్ట్   లను   కుట్టవలెను .
౩. షేపు   ముక్కలను   అతుకవలెను .
4. హుక్స్   పట్టిలను   అతుకవలెను .
5. మెడను   క్రాస్   పట్టిలను   ఉపయోగించి  పైపింగ్  లేదా  ఫెసింగ్     కుట్టవలెను .
7. చేతులను   అతుకవలెను  .
8 . చేతుల   అడుగు  భాగమున   3/4"  వాలుకుట్టు   కుట్టవలెను .
9.  వెనుక    భాగమున   నడుము   వద్ద   1 1/2"  పట్టిని   అతికి  మడచి   వాలు  కుట్టు   కుట్టవలెను .
10. ప్రక్క   భాగములను   ఆతుక   వలెను .
సరిపడు   బట్ట  :--- 
2/2 , 2/1 ,  రూబీ  మొదలగునవి .
బట్ట   అంచనా  :---రెండు   పొడవులు + రెండు  చేతి   పొడవులు .

----------------------------/\------------------------------

No comments:

Post a Comment