చుడిదార్ పైజమా
పొడవు = 24 " ( నడుము నుండి మడమ వరకు )
సంచికై తీసుకొనవలసిన కొలతలు :---పొడవు = 36 " ( 1 1/2" పొడవు = 24"+ 12" = 36" )
వెడల్పు = 18" ( మొత్తము పొడవులో సగము = 36 / 2 = 18" )
సంచిని కుట్టు విధానము :---
1. 36 " పొడవు 18" వెడల్పు గల బట్టను తీసికొని
మూలలను A B C D లు గా గుర్తించవలెను .
ఒకే వైపునకు వచ్చును . కనుక ఎడమవైపు మూలలను E E1 గా గుర్తించవలెను . పై భాగమున
E నుండి AB వరకు క్రిందిభాగమున E1 నుండి CD వరకు
కుట్ట వలెను .
౩. E మరియు E1 మూలల యందు వచ్చునట్లు
అమర్చిన A B C D లు మధ్యకు వచ్చును .తిరిగి
మూలలను X L, MY లుగా గుర్తించవలెను . XL
ను దగ్గరకు చేర్చి టాకా వేసి మిషను చేయవలెను .
అదే విధంగా MY ని దగ్గరకు చేర్చి టాకా వేసి
మిషను చేయవలెను . ఈ విధంగా కుట్టిన సంచి
పూర్తిగా మూయబడును .
4. పటములో నున్న విధంగా సంచి పై భాగమును
క్రింది భాగమును కత్తిరించిన సంచి రెండు వైపులా
తెరువబడును .
5 . అతుకులు పటము 5 లో వున్నట్లు అమర్చవలెను .
6 .అమర్చినదానిపై భాగమున పొడవు నందు 3 భాగములు ,
వెడల్పునందు 3 భాగములుగా విభజించి డబ్బాలుగా గీయవలెను . మధ్యనున్న డబ్బామూలలను PQRS గా గుర్తించవలెను . PS ను తిన్నని గీత తో కలిపి PYS 3/4"
మరియు PXS 3/4 " వంపుతో కలుపవలెను . ఈ మద్య భాగాన్ని రుమాలి అని అందురు .
7. సంచిని కత్తిరించిన తరువాత అతుకులను కాలి భాగమున రాకుండా అమర్చి నమునాను గీయుట .
C C1 = 1/2 కాలి చుట్టుకొలత + 1/2 "
C1P = కలుపవలెను .
B B1 = 1/2 కాలి చుట్టుకొలత + 1/2 "
B1 S = కలుపవలెను .
కత్తిరించు విధానము :---
C1PXSB1 వరకు కత్తిరించవలెను .తిరిగి PYS ను
కత్తిరించిన రుమాలి వేరుగా వచ్చును .
కుట్టువిధానము :---
1.రెండు పైంచాలకు మద్య రుమాలిని అతుకవలెను .
2.క్రింది భాగము 1/2" మడచి వాలు కుట్టు కుట్టవలెను .
3.కాలి దగ్గర వివృతి 5 " బాండును అతుకవలెను .
4.అతుకులు ఒకవైపు ముందుభాగామునకు ఇంకొకవైపు
వేనుకభాగామునకు వచ్చును .
సరిపడు బట్ట :---
పోలిస్టర్ , కాటన్ , పట్టు మొదలగునవి .
బట్ట అంచనా :--- 5 మీటర్లు .
------------------------------------\/--------------------------------------------
No comments:
Post a Comment