Wednesday, April 15, 2026

ఫండమెంటల్స్ అఫ్ టైలరింగ్ -27. దారపు చివరలను కలపడం

దారపు చివరలను కలపడం :--- తరువాత విప్పకూడని కుట్టు వరుసల చివరలలోని దారాలను కలపడం అవసరం. దీనిని రెండు విధాలుగా చేయవచ్చు. 1. దారాన్ని కత్తిరించే ముందు, కుట్టు అంచు వెంబడి కొద్ది దూరం వెనక్కి కుట్టండి . దీనిని ప్రివోటింగ్ అంటారు. 2. కుట్టు వరుస చివరకు చేరుకున్న తరువాత, దారాన్ని వెనక్కి లాగి, సుమారు 5" నుండి 6" పొడవున దారాలను కత్తిరించండి. చివరి కుట్టును ఒక పిన్నుతో పట్టుకుని, దారపు రెండు చివరలను బట్ట యొక్క వెనుక వైపుకు తీసుకురండి . ఇప్పుడు రెండు ముడులు వేయండి.

No comments:

Post a Comment