పైజమా
పైజమా
కొలతలు :--
సీటు = 18"
పొడవు = సీటు + 4"( నడుము నుండి మడమ వరకు )
కాగితపు నమూనా కొలతలు :--
పొడవు = 22 + 3" = 25" (1 1/2" నడుము మడతకు
( 1 1/2" కాలి మడతకు )
వెడల్పు = 1/3 + 3" = 9" మడతపై
52" పొడవు , 18" వెడల్పు గల కాగితమును తీసికొని
వెడల్పును మధ్యకు మడచి మడతను కుడివైపున వుంచవలెను . పొడవును మధ్యకు మడచి మడతను
పైన ఉంచవలెను .
నిర్మాణము :---
ముందుభాగము :---
A A1 = 1 1/2" మడత కొరకు
A1 B = పూర్తిపోడవు B B1 = 1 1/2" అడుగున మడత కొరకు
A C = 1/3 సీటు + 1"
C C1 = 1/3 సీటు +1 /12 సీటు
A D = 1/3 సీటు
D D1 = తిన్నగా కలుపుము .
A C = D D1
D1 X = 1/6 సీటు పైకి
C1 X D వంపుతో కలుపుము .
B1 E = 1/3 సీటు + 1"
E E1 = 1/3 సీటు + 1 1/2"
C1 E1 E వంపుగా కలుపుము .
వెనుక భాగము :---
D H = 1" పైకి
A H = కలుపుము .
C1 H = కలుపుము .
C1 F = 1" బయటికి
E F1 = 1" బయటికి
F H = వంపుగా కలుపుము.
F F1 = వంపుగా కలుపుము .
నమునాను కత్తిరించుట :-- ముందుగా వెనుక భాగామునకై
A H D F F1 ను కత్తిరించావలెను . కాగితపు నమునాను తెరచి పై రెండు పొరలను ముందుభాగామునకై A D X C1 E1 E లను కత్తిరించావలెను .
కాగితపు నమూనా ఉపయోగించి బట్టను కత్తిరించుట :--
బట్ట నిలువును మధ్యకు మడచి మడతపై నమూనా ముందు భాగము నుంచి కుట్టునకు 1/2" వదిలి గీత గీసి
కత్తిరించావలెను . అదే విధంగా వెనుక భాగము కూడా కత్తిరించావలెను .
1. ఒక ముందుభాగము ఒక వెనుక భాగము కలిపి
గట్టికుట్టు వాలు కుట్టు ఉపయోగించి కుట్టిన అతుకుతో
( రన్ అండ్ ఫెల్ ) కుట్టవలేను .
2. మద్య భాగము కూడా రన్ అండ్ ఫెల్ అతుకుతో కుట్టవలేను .
౩. నడుము భాగము మరియు కాలి భాగము మడతలు లేకుండా మడచి టాకా వేసి మిషను చేయవలెను .
సరిపడు బట్ట :---
లాన్ క్లాత్ , టేరికాటన్ మరియు తెల్లని బట్టలు , గీతలున్న బట్టలు .
బట్ట అంచనా :---
రెండు పొడవులు + ౩".
----------------------------------------/\-----------------------------------------
No comments:
Post a Comment