షల్వార్
1.
షల్వార్
కొలతలు :---
సీటు = 24"
పొడవు = చాతి- 2" = 22"
పాదపు చుట్టుకొలత =10 "
ఈ దుస్తు నందు రెండు భాగాలుండును . మొదటి భాగాన్ని పైంచా రెండవ భాగాన్ని కలి అని అందురు . దుస్తును పూర్తీ చేయుటకు ఒక్కొక్క వైపునకు ఒక పైంచా రెండు కలిలు అవసరము .
పైంచా :---
కొలతలు :--
పొడవు = 22"
వెడల్పు = 10" ( పాదపు చుట్టుకొలత )
కాగితమును మడచుట :---
44" పొడవును 20 " వెడల్పు గల కాగితాన్ని తీసికొని వెడల్పును మధ్యకు మడిచి మడతను కుడివైపున వుంచవలెను . పొడవును మధ్యకు మడవవలెను .మడతను పైనవుంచావలెను . పైన కత్తిరించిన రెండు పైంచాలు వచ్చును .
నిర్మాణము :---
A B = 22" + 1 1/2"
A C = 1/2 పాదపు చుట్టుకొలత
A B = C D
కలి :---
పొడవు = 22" + 1 1/2" మడతకొరకు
వెడల్పు = 1/3 సీటు + 2" నుండి 6" వరకు కలుపవచ్చును .
A B = పూర్తి పొడవు
A C = 1/3 సీటు + 2"
A D = 1/3 సీటు + 1"
D D1 = 1/3 సీటు + 2"
C D1 = కలుపుము .
A A1 = 1 1/2"
C C1 = 1 1/2"
A1 C1 = కలుపుము .
B E = 2"
D1 E = కలుపుము .
నమునానుపయోగించి బట్టను కత్తిరించుట :---
బట్టను నిలువుగా మడచి పైంచాను బట్టపై నుంచి
కుట్టుటకు 1/2" వదిలి కట్టిరించావలెను . అదే విధంగా 4 కలిలను కత్తిరించావలెను .
కుట్టువిధానము :---
1.
1. పైంచా రెండు వైపులా కలిలను సాధారణ అతుకుతో
అతకవలెను .
2 .పై నడుము భాగాన్ని మడచి టకా వేసి మిషనుతో కుట్టవలేను.
౩. క్రింది భాగాన్ని 2" లేక 3" పొడవు 12" వెడల్పుతో
దళసరి బట్టను కత్తిరించి క్రింది కాలి భాగానికై ఉపయోగించి దానిపై జిగజాగ్ డిజిను కుట్టవలేను .
సరిపడు బట్ట :---
ప్రింటెడ్ కాటన్ , పోప్లిన్ ,పోలిస్టర్ మొదలగునవి .
------------------------------------/\---------------------------------------
No comments:
Post a Comment