మరకలు
బట్టపై అసలు రంగును మరుగు పరచు విధంగా మచ్చ పడిన యెడల దానిని మరక అని
అందురు .
కొన్ని మరకలను తొలగించు విధానము :----
1.మరక :-- కాఫీ , టీ
తెల్లటి నూలు :-- మరకపై వేడి నీటిని పోయవలెను .
రంగు నూలు :-- 1. గోరు వెచ్చని నీటిలో నానబెట్ట వలెను .
2. ఒక కప్పు నీటిలో టీ చెంచా బోరాక్స్ ద్రవానములో నాన బెట్ట వలెను .
పట్టు , ఉన్ని :--రంగు నూలుకు ఉపయోగించు విధానము .
కృత్రిమ వస్త్రాలు :-- సోడియం పెర్బోరేట్ ద్రవములొ నాన బెట్టవలెను.
( రెండు కప్పుల నీటిలో 1/4 టీ చెంచాడు సోడియం పెర్బోరేట్ )
========================================================================
2. మరక :--- సిరా
తెల్లటి నూలు :--- 1. మరకపై నిమ్మరసము లేదా టమటా రసము రుద్ది ఉప్పు రుద్దవలెను .
2. పుల్లటి పెరుగు లో నాన బెట్టి వేడి నీళ్ళతో జాడించ
వలెను .
రంగు నూలు :--- తెల్లటి నూలుకు చేసిన విధానమే .
పట్టు ఉన్ని :--- తెల్లటి నూలుకు చేసిన విధానమే .
కృత్రిమ వస్త్రాలు :--- తెల్లటి నూలుకు చేసిన విధానమే .
=========================================================================
3. మరక :--- రక్తము
తెల్లటి నూలు :--- ఉప్పు కలిపిన చల్లని నీటిలో నాన బెట్ట వలెను . లేక చల్లని నీటిలో ఉతక వలెను .
రంగు నూలు :--- తెల్లటి నూలుకు చేసిన విధానమే .
పట్టు ఉన్ని :--- తెల్లటి చేసిన విధానమే .
కృత్రిమ వస్త్రాలు :--- తెల్లటి నూలుకు చేసిన విధానమే .
==========================================================================
4. మరక :--- కిల్లి
తెల్లని నూలు :--- సబ్బు తో ఉతక వలెను . పొటాసియం పెర్మంగనేట్ కలిపిన
నీటిలో నాన బెట్టి ఆగ్జాలిక్ అమ్లమును ఉపయోగించి
మరకను తొలగించి వెంటనే నీటిలో శుబ్రముగా ఉతక వలెను .
రంగు నూలు :--- తెల్లటి నూలుకు చేసిన విధానమే .
పట్టు ఉన్ని :--- తెల్లటి చేసిన విధానమే .
కృత్రిమ వస్త్రాలు :--- తెల్లటి నూలుకు చేసిన విధానమే .
=========================================================================
బట్టల మీద బాల్ పాయింట్ ఇంక్ మరకలు పోవడానికి కొంచెం దూదిని స్పిరిట్, దీన్ని ఏ మందుల దుకాణంలో అయినా అమ్ముతారు, లో ముంచి తుడిస్తే ఆ మరకలు చక్కగా పోతాయి. అలాగే రక్తం మరకలు పోవడానికి దూదిని మందుల దుకాణాలలో అమ్మే హైడ్రోజెన్ పెరాక్సైడ్లో ముంచి తుడిస్తే ఫలితం ఉంటుంది.
ReplyDelete